Jio Rs 55 Plan: రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఒక సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా రీఛార్జ్ ప్లాన్లు అంటే డేటా, ఫ్రీ కాల్స్, ఓటీటీ బెనిఫిట్స్ మాత్రమే ఉంటాయి. కానీ జియో ఇప్పుడు కేవలం రూ. 55లకే ప్రీమియం ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెళ్లను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది. వినియోగదారులకు చౌకగా వినోదాన్ని పంచడమే లక్ష్యంగా జియో ఈ ప్రత్యేకమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది.
అయితే ఈ రూ. 55 ప్లాన్ అనేది రీఛార్జ్ వోచర్ మాత్రమే. 30 రోజుల వ్యాలిడిటీతో ఇది రానుంది. అయితే మీరు ఈ ప్లాన్ ప్రయోజనాలను పొందాలంటే జియో మొబైల్ నంబర్‌పై ఏదైనా ఒక యాక్టివ్ బేస్ ప్లాన్ (కాలింగ్, డేటా ప్లాన్) కచ్చితంగా ఉండాలి. బేస్ ప్లాన్ లేకపోతే ఈ ఆఫర్ పనిచేయదని జియో వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
వాస్తవానికి జియో వర్గాలు దీనిని డేటా వోచర్ అని చెబుతున్నప్పటికీ ఇది అసలైన ‘టీవీ వోచర్’ అని చెప్పవచ్చు. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 30 రోజుల పాటు 1000కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను ఫ్రీగా చూడొచ్చు. స్టార్ ప్లస్, కలర్స్ వంటి టాప్ ఛానెళ్లతో పాటు సెట్ హెచ్‌డీ, సోనీ సాబ్ హెచ్‌డీ వంటి ప్రజాదరణ పొందిన ఛానెళ్లను వీక్షించవచ్చు. అంతేకాకుండా సన్ టీవీ, ఈటీవీ, వార్నర్ బ్రోస్ డిస్కవరీతో సహా 1000+ ఛానెళ్లను ఈ వోచర్ కింద అందుబాటులో ఉంటాయి.
Also Read: ఒక్క TTEకి ఎన్ని కోచ్‌లు కేటాయిస్తారు? ఇండియన్ రైల్వే రూల్స్ ఏం చెబుతున్నాయి?
ఈ రూ.55 ప్లాన్ కింద యూజర్లకు 10MB హై-స్పీడ్ డేటాను సైతం జియో ఆఫర్ చేస్తోంది. ఈ 10MB డేటా పూర్తైన తర్వాత డేటా వేగం 64 Kbpsకి తగ్గనుంది. అయితే ఈ 1000+ చానెళ్లను యూజర్లు.. జియో టీవీ యాప్ ద్వారా మాత్రమే వీక్షించేందుకు ఛాన్స్ ఉంది. నేరుగా టీవీకి కనెక్ట్ చేసుకొని చూసే వెసులుబాటు ఈ ప్లాన్ లో లేదు. ప్రయాణాలు, బయట ఉన్నప్పుడు తక్కువ ఖర్చుతో మొబైల్లో టీవీ చూడాలనుకునే వారికి ఈ జియో ప్లాన్ అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.
Also Read: పసిడి ప్రియులకు షాక్, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయి?