E-Paper
Advertisement

భూమికి మరో చంద్రుడు.. రహస్యంగా చక్కర్లు కొడుతూ, ఎట్టకేలకు దొరికేశాడు!

భూమికి మరో చంద్రుడు.. రహస్యంగా చక్కర్లు కొడుతూ, ఎట్టకేలకు దొరికేశాడు!
Advertisement

భూమికి ఉపగ్రహం చంద్రుడు. ఇది కాకుండా ఇప్పుడు మరో ‘చంద్రుడు’ కూడా పుట్టుకొచ్చాడు. ఔనా.. ఇదెప్పుడు జరిగింది? అని అనుకుంటున్నారా? మీరే కాదు.. ఖగోళ శాస్త్రవేత్తలు కూడా అదే అనుకుంటున్నారు. ఎందుకంటే.. వాళ్లకు కూడా ఈ విషయం ఇప్పుడిప్పుడే తెలిసింది. ఎప్పుడూ అంతరిక్షంలో నజర్ ఉంచే.. మన పరిశోధకులు ఇదెలా మిస్ అయ్యారని అనుకుంటున్నారా? అది తెలియాలంటే ముందుగా మీరు.. అసలు ఈ రెండో చంద్రుడు ఎవరనేది తెలుసుకోవాలి.

నాలుగు నెలలు పాటు.. భూమి చుట్టూ తిరుగుతూ..

చంద్రుడు ఎప్పుడూ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మనం కూడా దాన్ని కళ్లతో స్పష్టంగా చూడగలం. అయితే, చంద్రుడి తరహాలోనే మరో చిన్న గ్రహం.. భూమికి అభిమానిగా మారింది. గత నాలుగు నెలలుగా ఖగోళ పరిశోధకుల కళ్లుగప్పి.. రహస్యంగా భూమి చుట్టూ తిరుగుతుంది. ఎలాంటి కదలిక లేకుండా.. అంతరిక్షంలో తేలుతూ.. భూమి వైపు తదేకంగా చూస్తూ.. మైమరిచిపోతోంది.

మన కళ్లకు ఎందుకు కనపడటం లేదు?

Advertisement

చంద్రుడు అని పిలించాం కదా అని దాన్ని నిజమైన చంద్రుడు అనుకోవద్దు. భూమికి ఉండే ఉపగ్రహాలను చంద్రుడితో పోల్చడం సాధారణమే. వాస్తవానికి ఇది ఒక గ్రహశకలం. దాదాపు మన ఇంట్లో ఉండే 10 లీటర్ల వాషింగ్ మెషీన్ సైజు ఉంటుంది. అందుకే ఇది మన కంటికి కనిపించడం లేదు. ఈ గ్రహశకలం ఎప్పుడో దారితప్పి భూమి వైపుకు వస్తూ.. గురుత్వాకర్షణ శక్తికి చిక్కుకుపోయింది. గత కొన్ని నెలలుగా భూమి చుట్టూ తిరుగుతోంది.

కొండపై నుంచి చూసి గుర్తింపు.. దీని పేరు 2026 QQ8

చివరికి ఈ గ్రహశకలాన్ని క్రిస్టియన్ సార్నెక్జీ అనే ఓ హంగేరియన్ ఖగోళ శాస్త్రవేత్త గుర్తించడంతో ఈ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 20న ఉత్తర హంగేరిలోని ఓ కొండపై ఉన్న పిస్కెస్టెటో అబ్జర్వేటరీ టెలిస్కోప్ ద్వారా దీన్ని కనుగొన్నారు. ఈ చిన్న గ్రహశకలానికి ఖగోళ శాస్త్రవేత్తలు 2026 QQ8 అని నామకరణం చేశారు. అక్టోబర్ 29న ప్లానెట్ సెంటర్ కూడా దీని తాత్కాలిక ఉపగ్రహ స్థితిని ధ్రువీకరించింది. కొన్ని నెలలుగా ఇది భూమికి రెండో చంద్రుడిగా కొనసాగుతున్నట్లు పేర్కొంది. మొదట్లో ఇది చాలా మసకగా కనిపించడంతో శక్తివంతమైన టెలిస్కోప్‌ల సాయంతో దాని ఉనికిని గుర్తించారు.

ఇంతకీ ఇది ఎక్కడ నుంచి వచ్చింది?

Advertisement

భూమికి మరో చంద్రుడు పుట్టుకొచ్చాడనే విషయం తెలిస్తే.. సాధారణంగానే ప్రజల్లో ఆసక్తి, ఖగోళ శాస్త్రవేత్తల్లో కుతూహలం పెరుగుతుంది. అందుకే.. ఇప్పుడు ఆ గ్రహశకలం ఎక్కడ నుంచి వచ్చింది? అది ఏ కక్ష్యలో తిరుగుతోంది? భూమి చుట్టూ తిరుగుతోందా? అంటూ దాని పుట్టుపుర్వోత్తరాలు తెలుసుకొనే పనిలో పడ్డారు. మొదట్లో ఇది సహజంగా ఏర్పడిన గ్రహశకలమా లేక అంతరిక్షంలో మిగిలిపోయిన పాత రాకెట్ భాగమా అనే సందేహం కలిగింది. ఎందుకంటే అంతరిక్షంలోని వ్యర్థాలు కూడా సహజంగా ఏర్పడిన గ్రహశకలాల తరహాలోనే ప్రయాణిస్తుంటాయి.

ఇది సహజంగా ఏర్పడిన గ్రహశకలమే!

దీని గురించి తెలియగానే పరిశోధకులు.. గ్రహశకలంగా గుర్తించలేదు. దాన్ని ఒక వస్తువుగానే గుర్తించారు. దీని అసలు గుట్టు తెలుసుకోడానికి హవాయి, అరిజోనాలోని శక్తివంతమైన టెలిస్కోప్‌ల సాయంతో మరిన్ని పరిశీలనలు చేశారు. సూర్యుడి నుంచి వచ్చే కాంతి.. ఈ వస్తువు కదలికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అధ్యయనం చేశారు. చివరికి ప్లానెట్ సెంటర్ పరిశోధనలో ఇది కృత్రిమ అంతరిక్ష వస్తువు కాదని తెలుసుకున్నారు. ఇది సహజంగా ఏర్పడిన చిన్న గ్రహశకలమేనని గుర్తించారు.

దీని పరిమాణం 3 అడుగులు మాత్రమే..

చంద్రుడు అంటే.. చాలా పెద్దగా, గుండ్రంగా వెలిగిపోతూ ఉంటుందని భావిస్తాం. కానీ, ఇది చాలా బుల్లి చంద్రుడు. దీని పరిమాణం కేవలం 3 అడుగులు మాత్రమే. ఒక వేళ ఇది భూమి వాతావరణంలోకి ప్రవేశించినా.. పూర్తిగా భూమిని చేరే అవకాశం తక్కువ. వాతావరణంలోనే కాలిపోతుంది. కాబట్టి.. దీనివల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేదు. వాస్తవానికి చిన్న గ్రహశకలాలు ఎక్కువ రోజులు ఉనికిలో ఉండవు. ఈ బుల్లి చంద్రుడు డిసెంబర్ వరకు భూమి గురుత్వాకర్షణ ప్రభావంలో ఉండి.. ఆ తర్వాత దాని పరిధి నుంచి బయటపడే అవకాశాలున్నాయి. ఒక వేళ అది భూమి వాతావరణంలోకి రాకపోతే.. 2027లో మళ్లీ సూర్యుడి చుట్టూ తన కక్ష్యలో ప్రయాణం కొనసాగిస్తుందని అంచనా.

చంద్రుడికి.. తాత్కాలిక చంద్రుడికి తేడా ఏమిటీ?

చంద్రుడు.. భూమి చుట్టూ ఒక నిర్దిష్ట్య కక్ష్యలో తిరుగుతాడు. అయితే, కొత్త చంద్రుడు 2026 QQ8 మాత్రం విచిత్రమైన కక్ష్యలో ప్రయాణిస్తాడు. ఒక వస్తువు భూమి గురుత్వాకర్షణ శక్తికి గురై.. తాత్కాలికంగా భూమి చుట్టూ తిరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు ‘హిల్ స్పియర్’ అని పిలుస్తారు. ఈ పరిధిలోకి వచ్చినప్పుడు.. భూమి గురుత్వాకర్షణ శక్తి ఆ వస్తువును తాత్కాలికంగా తన వైపు ఆకర్షించి.. ఉపగ్రహంగా మార్చుకుంటుంది. 2026 QQ8 కూడా ఈ పరిధిలోకి రావడంతో భూమికి తాత్కాలిక చంద్రుడిగా మారింది.

చంద్రుడి కంటే దూరంగా..

ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే? ఈ గ్రహశకలం భూమికి మరీ దగ్గరగా రాలేదు. భూమికి, ఆ గ్రహశకలం కక్ష్యకు మధ్య కనీస దూరం సుమారు 5.7 కిలోమీటర్లు. అంటే భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న సగటు దూరం కంటే సుమారు ఒకటిన్నర రెట్లు ఎక్కువ. ఈ గ్రహశకలం భూమి దగ్గరకు రావడం ఇదే మొదటి సారి కాదు. 1965లో కూడా ఇది భూమికి దగ్గరగా వచ్చింది. అయితే అప్పుడు భూమి గురుత్వాకర్షణ పరిధిలో చిక్కుకోలేదు.

Also Read: ఆకాశం నుంచి మాంసం ముక్కల వాన.. భయంతో జనాలు పరుగులు, ఎక్కడంటే?

గురుత్వాకర్షణ పరిధిలో ఉన్నా.. అది భూమిపై ఎందుకు పడటం లేదు?

భూమి గురుత్వాకర్షణ పరిధిలోకి ఏదైనా వస్తువు వస్తుంది అంటే.. అది భూమిపై పడిపోడానికి వచ్చినట్లు కాదు. దానికి, దీనికి చాలా తేడా ఉంది. భూమి దాన్ని ఆకర్షిస్తున్నా.. అది ఎందుకు పడిపోవడం లేదనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. భూమికి తన గురుత్వాకర్షణ శక్తితో అంతరిక్షంలో ఉండే వస్తువును తనవైపు లాక్కుంటుంది. అయితే, ఆ వస్తువును పక్కకు వెళ్లే వేగం కూడా ఉంటే అది నేరుగా భూమిపై పడకుండా.. భూమి చుట్టూ తిరుగుతుంది. భూమి చంద్రుడిని కూడా తనవైపు లాక్కుంటుంది. అయినప్పటీకీ చంద్రుడు భూమిపై పడిపోవడం లేదు. ఎందుకంటే.. చంద్రుడికి భూమి చుట్టూ ప్రయాణించే వేగం ఉంది. గురుత్వాకర్షన శక్తి, ఆ ప్రయాణ వేగం కలిసి చంద్రుడిని నిర్దిష్ట కక్ష్యలో ఉంచుతున్నాయి. 2026 QQ8 గ్రహశకలం విషయంలో కూడా ఇదే జరుగుతోంది.

Tags

Related News

రూ.581కే..పవర్‌ఫుల్ బ్లూటూత్ స్పీకర్!డోంట్ మిస్

రూ.401కే 5W పవర్‌ఫుల్ బ్లూటూత్ స్పీకర్..బేస్ అదిరిపోతుంది

ఓట్స్‌తో హెల్దీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్..5 నిమిషాల్లో రెడీ అవుతుంది

యూట్యూబ్ యాప్‌లో భారీ మార్పులు.. సబ్‌స్క్రిప్షన్స్ ట్యాబ్ మాయం.. కొత్తగా ఏమొచ్చాయంటే?

బడ్జెట్ ధరలో బెస్ట్ బ్లూటూత్ హెడ్‌సెట్..గోబోల్ట్ టెనెట్ లాంచ్!

ఏసీ, టీవీ కొనేటప్పుడు సేల్స్‌మెన్ చెప్పే ఈ మాటలు అస్సలు నమ్మకండి.. లేదంటే భారీగా నష్టపోతారు!

ఏఐ వల్ల తప్పు జరిగితే టెలికాం కంపెనీలదే బాధ్యత.. యూజర్ల భద్రతా దృష్ట్యా TRAI కొత్త ప్రతిపాదనలు!

Big Stories

Advertisement
×