E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో బెస్ట్ బ్లూటూత్ హెడ్‌సెట్..గోబోల్ట్ టెనెట్ లాంచ్!

బడ్జెట్ ధరలో బెస్ట్ బ్లూటూత్ హెడ్‌సెట్..గోబోల్ట్ టెనెట్ లాంచ్!
Advertisement

GOBOULT Tenet: టెక్నాలజీ మారుతున్న కొద్దీ.. వైర్లు లేని ఇయర్‌ బడ్స్ వాడకం విపరీతంగా పెరిగింది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు పాటలు వినడానికి, ఆఫీస్ కాల్స్ మాట్లాడడానికి.. ఇవి చాలా సౌకర్యంగా ఉంటాయి. అయితే.. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ అందించే ఇయర్‌ బడ్స్ దొరకడం కాస్త కష్టమే. ఈ సమస్యకు చెక్ పెడుతూ ప్రముఖ ఆడియో బ్రాండ్ గోబోల్ట్ మార్కెట్లోకి తెచ్చిన అద్భుతమైన గాడ్జెట్ ఇది. నియాన్ గ్రీన్ కలర్ లో లభించే ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ప్రస్తుత మార్కెట్లో కేవలం రూ. 1,299ధరతో అందుబాటులో ఉన్నాయి. ఈ ధరలో ఇన్ని ఫీచర్లు లభించడం నిజంగా విశేషం. ఈ ఇయర్ బడ్స్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

1. అద్భుతమైన 75 గంటల బ్యాటరీ లైఫ్:

ఈ ఇయర్‌బడ్స్ మెయిన్ హైలైట్ దీని బ్యాటరీ బ్యాకప్. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి ఇది ఏకంగా 75 గంటల పాటు నిరంతరం పని చేస్తుంది. అంటే.. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి మళ్లీ ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు, సుమారు 120 నిమిషాల పాటు నాన్‌ స్టాప్ మ్యూజిక్ లేదా టాకింగ్ ఎంజాయ్ చేయెచ్చు.

2. లేటెస్ట్ బ్లూటూత్ 5.4, డ్యూయల్ పేరింగ్:

Advertisement

కనెక్టివిటీ విషయంలో.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు.. ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ వీ5.4 టెక్నాలజీని అందించారు. దీని వల్ల ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌కు ఇయర్‌ బడ్స్ క్షణాల్లో కనెక్ట్ అవుతాయి, సిగ్నల్ కట్ అయ్యే సమస్య ఉండదు. అలాగే ఇందులో ‘డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ’ఫీచర్ ఉంది. దీని సహాయంతో ఒకే సమయంలో మీ ల్యాప్‌టాప్ ,స్మార్ట్‌ఫోన్ రెండింటికి ఇయ ర్‌బడ్స్‌ను కనెక్ట్ చేసుకొని ఈజీగా మారొచ్చు.

3. క్వాడ్ మైక్ ఈఎన్‌సీ, బూస్టెడ్ బేస్:

మ్యూజిక్ లవర్స్ కోసం ఇందులో ప్రత్యేకమైన 13mm డైనమిక్ డ్రైవర్లను వాడారు. ఇవి ‘బూస్టెడ్ బేస్’ ఫీల్ అందిస్తాయి. దీని వల్ల పాటల్లోని బీట్స్ చాలా స్పష్టంగా, పవర్ ఫుల్ గా వినిపిస్తాయి. అలాగే.. ఆఫీస్ మీటింగ్స్.. లేదా ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు బయటి సౌండ్స్ అడ్డుకోవడానికి ‘క్వాడ్ మైక్ ఈఎన్‌సీ’టెక్నాలజీ ఉపయోగపడుతుంది.రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఉన్నప్పటికీ మీ గొంతు అవతలి వారికి చాలా స్పష్టంగా వినిపిస్తుంది.

Advertisement

Also Read: శాంసంగ్ ట్యాబ్‌లపై భారీ డిస్కౌంట్‌లు..అస్సలు మిస్సవ్వొద్దు

4. యాప్ సపోర్ట్, గేమింగ్ మోడ్ :

ఈ బడ్జెట్ ఇయర్‌బడ్స్‌లో ప్రత్యేకంగా ‘గోబోల్ట్ యాప్’సపోర్ట్ లభిస్తుంది. ఈ యాప్ ద్వారా టచ్ కంట్రోల్స్ మార్చుకోవడం, ఈక్వలైజర్ సెట్టింగ్స్ కస్టమైజ్ చేసుకోవడం వంటివి చేయెచ్చు. అంతే కాకుండా గేమింగ్ ఆడేవారి.. కోసం ఇందులో ప్రత్యేకమైన అల్ట్రా-లో లేటెన్సీ గేమింగ్ మోడ్ కూడా ఉంది. దీని వల్ల గేమింగ్ సమయంలో.. ఆడియో ,వీడియో మధ్య ఎలాంటి ఆలస్యం జరగదు. వర్కౌట్లు చేసే టప్పుడు చెమట పడినా పాడవకుండా ఉండేందుకు ఇది IPX5 వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది.

కేవలం రూ.1,299 ధర పరిధిలో 75 గంటల బ్యాటరీ బ్యాకప్, బ్లూటూత్ 5.4, క్వాడ్ మైక్ ఈఎన్‌సీ , యాప్ సపోర్ట్ వంటి ఎన్నో ప్రీమియం ఫీచర్లు కోరుకునే.. వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మీరు తక్కువ బడ్జెట్‌లో.. బెస్ట్ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కొనాలని చూస్తున్నట్లయితే దీనిని ఎంజాయ్ చేయెచ్చు.

Related News

ఏసీ, టీవీ కొనేటప్పుడు సేల్స్‌మెన్ చెప్పే ఈ మాటలు అస్సలు నమ్మకండి.. లేదంటే భారీగా నష్టపోతారు!

ఏఐ వల్ల తప్పు జరిగితే టెలికాం కంపెనీలదే బాధ్యత.. యూజర్ల భద్రతా దృష్ట్యా TRAI కొత్త ప్రతిపాదనలు!

ఇకపై రీల్స్ వైరల్ అవ్వడం చాలా ఈజీ.. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో ఇన్‌స్టాగ్రామే చెప్తుంది!

నాయిస్ నుంచి మరో కొత్త స్మార్ట్‌వాచ్..అమోలెడ్ డిస్ల్ ప్లే, ఏఐ ఫీచర్లతో లాంచ్!

Airtel గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. రూ.219కే 12 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్.. వివరాలు ఇవే!

రూ.2,599కే అదిరిపోయే..స్మార్ట్‌వాచ్!బోట్ నుంచి కొత్త గాడ్జెట్

ఇంటర్నెట్ అక్కర్లేదు.. భారత్ సొంతంగా తీసుకొచ్చిన స్వదేశీ పవర్‌ఫుల్ ఏఐ మోడల్స్ ఇవే!

Big Stories

Advertisement
×