Aishwarya Rajesh: చాలావరకు సౌత్ హీరోయిన్లు ఇక్కడ భాషల్లో సినిమాలు చేసిన తర్వాత వెంటనే నార్త్‌పై దృష్టిపెడతారు. కానీ చాలా తక్కువమంది సౌత్ హీరోయిన్లు మాత్రమే నార్త్‌లో సక్సెస్ అయ్యారు. కానీ అందులో ఒక్క తెలుగు హీరోయిన్ కూడా లేదు. ఇప్పటివరకు ఏ తెలుగమ్మాయి కూడా బాలీవుడ్‌కు వెళ్లి తన సత్తా చాటుకుంది లేదు. అలాంటిది ఒక తెలుగమ్మాయి మాత్రం హిందీలో ఒక బ్లాక్‌బస్టర్ సినిమాలో నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తను మరెవరో కాదు.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేమ్ ఐశ్వర్య రాజేశ్. తాజాగా తను నటించిన హిందీ సినిమా గురించి బయటపడింది. అంత సూపర్ హిట్ సినిమాలో ఐశ్వర్యను అప్పట్లో గమనించలేకపోయారు ప్రేక్షకులు.
బాలీవుడ్‌లో ఛాన్స్
తెలుగు యాక్టర్ల ఫ్యామిలీలో జన్మించింది ఐశ్వర్య రాజేశ్. ఎలాగో సినిమా ఫ్యామిలీ కాబట్టి తనకు కూడా సినిమాల్లోకి ఎంటర్ అవ్వాలనే కోరిక తనలో మొదలయ్యింది. కానీ తను నటి అవ్వడం అంత ఈజీగా జరగలేదు. నేరుగా తనకు హీరోయిన్ ఛాన్సులు కూడా రాలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే తన కెరీర్ మొదలుపెట్టింది. పలు తమిళ చిత్రాల్లో కనీసం ప్రేక్షకులు గుర్తించలేని పాత్రలు కూడా చేసింది. అలా మెల్లగా తనకు హీరోయిన్‌గా కూడా అవకాశాలు వచ్చాయి. హీరోయిన్‌గా తను చేసిన మొదటి మూవీ నుండి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా చేసింది. ఎన్నో తమిళ చిత్రాల్లో నటించిన తర్వాత ఒక హిందీ మూవీలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసింది ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh).
గ్యాంగ్‌స్టర్ డ్రామా
1970, 80ల్లో ముంబాయ్‌లో డాన్, పొలిటీషియన్‌గా పేరు తెచ్చుకొని దావూద్ ఇబ్రహీంను సైతం ఎదిరించిన అరుణ్ గావ్లీ జీవితకథ ఆధారంగా ‘డాడీ’ అనే హిందీ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా 2017లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో అరుణ్ గావ్లీ పాత్రలో అర్జున్ రాంపాల్ నటించాడు. తన భార్య జుబేద ముజావర్ అలియాస్ ఆశా గావ్లీగా ఐశ్వర్య రాజేశ్ కనిపించింది. ఇలాంటి ఒక బయోపిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో ఐశ్వర్య నటన అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కానీ ఎందుకో ఆ తర్వాత తనకు బాలీవుడ్‌లో అవకాశాలు మాత్రం రాలేదు. అందుకే మళ్లీ తమిళ ఇండస్ట్రీపైనే తన ఫోకస్ పెరిగింది.
Also Read: శివకార్తికేయన్, సుధా కొంగర మూవీ టైటిల్ ఫిక్స్.. లేడీ పవర్ కనిపిస్తోందిగా.!
‘సంక్రాంతికి వస్తున్నాం’తో హిట్
తమిళంలో ఎన్నో సినిమాలు చేసినా కూడా మలయాళంలో మాత్రం ఐశ్వర్య రాజేశ్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ చేసిన ఒకటి, రెండు సినిమాలే తనను మాలీవుడ్‌కు కూడా దగ్గర చేశాయి. అదే సమయంలో తనకు తెలుగులో కూడా ఛాన్సులు వచ్చాయి. ముందుగా తను తమిళంలో హీరోయిన్‌గా నటించిన ‘కానా’ మూవీనే తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’గా రీమేక్ అయ్యింది. ఈ మూవీతోనే మొదటిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత కూడా పలు తెలుగు చిత్రాల్లో నటించినా తనకు అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. కానీ ఇన్నాళ్ల తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’తో ఐశ్వర్య ఖాతాలో సరైన హిట్ పడింది.