E-Paper
Advertisement

ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే టాయిలెట్ పేపర్ రోల్‌తో ఇలా చెక్ పెట్టండి!

ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే టాయిలెట్ పేపర్ రోల్‌తో ఇలా చెక్ పెట్టండి!
Advertisement

Refrigerator Maintenance: ఇంట్లో ఎంత ఖరీదైన ఫ్రిడ్జ్ ఉన్నా.. కొన్నిసార్లు దాన్ని తెరవగానే ఒక రకమైన దుర్వాసన రావడం, డోర్ మీద నీటి చుక్కలు లేదా మంచు పేరుకుపోవడం చూస్తుంటాం. రోజువారీ వాడకంలో ఇవన్నీ చాలా సహజంగా జరిగే సమస్యలే. అయితే, దీనికి ఒక సులభమైన పరిష్కారం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. అదేంటంటే.. మనం బాత్‌రూమ్‌లో వాడే టాయిలెట్ పేపర్ రోల్‌ను ఫ్రిడ్జ్‌లో ఉంచడమే.

ఫ్రిడ్జ్ తలుపు పదే పదే తీసి మూస్తున్నప్పుడు బయటి వేడి గాలి లోపలికి వెళ్తుంది. దీనివల్ల ఫ్రిడ్జ్ లోపల తేమ, చల్లదనం కలిసి చిన్న చిన్న నీటి చుక్కలుగా మారతాయి. ఈ తేమ వల్లే పదార్థాలు త్వరగా పాడవ్వటం, ఫ్రిడ్జ్ అంతా కూరగాయలు, వంటకాల వాసనలు కలగాపులగమై పట్టుకోవడం జరుగుతుంది.

Advertisement

Also Read: ఒక్క TTE‌కి ఎన్ని కోచ్‌లు కేటాయిస్తారు? ఇండియన్ రైల్వే రూల్స్ ఏం చెబుతున్నాయి?

టాయిలెట్ పేపర్‌కు తేమను పీల్చుకునే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్రిడ్జ్ మూలలో ఒక మంచి పేపర్ రోల్ ఉంచినప్పుడు, అది గాలిలోని అదనపు తేమను స్పాంజిలా పీల్చేసుకుంటుంది. దీనివల్ల ఫ్రిడ్జ్ లోపల వాతావరణం పొడిగా మారుతుంది. అంతేకాకుండా.. గాలిలో తిరిగే దుర్వాసన రేణువులను కూడా ఇది లాగేసుకోవడంతో ఫ్రిడ్జ్ ఎప్పుడూ ఫ్రెష్‌గా అనిపిస్తుంది.

Advertisement

అదనపు తేమ తగ్గడం వల్ల ఫ్రిడ్జ్ లోపలి గోడలపై అనవసరంగా గడ్డకట్టే మంచు తగ్గుతుంది. దీంతో ఫ్రిడ్జ్ మోటారుపై భారం తగ్గి, విద్యుత్ బిల్లు ఆదా అవ్వడమే కాకుండా.. ఫ్రిడ్జ్ జీవితకాలం కూడా పెరుగుతుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువ కాలం మన్నికగా ఉండటానికి ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఈ చిట్కా పనిచేయాలంటే ఒక కొత్త టాయిలెట్ పేపర్ రోల్‌ను ఫ్రిడ్జ్ వెనుక భాగంలో, తేమ ఎక్కువగా చేరేచోట పెట్టాలి. సాధారణంగా ప్రతి మూడు వారాలకు ఒకసారి ఈ రోల్‌ను తీసేసి కొత్తది పెట్టడం మంచిది. ఒకవేళ పేపర్ ముందే తడిసినట్లు అనిపిస్తే వెంటనే మార్చేయాలి.

ఫ్రిజ్ వాసన తగ్గించడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ వాడటం కంటే.. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే అందుబాటులో ఉండే ఈ చిన్న చిట్కాని ఒకసారి ప్రయత్నించి చూడండి.. రిజల్ట్ మీరే చూస్తారు.

Also Read: డెల్ నుంచి అడ్వాన్స్‌డ్ ఏఐ ల్యాప్‌టాప్‌లు వచ్చేసాయి.. 17 గంటల బ్యాటరీ లైఫ్‌తో!

Tags

Related News

ఫ్రిడ్జ్ డీఫ్రాస్ట్ చేయడానికి టెక్నీషియన్లు చెప్పే బెస్ట్ చిట్కా.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది!

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముతారు.. ఈ తేదీల్లో పుట్టినవారు విధితో పోరాడి విజయం సాధిస్తారు

తెల్ల జుట్టు ఆరోగ్యానికి మంచిదే.. ఆ ప్రమాదకర వ్యాధి నుంచి రక్షణకు సూచన

కర్రీలో నూనె ఎక్కువైందా? రుచి కాపాడడానికి ఈ 5 టిప్స్

రోజంతా పనిచేసి అలసిపోయారా? కేవలం 15 నిమిషాల్లో డిన్నర్ రెడీ చేసే 5 రెసిపీలు ఇవిగో

డైట్ సోడా తాగితే జ్ఞాపకశక్తి తగ్గుదల, త్వరగా వృద్ధాప్యం.. నిజమేనా?

భార్య మనసు గెలవాలనుకుంటున్నారా? భర్తల కోసం 5 సింపుల్ ట్రిక్స్

Big Stories

Advertisement
×