Jio 3 Year Plan: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ఏటా రీచార్జ్ చేసుకునే టెన్షన్ లేకుండా ఏకంగా 3 సంవత్సరాల పాటు అన్‌లిమిటెడ్ సేవలను అందించే సరికొత్త ‘3 ఇయర్ అన్‌లిమిటెడ్ కనెక్టివిటీ ప్లాన్’ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సరికొత్త ప్లాన్ ధరను ఏకంగా రూ. 10,000గా జియో నిర్ణయించింది. ఈ ప్లాన్ ఇవాళ (నవంబర్ 7) నుంచే యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు అనేక రకాల ప్రయోజనాలను జియో ఆఫర్ చేస్తోంది. దీనిని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 36 నెలల (3 సంవత్సరాలు) సుదీర్ఘ వ్యాలిడిటీతో పలు సేవలను యూజర్లు పొందొచ్చు. అన్‌లిమిటెడ్ 5G డేటాతో పాటు, ఎలాంటి పరిమితులు లేని వాయిస్ కాల్స్ యూజర్లకు లభించనున్నాయి. అలాగే 5G డేటాకు అర్హులు కానీ వారికి ప్రతీరోజూ 2.5GB డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఉపయోగించుకోవచ్చు.
కాలింగ్, డేటాతో పాటు ఓటీటీ, క్లౌడ్ స్టోరేజ్, డిజైనింగ్ సేవలను కూడా జియో ఈ ప్లాన్‌లో ఉచితంగా అందిస్తోంది. ముఖ్యంగా యూజర్లకు జియోహాట్‌స్టార్ మొబైల్ + హాలీవుడ్ యాక్సెస్ ను అందిస్తోంది. దీని ద్వారా లైవ్ స్పోర్ట్స్, సినిమాలు, సిరీస్ లతో పాటు హాలీవుడ్ కంటెంట్‌ను సైతం ఫ్రీగా వీక్షించవచ్చు. మరోవైపు కాన్వా ప్రో లైట్ సేవలను సైతం 12 నెలల పాటు ఆఫర్ చేస్తోంది. దీని సాయంతో ప్రీమియం డిజైన్ టెంప్లేట్లను యూజర్లు క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను భద్రపరుచుకునేందుకు 50GB ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యాన్ని సైతం జియో కల్పిస్తోంది.
Also Read: వైట్‌హౌస్‌లో ఊహించని పరిణామం.. సుసీ వైల్స్ అవుట్.. కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్!
ఈ సరికొత్త 3 ఏళ్ల ప్లాన్ ఇప్పటికే రీఛార్జ్ చేసుకోవడానికి అందుబాటులోకి వచ్చింది. మైజియో యాప్, అధికారిక వెబ్‌సైట్ (Jio.com) లోకి వెళ్లి దీనిని రీఛార్జ్ చేసుకోవచ్చు. లేదంటే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ పేమెంట్స్ యాప్స్ ద్వారా కూడా ఈ రూ.10,000 ప్లాన్ ను దక్కించుకోవచ్చు. ఇందుకోసం ఆయా యాప్స్ లోని రీఛార్జ్ సెక్షన్ కు వెళ్లి జియో నెంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం రూ.10 వేల ప్లాన్ పై క్లిక్ చేసి.. పేమెంట్ చేసే రీఛార్జ్ ప్రక్రియ పూర్తవుతుంది.