Usman Khawaja On Sandand Paper Controversy: ఆస్ట్రేలియాపై ఆ జట్టు మాజీ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) సంచలన ఆరోపణలు చేశాడు. తమ జట్టులో ఉన్న ప్లేయర్లందరూ దుర్మార్గులేనని.. ప్రతి ఒక్కరూ బాల్ టాంపరింగ్ చేస్తారని బాంబు పేల్చాడు. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా చేసిన బాల్ టాంపరింగ్ మొదటిదేం కాదని… గతంలో కూడా శాండ్ పేపర్ ( Sandand Paper Controversy) లాంటి వివాదానికి తెరలేపారని ఆరోపణలు చేశాడు. ప్రతి మ్యాచ్ లోనూ బాల్ టాంపరింగ్ చేయాలని డ్రెస్సింగ్ రూమ్ లోనే తమ జట్టు చర్చించుకుంటుందని సీక్రెట్ రివ్యూ చేశాడు. మ్యాచ్ గెలవడమే ముఖ్యంగా ప్రతి ప్లేయర్ బాల్ టాంపరింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుపై ఉస్మాన్ ఖవాజా చేసిన వ్యాఖ్యలు దుమారం వెళ్తున్నాయి.
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథ సబ్ర్ విడుదలకు ముందు సిడ్ని మోర్నింగ్ హెరాల్డ్ లో క్రికెట్ ఆస్ట్రేలియా గురించి సంచలన విషయాలను బయట పెట్టాడు. 2018 సంవత్సరంలో కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన శాండ్ పేపర్ వివాదంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్ క్రాఫ్ట్ ముగ్గురే దోషులు కారని… ఆస్ట్రేలియా జట్టులో ఉన్న అందరూ ఈ వివాదంలో భాగస్వామ్యులేనని తెలిపాడు. బాల్ టాంపరింగ్ అంశాన్ని ముందే డ్రెస్సింగ్ రూమ్ లో ప్లేయర్లతో పాటు సపోర్ట్ స్టాఫ్ చర్చించుకున్నారని.. కానీ ఇరుక్కుంది మాత్రం ఈ ముగ్గురు మాత్రమేనని వెల్లడించాడు. బాల్ టాంపరింగ్ లో తాను కూడా భాగస్వామ్యున్నేనని తెలిపాడు.
కేప్ టౌన్ మ్యాచ్ కంటే ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ సందర్భంగా కూడా తమ ఆస్ట్రేలియ క్రికెటర్లు శాండ్ పేపర్ ఉపయోగించారని ఉస్మాన్ ఖవాజా ఆరోపణలు చేశాడు. కానీ అప్పుడు ఆ విషయం బయటపడలేదన్నాడు. బంతిని ఎలా మార్చాలి ? అనే దానిపై డ్రెస్సింగ్ రూమ్ లోనే ప్లేయర్ల మధ్య సరదాగా చర్చ జరుగుతుందని బాంబు పేల్చాడు. ఆస్ట్రేలియా క్రికెట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇదే పని చేస్తారని వెల్లడించాడు. కానీ ఈ శాండ్ పేపర్ వివాదంలో ఇరుక్కున్న కేవలం ముగ్గురిని మాత్రమే దోషులుగా తేల్చి క్రికెట్ ఆస్ట్రేలియా చేతులు దులుపుకుందని మండిపడ్డాడు. ఆ రోజున జట్టులో ఉన్న సభ్యులందరూ బాధ్యులేనని.. అందరిని విచారిస్తే అసలు నిజం బయటపడేదని ఘాటుగా విమర్శలు చేశాడు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియాపై ఉస్మాన్ ఖవాజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.