E-Paper
Advertisement

ఏసీ, టీవీ కొనేటప్పుడు సేల్స్‌మెన్ చెప్పే ఈ మాటలు అస్సలు నమ్మకండి.. లేదంటే భారీగా నష్టపోతారు!

ఏసీ, టీవీ కొనేటప్పుడు సేల్స్‌మెన్ చెప్పే ఈ మాటలు అస్సలు నమ్మకండి.. లేదంటే భారీగా నష్టపోతారు!
Advertisement

Extended Warranty: కొత్త టీవీ, ఫ్రిజ్ లేదా ఏసీ కొనేటప్పుడు షాప్‌లోని సేల్స్ మెన్ ఎక్స్‌టెండెడ్ వారంటీ తీసుకోమని ఒత్తిడి తెస్తుంటారు. ఆన్‌లైన్ షాపింగ్‌లోనూ ఇదే ఆప్షన్ చూస్తుంటాం. భవిష్యత్తులో రిపేర్ ఖర్చులు తగ్గించుకోవడానికి ఇది మంచిదే అనిపిస్తుంది. కానీ ప్రతిసారీ వారంటీ కోసం అదనంగా డబ్బులు పెట్టడం సరైన నిర్ణయమేనా అంటే కాదనే చెప్పాలి. అసలు ఎక్స్‌టెండెడ్ వారంటీకి డబ్బులు చెల్లించే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం.

ఎక్స్‌టెండెడ్ వారంటీ అంటే?

కొత్త ఎలక్ట్రానిక్ వస్తువుతో కంపెనీ కొంతకాలం సాధారణ వారంటీ ఇస్తుంది. ఈ సమయంలో తయారీ లోపం వల్ల సమస్య వస్తే.. నిబంధనల ప్రకారం ఉచితంగా రిపేర్ చేస్తారు లేదా అవసరమైన భాగాన్ని మారుస్తారు. ఆ గడువు ముగిసిన తర్వాత కూడా మరికొంతకాలం కవరేజ్ కొనసాగించేందుకు తీసుకునే ప్లానే ఎక్స్‌టెండెడ్ వారంటీ. ఉదా: ఫ్రిజ్‌కు రెండేళ్ల వారంటీ ఉంటే.. అదనంగా మరో ఏడాది లేదా రెండేళ్లు తీసుకునే అవకాశం ఉండొచ్చు. అయితే అన్ని ప్లాన్లలో ఒకే రకమైన రక్షణ ఉండదు.

వారంటీని ఎవరు ఇస్తున్నారు?

Advertisement

మీరు తీసుకుంటున్న ఎక్స్‌టెండెడ్ వారంటీ కంపెనీ నేరుగా ఇస్తోందా లేదా ఏదైనా థర్డ్ పార్టీ ఏజెన్సీ ఇస్తోందా అనేది మొదట చూడాలి. బ్రాండ్ కంపెనీ ఇచ్చే వారంటీ అయితే సర్వీస్ వేగంగా, నమ్మకంగా ఉంటుంది. అదే థర్డ్ పార్టీ కంపెనీలు అయితే క్లెయిమ్ ప్రక్రియ కష్టంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి వారంటీ ఇచ్చే సంస్థ నమ్మకమైనదో కాదో ముందే సరిచూసుకోవాలి.

Also Read: ఏఐ వల్ల తప్పు జరిగితే టెలికాం కంపెనీలదే బాధ్యత.. యూజర్ల భద్రతా దృష్ట్యా TRAI కొత్త ప్రతిపాదనలు!

కవరేజ్ ఎంతవరకు ఉంటుంది?

Advertisement

వారంటీ కార్డులో ఉన్న ప్రతి భాగానికి ఉచితంగా రిపేర్ చేయరనే విషయం గుర్తుంచుకోవాలి. కొన్ని ప్లాన్లు కేవలం డిస్‌ప్లే లేదా కంప్రెసర్ వంటి కొన్ని ప్రధాన విడిభాగాలకు మాత్రమే వర్తిస్తాయి. మరికొన్ని ప్లాన్లలో చిన్న చిన్న స్పేర్ పార్ట్స్‌ను మినహాయిస్తారు. అందుకే పేమెంట్ చేసే ముందే దేనికి కవరేజ్ ఉంది, దేనికి లేదు అనేది క్లియర్‌గా చదువుకోవాలి.

నిబంధనలు సరిగ్గా చదవండి:

యాక్సిడెంటల్ డ్యామేజ్, ఫిజికల్ డ్యామేజ్ లేదా కరెంట్ షాక్ వల్ల అయ్యే సమస్యలకు చాలా కంపెనీలు ఉచిత సర్వీస్ ఇవ్వవు. అలాగే సర్వీస్ చేయడానికి టెక్నీషియన్ వచ్చినప్పుడు విజిటింగ్ ఛార్జీలు లేదా ఇన్స్‌పెక్షన్ ఫీజులు వేరుగా ఉంటాయా అనేది తెలుసుకోవాలి. ఈ హిడెన్ నిబంధనలు తెలియకపోతే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఖర్చును బేరీజు వేసుకోండి:

మీరు కొనే ప్లాన్ ధర సుమారు రూ.5,000 ఉందనుకుంటే.. ఆ వస్తువు రిపేర్‌కు ఎంత ఖర్చవుతుందో అంచనా వేయాలి. తక్కువ ధరకు దొరికే స్పేర్ పార్ట్స్ ఉండే వస్తువులకు ఎక్కువ డబ్బులు పెట్టి వారంటీ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రీమియం టీవీలు, పెద్ద ఏసీల వంటి ఖరీదైన సాధనాలకైతేనే ఇవి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి.. సేల్స్ మెన్ మాటలు నమ్మి వెంటనే డబ్బులు పెట్టకుండా, అవసరాన్ని బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

Also Read: ఇకపై రీల్స్ వైరల్ అవ్వడం చాలా ఈజీ.. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో ఇన్‌స్టాగ్రామే చెప్తుంది!

Tags

Related News

ఏఐ వల్ల తప్పు జరిగితే టెలికాం కంపెనీలదే బాధ్యత.. యూజర్ల భద్రతా దృష్ట్యా TRAI కొత్త ప్రతిపాదనలు!

ఇకపై రీల్స్ వైరల్ అవ్వడం చాలా ఈజీ.. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో ఇన్‌స్టాగ్రామే చెప్తుంది!

నాయిస్ నుంచి మరో కొత్త స్మార్ట్‌వాచ్..అమోలెడ్ డిస్ల్ ప్లే, ఏఐ ఫీచర్లతో లాంచ్!

Airtel గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. రూ.219కే 12 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్.. వివరాలు ఇవే!

రూ.2,599కే అదిరిపోయే..స్మార్ట్‌వాచ్!బోట్ నుంచి కొత్త గాడ్జెట్

ఇంటర్నెట్ అక్కర్లేదు.. భారత్ సొంతంగా తీసుకొచ్చిన స్వదేశీ పవర్‌ఫుల్ ఏఐ మోడల్స్ ఇవే!

పండుగ ఆఫర్ల పేరుతో భారీ సైబర్ మోసాలు.. ఆన్‌లైన్ షాపింగ్‌లో సేఫ్‌గా ఉండండిలా!

Big Stories

Advertisement
×