BigTV English
Advertisement

Free Amazon Prime Subscription: ‘ఎవరికీ చెప్పకు’.. ఫ్రీగా అమెజాన్ ప్రైమ్.. ఈ ట్రిక్ ట్రై చేయండి చాలు!

Free Amazon Prime Subscription: ‘ఎవరికీ చెప్పకు’.. ఫ్రీగా అమెజాన్ ప్రైమ్.. ఈ ట్రిక్ ట్రై చేయండి చాలు!

Free Amazon Prime Subscription: పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ యూజర్లకు పంగలాంటి వార్త. ఇప్పుడు Amazon Prime ఉచితంగా అందుబాటులో ఉంది. దీంతో మీకు కావలసినన్ని వెబ్ సిరీస్‌లు, సినిమాలను చూడండి. అనేక ఒరిజినల్ షోలు, వెబ్ సిరీస్‌లు, సినిమాలు ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అవుతున్నాయి.


వీటిలో చాలా షోలు ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. మీరు Amazon Prime వీడియో సబ్‌స్క్రిప్షన్ కోసం విడిగా పేమెంట్ చేయకుడదు అనుకుంటే.. మీకు ఈ ట్రిక్ చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎంచుకున్న ప్లాన్‌ల నుండి రీఛార్జ్ చేయడం ద్వారా మీరు ఈ OTT సబ్‌స్క్రిప్షన్ నుంచి కంటెంట్‌ను పూర్తిగా ఉచితంగా చూడవచ్చు.

Airtel Users
రూ. 699- ఎయిర్‌టెల్ ఈ రీఛార్జ్ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటితో వస్తుంది. డైలీ 3GB డేటా వస్తుంది. ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్స్‌తో పాటు ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS వంటి బెనిఫిట్స్ అందిస్తుంది. ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ఇందులో అందుబాటులో ఉంది.


Also Read: తట్టుకోవడం కష్టమే.. HMD నుంచి మూడు బడ్జెట్ ఫోన్లు.. పక్కా బ్లాక్ బస్టర్!

రూ. 999- అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించే ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్ 84 రోజుల వాలిడిటీ ఉంటుంది. ఇది రోజుకు 2.5GB డేటా, అన్ని నెట్‌వర్క్‌ల అన్‌లిమిటెడ్ కాలింగ్, ఇతర బెనిఫిట్స్ అందిస్తుంది. ఎయిర్‌టెల్ రెండు ప్లాన్‌లు కూడా అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తున్నాయి.

Jio Users
రూ. 857- అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించే జియో చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్ రూ. 857. ఇది 84 రోజుల పాటు వాలిడిటీతో వస్తుంది. 2GB డైలీ డేటాతో పాటు అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు ప్రతిరోజూ 100 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో జియో యాప్‌లకు యాక్సెస్ కూడా అందుబాటులో ఉంది.

రూ. 1,198- రిలయన్స్ జియో యాజర్లు 84 రోజుల వాలిడిటీతో ఈ ప్లాన్‌లో దీని ముందు ప్లాన్ అన్ని బెనిఫిట్స్ లభిస్తాయి. అయితే, JioTV ప్రీమియం ప్లాన్ అయినందున ఇది Amazon Prime కాకుండా మొత్తం 15 OTT సేవలకు సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది.

Also Read: రియల్‌మీ దుమ్ములేపింది.. కిల్లర్ ఫోన్ లాంచ్.. ఇది చాలా స్పెషల్ గురూ!

రూ. 3,227 – ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో పూర్తి ఒక సంవత్సరం వాలిడిటీని అందిస్తోంది. Jio 2GB డైలీ డేటా, డైలీ 100 SMS, అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. ఈ ప్లాన్ ఒక సంవత్సరం పాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ బెనిఫిట్ అందిస్తుంది.

రూ. 4,498- ఇది అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించే జియో అత్యంత ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్‌తో పాటు 14 ఇతర OTTలను 365 రోజుల వాలిడిటీతో యాక్సెస్ ఇస్తుంది. ఈ ప్లాన్‌లోనూ ఇంతకముందు ఉన్న ప్లాన్ అన్ని బెనిఫిట్స్ ఉంటాయి.

Vi Users
రూ. 3,199 – Vi కస్టమర్లకు ఫ్రీ అమెజాన్ ప్రైమ్‌కు యాక్సెస్ ఉన్న ఏకైక ప్లాన్. ఇది 365 రోజుల వాలిడీటితో వస్తుంది. 2GB డైలీ డేటాతో పాటు, అన్‌లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS, 50GB అదనపు డేటా వంటి బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.

Tags

Related News

Emojis: ఎప్పుడైనా ఆలోచించారా.. ఎమోజీలు పసుపు రంగులోనే ఎందుకుంటాయో?

Japanese Helmet: ముఖం మీద ఫోన్ పడేసుకుంటున్నారా? ఇదిగో జపాన్ గ్యాడ్జెట్, మీ ఫేస్ ఇక భద్రం!

APK Files: ఏదైనా లింక్ చివరన apk అని ఉంటే.. అస్సలు ఓపెన్ చేయొద్దు, పొరపాటున అలా చేశారో..

Realme Discount: 50 MP ట్రిపుల్ కెమెరా గల రియల్‌‌మి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై రూ15000 డిస్కౌంట్.. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే

Apple Satellite Features: నెట్ వర్క్ లేకున్నా అవి చూసేయొచ్చు, ఆపిల్ యూజర్లకు పండగే పండుగ!

AI Browser Risk: ఏఐ బ్రౌజర్లు ప్రమాదకరం.. బ్యాంక్ అకౌంట్లు ఖాళీనే.. హెచ్చరిస్తున్న నిపుణులు

Google Gemini Pro: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై గూగుల్ జెమిని ప్రో ఫ్రీగా వాడుకోవచ్చు!

Free AI: ఉచిత ఏఐ ఒక ఉచ్చు.. భారతీయులే వారి ప్రొడక్ట్!

Big Stories

×