E-Paper
Advertisement

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.51 కే అపరిమిత 5G డేటా.. ఇది కదా ప్లాన్ అంటే!

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.51 కే అపరిమిత 5G డేటా.. ఇది కదా ప్లాన్ అంటే!
Advertisement

Jio 51 Plan: దేశంలో 5G సేవలను వినియోగించాలని భావిస్తున్న యూజర్లకు రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగా ఎలాంటి పరిమితి లేని ‘ట్రూ అన్‌లిమిటెడ్ 5G డేటా’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2GB లేదా అంతకంటే ఎక్కువ డేటాను ఆఫర్ చేస్తున్న అన్ని ప్లాన్లలోనూ అర్హులైన యూజర్లకు ఈ 5G అన్ లిమిటెడ్ డేటాను జియా అందిస్తోంది. అయితే తమ రీఛార్జ్ ప్లాన్ లో 5G బెనిఫిట్స్ లేనివారికి సైతం ప్రత్యేకంగా ఓ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ. 51 ప్లాన్ తో 5G సేవలను పొందొచ్చు. అదెలాగో ఈ కథనంలో చూద్దాం.

రూ. 51 ప్లాన్ బెనిఫిట్స్..

జియో ప్రవేశపెట్టిన రూ. 51 డేటా అప్‌గ్రేడ్ ప్లాన్ ద్వారా వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 5G డేటాతో పాటు అదనంగా 3GB (4G) డేటా లభించనుంది. సాధారణంగా ఈ తరహా డేటా అప్ గ్రేడ్ ప్లాన్ లో ఎలాంటి 4G డేటా లభించేది కాదు. కానీ ఇప్పుడు 3GB అదనపు డేటాను ఇందులో చేర్చడం ద్వారా యూజర్లకు మరింత డేటా బెనిఫిట్ ను జియో అందిస్తోంది.

వారి కోసం మాత్రమే..

Advertisement

ఈ రూ.51 ప్లాన్ ను రీఛార్జ్ చేసుకునేందుకు కొన్ని నిబంధనలను జియో నిర్ణయించింది. వాటి ప్రకారం.. వినియోగదారులు రోజుకు 1.5GB డేటాను అందించే బేస్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుని ఉండాలి. అది కూడా బేస్ ప్లాన్ వ్యాలిడిటీ కనీసం 1 నెల (30 రోజులు) లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అంతేకాకుండా యూజర్లు తప్పనిసరిగా 5G స్మార్ట్ ఫోన్ కలిగి ఉండాలి. అదే సమయంలో మీరు ఉంటున్న ఏరియాలో జియో 5G నెట్ వర్క్ అందుబాటులో ఉంటేనే ఈ ప్లాన్ వల్ల ప్రయోజనం కలుగుతుంది.

Also Read: ఇదేందయ్యా ఇది.. 21 వేల పానీపూరీలతో 13 అడుగుల గణపతి.. వీడియో వైరల్

5G నెట్‌వర్క్ చెక్ చేయడం ఎలా?

Advertisement

మీ ప్రాంతంలో జియో 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడానికి ‘MyJio’ యాప్‌ను ఉపయోగించవచ్చు. అటు జియో నెట్‌వర్క్ 5G SA (స్టాండ్‌అలోన్ ఆర్కిటెక్చర్) సాంకేతికతపై పనిచేస్తుంది కాబట్టి మీ స్మార్ట్‌ఫోన్ జియో ట్రూ 5Gకి సపోర్ట్ చేస్తుందో లేదో కూడా MyJio యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.

Also Read: జియో సెన్సేషనల్ ఆఫర్.. ఫ్రీగా ‘కాన్వా ప్రో’ సేవలు.. డిజైనర్ అవ్వడం ఇక చాలా ఈజీ!కే

Tags

Related News

ఛార్జింగ్ టెన్షన్‌కు ఎండ్‌ కార్డ్‌..రూ.1275కే MIOX మ్యాజిక్ పవర్ బ్యాంక్!

జియో సెన్సేషనల్ ఆఫర్.. ఫ్రీగా ‘కాన్వా ప్రో’ సేవలు.. డిజైనర్ అవ్వడం ఇక చాలా ఈజీ!

యూట్యూబ్ సంపాదన ఇక మరింత టఫ్..కొత్త నిబంధనల పూర్తి వివరాలు!

గూగుల్ మ్యాప్స్ అమేజింగ్ ఫీచర్..మీ పార్కింగ్ లొకేషన్ ఇక ఎప్పటికీ మర్చిపోరు!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ డేట్స్ వచ్చేసాయ్..షాపింగ్‌కు రెడీ అయిపోండి!

మీ డేటా సేఫ్‌గా ఉండాలా? ChatGPTలో ఈ ఒక్కటి ఆఫ్ చేయండి చాలు!

రూ.54,999 ఫోన్ ఇప్పుడు ఇంత తక్కువకా? Vivo Y51 Pro 5Gపై క్రేజీ ఆఫర్!

Big Stories

Advertisement
×