E-Paper
Advertisement

ఓట్స్‌తో హెల్దీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్..5 నిమిషాల్లో రెడీ అవుతుంది

ఓట్స్‌తో హెల్దీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్..5 నిమిషాల్లో రెడీ అవుతుంది
Advertisement

Healthy oats breakfast: ప్రతిరోజూ ఉదయం ఏం తినాలి? బరువు తగ్గాలంటే ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ చేయాలి? అనే టెన్షన్ చాలామందిలో ఉంటుంది. ఈ ప్రశ్నకు డాక్టర్లు ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్న ఏకైక సమాధానం ‘ఓట్స్’. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తూ, అనవసరమైన కొవ్వును కరిగించడంలో ఓట్స్ అద్భుతంగా పని చేస్తాయి. అందుకే.. ప్రస్తుతం చాలా మంది బ్రేక్ ఫాస్ట్ కోసం ఓట్స్‌కు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓట్స్‌తో రోజూ ఒకే లాంటి ఉప్మా కాకుండా.. ఎంతో రుచి కరంగా రకరకాల బ్రేక్‌ ఫాస్ట్‌లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఓట్స్ ఓట్స్ ఉప్మా :

మన రుచికరమైన ఉప్మాను ఓట్స్‌తో చాలా రుచికరంగా తయారు చేసుకోవచ్చు.

Advertisement

తయారీ విధానం: ప్యాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, బఠానీలు వంటి కూరగాయల ముక్కలు వేసి బాగా వేయించాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరగబెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు రోల్డ్ ఓట్స్ వేసి సన్నని మంటపై ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుంటే వేడి వేడి ఓట్స్ ఉప్మా రెడీ! ఇది ఉదయం పూట జీర్ణక్రియను మెరుగు పరచడమే కాకుండా కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.

2. చాక్లెట్ లేదా ఫ్రూట్ ఓవర్ నైట్ ఓట్స్:

ఉదయం పూట వంట చేయడానికి అస్సలు టైమ్ లేని బ్యాచిలర్స్ , ఆఫీస్‌కు వెళ్లేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Advertisement

తయారీ విధానం: రాత్రి పడుకునే ముందు ఒక గాజు గిన్నెలో ఓట్స్ తీసుకుని, అందులో కాచిన పాలు కలపి ఫ్రిజ్ లో పెట్టాలి. ఉదయం లేచి చూసేసరికి ఓట్స్ మెత్తగా తయారవుతాయి. దీనికి ఉదయం పూట కొద్దిగా తేనె, బాదం పప్పులు, అరటిపండు లేదా ఆపిల్ ముక్కలు వేయాలి.దీన్ని నేరుగా తింటే ఎంతో టేస్టీగా ఉండటంతో పాటు రోజంతా ఉత్సాహాన్ని ఇస్తుంది.

3. ఓట్స్ దోశ లేదా పాన్ కేక్స్ :

దోశ లవర్స్ కోసం ఓట్స్‌తో చేసే హెల్దీ దోశ అద్భుతమైన ఛాయిస్. మైదా లేదా బియ్యం పిండికి బదులుగా ఓట్స్‌ను వాడటం ఆరోగ్యానికి చాలా మంచిది.

తయారీ విధానం: ఓట్స్‌ను మెత్తని పొడిలా చేసుకోవాలి. అందులో కొద్దిగా గోధుమ పిండి లేదా రవ్వ, తగినన్ని మజ్జిగ, ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోశ పిండిలా కలుపుకోవాలి. పెనం మీద నూనె వేసి దోశలా పోసుకుంటే క్రిస్పీగా ఉండే ఓట్స్ దోశ రెడీ అవుతుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ ఫుడ్.

ఓట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

బరువు తగ్గుదల: ఓట్స్‌లో పీచు పదార్థం విరివిగా లభిస్తుంది. ఇది తిన్న తర్వాత కడుపు నిండిన భావనను ఇస్తుంది. తద్వారా పదే పదే ఆహారం తినాలనే కోరిక తగుతుంది.

గుండె ఆరోగ్యం: ఓట్స్‌లోని బీటా-గ్లూకాన్ అనే ఫైబర్ రక్తంలోని.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయ పడుతుంది.

షుగర్ కంట్రోల్ : షుగర్ వ్యాధిగ్రస్తులకు ఓట్స్ అద్భుతమైన ఆహారం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రిస్తుంది.

ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ కోసం మార్నింగ్ చేసే బ్రేక్ ఫాస్ట్ పునాది. కెమికల్స్ లేని, పోషకాలు నిండిన ఓట్స్‌ను మీ డైలీ మార్నింగ్ బ్రేక్‌ ఫాస్ట్‌లో భాగం చేసుకోండి. రుచితో పాటు ఆరోగ్యాన్ని సొంతం చేసుకొని మీ రోజును ఎనర్జిటిక్‌గా.. ప్రారంభించండి!

Related News

యూట్యూబ్ యాప్‌లో భారీ మార్పులు.. సబ్‌స్క్రిప్షన్స్ ట్యాబ్ మాయం.. కొత్తగా ఏమొచ్చాయంటే?

బడ్జెట్ ధరలో బెస్ట్ బ్లూటూత్ హెడ్‌సెట్..గోబోల్ట్ టెనెట్ లాంచ్!

ఏసీ, టీవీ కొనేటప్పుడు సేల్స్‌మెన్ చెప్పే ఈ మాటలు అస్సలు నమ్మకండి.. లేదంటే భారీగా నష్టపోతారు!

ఏఐ వల్ల తప్పు జరిగితే టెలికాం కంపెనీలదే బాధ్యత.. యూజర్ల భద్రతా దృష్ట్యా TRAI కొత్త ప్రతిపాదనలు!

ఇకపై రీల్స్ వైరల్ అవ్వడం చాలా ఈజీ.. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో ఇన్‌స్టాగ్రామే చెప్తుంది!

నాయిస్ నుంచి మరో కొత్త స్మార్ట్‌వాచ్..అమోలెడ్ డిస్ల్ ప్లే, ఏఐ ఫీచర్లతో లాంచ్!

Airtel గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. రూ.219కే 12 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్.. వివరాలు ఇవే!

Big Stories

Advertisement
×