Orange re release: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా చేసిన సినిమాల్లో.. భారీ డిజాస్టర్ అయిన సినిమాల్లో ఆరెంజ్ (Orange )మూవీ ఒకటి. ఈ సినిమాకి నాగబాబు(Nagababu) నిర్మాతగా వ్యవహరించగా.. సినిమా ఫ్లాప్ అవ్వడంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. అయితే అలాంటి ఆరెంజ్ మూవీ మ్యూజిక్ పరంగా ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఆరెంజ్ మూవీ అభిమానులకు మరొక గుడ్ న్యూస్.. అదేంటంటే ఆరెంజ్ మూవీని మళ్లీ రీ రిలీజ్ చేయాలి అని మూవీ మేకర్స్ భావిస్తున్నారట. మరి ఆరెంజ్ మూవీ రీ రిలీజ్ ఎప్పుడు అనేది ఇప్పుడు చూద్దాం..
బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన ఆరెంజ్ మూవీ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘చిరుత’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత వచ్చిన ‘మగధీర’ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. రెండో సినిమాతోనే రాజమౌళి(Rajamouli )డైరెక్షన్లో వచ్చి భైరవగా ఎంతో మంది ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్నాడు రామ్ చరణ్. కానీ ఆ తర్వాత మూడో సినిమాగా వచ్చిన ఆరెంజ్ మూవీ మాత్రం భారీ డిజాస్టర్ అయింది. ఈ సినిమాలో జెనీలియా(Genelia), షాజన్ పదంసీ (Shajan padamsee) లు హీరోయిన్స్ గా చేశారు.ఈ సినిమా ఎవరైనా సరే ఎక్కువ రోజులు ప్రేమించలేరు.. ఎక్కువ రోజులు వారి మధ్య ప్రేమ అనేది ఉండదు అనే కాన్సెప్ట్ తో వచ్చింది. అయితే యూత్ కి సంబంధించి ఎంతో మంచి కాన్సెప్ట్ తో ఆరెంజ్ సినిమా వచ్చినప్పటికీ అప్పటి ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించలేదు. దాంతో ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది.2010 నవంబర్ 26న విడుదలైన ఆరెంజ్ మూవీ భారీ ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమాకి నిర్మాతగా చేసిన నాగబాబు చాలా అప్పుల్లో కూరుకుపోయాడు. అంతేకాదు నాగబాబు అప్పటివరకు సంపాదించిన డబ్బంతా ఆరెంజ్ మూవీతో పోయిందని అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి.
విడుదలైనప్పుడు ఫ్లాప్.. రీ రిలీజ్ లో భారీ హిట్..
కట్ చేస్తే.. ఈ సినిమా 2023లో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేశారు. అయితే డిజాస్టర్ అయిన సినిమాని రీ రిలీజ్ చేయడం ఎందుకని అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. కానీ రీ రిలీజ్ లో ఆరెంజ్ మూవీ సరికొత్త సంచలనం సృష్టించింది.ఈ సినిమాకు భారీ కలెక్షన్లు రావడంతో రీ రిలీజ్ లో ఆరెంజ్ మూవీ మంచి హిట్ కొట్టింది. ఇక ఈ సినిమాకి వచ్చిన లాభాలను నాగబాబు జనసేన పార్టీకి ఇచ్చేశారు. అయితే ఈ సినిమా 2010లో ఉన్న యూత్ కంటే 2020 లో ఉన్న యూత్ కే ఎంతో కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమాను చూడడానికి యూత్ చాలామంది థియేటర్లకు పరుగులు పెట్టారు. దాంతో ఇప్పటి జనరేషన్ కి ఆరెంజ్ మూవీ కరెక్ట్ గా సెట్ అయింది అని చాలామంది అనుకున్నారు. ఈ విషయం పక్కన పెడితే.. ఒక్కసారి రీ రిలీజ్ అయిన సినిమాని మళ్లీ రీ రిలీజ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడరు. కానీ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీని మళ్లీ రీ రిలీజ్ చేయాలి అని మూవీ మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
మళ్లీ రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న ఆరెంజ్..
ఆరెంజ్ మూవీని ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న మరోసారి రీ రిలీజ్ చేయనున్నట్టు ఒక పోస్టర్ వదిలారు మేకర్స్. దీంతో ఆరెంజ్ మూవీ లవర్స్ అందరూ పండగ చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఆరెంజ్ మూవీ మళ్లీ రీ రిలీజ్ లో కలెక్షన్లు ఎక్కువ వసూళ్లు చేస్తే మాత్రం ఈ సినిమా హిస్టరీ క్రియేట్ చేసినట్టే అని మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
రామ్ చరణ్ సినిమాలు..
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. జనవరి 10న విడుదలైన గేమ్ ఛేంజర్ మూవీ భారీ డిజాస్టర్ అవ్వడంతో చెర్రీ తన నెక్స్ట్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ RC 16 అనే వర్కింగ్ టైటిల్ తో బుచ్చిబాబు సనా (Bucchibabu sana) దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ని తీసుకున్నారు. అలాగే ఈ మూవీలో ఓ పాత్ర కోసం మహా కుంభమేళ 2025 లో ఫేమస్ అయిన మోనాలిసా(Monalisa) ని కూడా తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.