Apple iOS 27.3: యాపిల్ తమ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ iOS 27.3 మొదటి డెవలపర్ బీటాను విడుదల చేసింది. ఇందులో ఐఫోన్ యూజర్లకు ఉపయోగపడే పలు కొత్త ఫీచర్లు, మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా హెల్త్ యాప్ కొత్త డిజైన్‌తో అందుబాటులోకి రాగా.. ఆడియో ఇంటెలిజెన్స్, సఫారీ, డార్క్ మోడ్‌లో కూడా మార్పులు చేసింది. ఐఫోన్‌తో పాటు ఐప్యాడ్, మ్యాక్, యాపిల్ వాచ్ ఇతర డివైజ్‌లకు కూడా కొత్త బీటా అప్‌డేట్స్‌ను అందించింది. ఇంతకీ ఈ అప్‌డేట్‌లో ఏమేం కొత్తగా వచ్చాయో చూద్దాం.
iOS 27.3లో యాపిల్ హెల్త్ యాప్‌కు కొత్త లుక్ తీసుకొచ్చింది. గతంలో కంటే సులభంగా ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను చూసుకునేలా దీన్ని మార్చింది. యూజర్లు తమ ఆరోగ్య సమాచారాన్ని మరింత సులభంగా అర్థం చేసుకునేలా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. రోజువారీ హెల్త్ వివరాలను చూసేవారికి ఈ కొత్త డిజైన్ ఉపయోగపడుతుంది.
ఈ అప్‌డేట్‌లో ఆడియో ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ఫీచర్లు కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. సిరి రీక్యాప్, లైవ్ రివైండ్ వంటి ఫీచర్లను యాపిల్ వాచ్‌లో తీసుకొస్తోంది. వీటితో ఆడియో అనుభవం మరింత మెరుగవుతుంది. అయితే ఈ ఫీచర్లలో కొన్ని ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నాయి. కాబట్టి.. బీటా వెర్షన్‌లో అందరికీ అన్ని ఫీచర్లు కనిపించకపోవచ్చు.
Also Read: వాచ్‌తో ECG తీసి డాక్టర్‌కు రిపోర్ట్ పంపొచ్చు.. భారత్‌లోకి వచ్చిన గార్మిన్ కొత్త ఫీచర్ ఇదే!
యాపిల్ తమ ఏఐ ఫీచర్లను చైనాలోని యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే ప్రస్తుత బీటాలో సిరి ఏఐ ఫీచర్ మాత్రం కనిపించడం లేదు. మరోవైపు డెవలపర్ల కోసం కొత్త సిరి ఏఐ డెవలపర్ ప్రివ్యూను విడుదల చేసింది. దీని ద్వారా డెవలపర్లు తమ యాప్స్‌ను సిరి ఏఐతో అనుసంధానం చేసుకోవచ్చు.
iOS 27.3లో సఫారీ బ్రౌజర్‌కు వెర్టికల్ ట్యాబ్స్‌ను తీసుకొచ్చింది. అడాప్టివ్ డార్క్ మోడ్ కూడా కొత్తగా అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ డ్యూ కోసం రీచబిలిటీ యాక్సెసిబిలిటీ ఫీచర్‌ను జోడించింది. అలాగే స్టాండ్‌బై మోడ్‌ను మరింత మెరుగుపరిచింది. ఐఫోన్ డ్యూ తరహా ఫంక్షనాలిటీని సపోర్ట్ చేసే ఇతర ఐఫోన్ మోడళ్లకు కూడా అందిస్తోంది. మొత్తంగా ఈ అప్‌డేట్‌లో యూజర్ల రోజువారీ వినియోగాన్ని సులభం చేసే మార్పులకు యాపిల్ ప్రాధాన్యం ఇచ్చింది. అయితే ఇవన్నీ ప్రస్తుతం డెవలపర్ బీటాలో ఉన్నందున, తుది అప్‌డేట్‌లో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది.
Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ల వర్షం.. ఆసుస్ పాపులర్ ల్యాప్‌టాప్‌పై ఏకంగా రూ.18,000 తగ్గింపు!