Aasmaan Teaser: ప్రముఖ దివంగట నటుడు రియల్ స్టార్ శ్రీహరి (Srihari)వారసుడిగా ఆయన కుమారుడు మేఘాంశ్(Meghamsh) అతి త్వరలోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.మేఘాంశ్ హీరోగా ఆస్మాన్ (Aasmaan) అనే యాక్షన్ హర్రర్ సినిమా ద్వారా ప్రేక్షకులకు హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే . త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.
ఈ టీజర్ మొదలవుతూనే..మీరిప్పుడు గొంగళి పురుగు దశలో ఉన్నారు అది దాటి సీతాకోకచిలుక దశలోకి మారాలి అంటూ చెప్పే ఒక డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. ఈ టీజర్ చూస్తుంటే మాత్రం ఈ సినిమా అంతా థ్రిల్లింగ్ అంశాలతో కూడుకొని ఉందని చెప్పాలి. ఒక చర్చిలో ఉన్న మిస్టరీ ట్రాన్స్ లో ఉన్న కొంతమంది వ్యక్తుల గురించి ఈ టీజర్ వీడియోలో చూపించారు. ఇక హీరోయిన్ కోసం హీరో చేసే పోరాటం వంటి సన్నివేశాలతో ఈ టీజర్ విడుదల చేశారు. ఇక ఈ టీజర్ చూస్తుంటే మాత్రం ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని చెప్పాలి.
ఇక ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్వరలోనే విడుదల తేదీకి సంబంధించి కూడా అధికారిక ప్రకటన రానుంది. శ్రీహరి కుమారుడు మేఘాంశ్ ను దర్శకుడు రామ్ నందన్ (Ram Nandan)ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. మేఘాంశ్ , రాయంచ (Raayancha) హీరో హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాకు కొండారు శ్రీనివాస్ రావు సమర్పణలో శ్రీ క్లింకార సెల్యులాయిడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రవి వర్మ ,కమల్ కేశవ, దీపక్ ,నిఖిల్ వంటి తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇక మేఘాంశ్ నటించిన ఈ సినిమా ఏకంగా ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది..
ఈ సినిమాని కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళం, కన్నడ ,అరబిక్ భాషలలో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా టీజర్ చూస్తుంటే మాత్రం ఉత్కంఠ భరితమైన సస్పెన్స్ అంశాలతో టీజర్ ను అద్భుతంగా కట్ చేస్తూ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశారు.మేఘాంశ్ రగ్గడ్ లుక్ కూడా అందరిని ఆకట్టుకుంది. మరి శ్రీహరి వారసుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మేఘాంశ్ మొదటి సినిమా ద్వారా ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది.
Also Read: సాయి పల్లవి కోసం.. ‘రామాయణ్’ సాంగ్‌లో ఆ నటిని బ్లర్ చేశారా?