JioTag Go vs Apple AirTag : ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఏ వస్తువు ఎక్కడ పెడుతున్నామో అసలు గుర్తుండదు. హడావిడిగా బయలుదేరే సమయంలోనే కావాల్సిన వస్తువులు కనిపించకుండా పోతే కలిగే అసహనం ఎంతో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సమస్యను పరిష్కరిస్తూనే ప్రముఖ గ్యాడ్జెట్ కంపెనీలు ఫైండ్ మై డివైస్ ( Find My Device) తో పనిచేసే గ్యాడ్జెట్స్ ను తీసుకొచ్చాయి. ఇందులో ఇప్పటివరకూ లాంఛ్ అయిన వాటిలో జియో తీసుకువచ్చిన జియో ట్యాగ్ గో (JioTag Go), యాపిల్ కంపెనీ తీసుకొచ్చిన యాపిల్ ఎయిర్ ట్యాగ్ (Apple AirTag)ఎంతో ఆదరణ పొందాయి. అయితే ఈ రెండిటిలో ఏది బెస్ట్? వాటి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.
కంటికి కనిపించకుండా పోయిన వస్తువును గుర్తించేందుకు ఫైండ్ మై డివైస్ నెట్వర్క్ తో పనిచేసే గ్యాడ్జెట్స్ వచ్చేసిన సంగతి తెలిసిందే. వీటిలో జియో ట్యాగ్ గో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రెండింటి ధరలో వ్యత్యాసం ఉన్నట్టే ఫీచర్స్ లో సైతం వ్యత్యాసాలు ఉన్నాయి.
జియో తీసుకువచ్చిన జియో ట్యాగ్ గో ధర రూ. 1,499 కాగా, Apple AirTag ధర రూ. 2,800. జియో అందుబాటులోనే తీసుకొచ్చిన ఈ ట్రాకింగ్ గ్యాడ్జెట్స్ వస్తువులు ఎక్కడ పెట్టినా ఇట్టే కనిపెట్టేస్తుంది. జియో ట్యాగ్ ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం వచ్చేసింది.
జియో ట్యాగ్ గో Android 9 లేదా ఆ తర్వాతి వెర్షన్‌లో నడుస్తున్న Android స్మార్ట్‌ఫోన్‌లతో లేటెస్ట్ వెర్షన్ మొబైల్స్ కి మద్దతిస్తుంది. గూగుల్ ఫైండ్ మై డివైస్ నెట్వర్క్ తో ఇది పనిచేస్తుంది. Apple AirTag ఐఫోన్స్ లో మాత్రమే పనిచేస్తుంది. ఐఫోన్, ఐప్యాడ్, ఐపాడ్ లో ఉండే ఫైండ్ మై నెట్వర్క్ తో పనిచేస్తుంది.
JioTag Go నాణెంపరిమాణంలో కీచైన్ కు కనెక్ట్ చేసేలా ఉంటుంది. ఇక Apple AirTag స్టెయిన్‌లెస్ స్టీల్ గ్యాడ్జెట్. ఇది డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం IP67గా రేటింగ్ తో వచ్చేసింది. రెండూ యూజర్స్ రీప్లేస్ చేయగలిగే బ్యాటరీతో పనిచేయటమే కాకుండా ఏడాదిపాటూ బ్యాటరీ లైఫ్ గ్యారంటీ ఉంది.
JioTag Go బీప్ సౌండ్ తో బ్లూటూత్ కనెక్టివిటీతో పనిచేస్తుంది. బ్లూటూత్ పరిధిలో లేనప్పుడు Google యొక్క Find My Device నెట్‌వర్క్‌ని ఉపయోగించుకుంటుంది. Apple AirTag U1 చిప్‌తో బ్లూటూత్, ప్రెసిషన్ ఫైండింగ్‌ను ఉపయోగిస్తూ పనిచేస్తుంది. నెట్‌వర్క్, బ్లూటూత్‌తో పనిచేసే జియో ట్యాగ్ లో అధునాతన గోప్యతా ఫీచర్‌లు లేవు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ తో ఆపిల్ పనిచేస్తుంది.
ఇక ఈ రెండు గ్యాడ్జెట్స్ అధునాతన ఫీచర్స్ తో పనిచేసినప్పటికీ బ్లూటూత్ తో పాటు స్మార్ట్ ఫోన్ తో పనిచేసే జియో ట్యాగ్ గో కొనాలనుకుంటే తక్కువ ధరలోనే కనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా ఆపిల్ మొబైల్ ఉపయోగించే యూజర్స్ AirTagను ఉపయోగించవచ్చు. ఇందులో భద్రత ఫీచర్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. ధర కాస్త ఎక్కువైనప్పటికీ భద్రత కావాలనుకునే వాళ్లు ఈ గ్యాడ్జెట్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు.
ALSO READ : మళ్లీ జియో, వొడాఫోన్ కు షాక్.. లక్షల్లో యూజర్స్ అవౌట్!