Telecom Services : ప్రముఖ టెలికాం సంస్థలు టెలికాం టారిఫ్‌లను పెంచేసిన తర్వాత ప్రైవేటు టెలికాం కంపెనీల సబ్‌స్క్రైబర్ల సంఖ్య నెలనెలా తగ్గుతోంది. అక్టోబర్ నెలలోనూ అదే ఒరవడి కొనసాగగా.. మరోసారి ఎలాంటి మార్పు లేకుండా జియో, వొడాఫోన్ కు యూజర్స్ విపరీతంగా తగ్గిపోయారు.
ఇండియాలో ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థలన్నీ ఎప్పటికప్పుడు తమ టారిఫ్ చార్జీలను విపరీతంగా పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాప్ కంపెనీలైన జియో, వోడాఫోన్ చార్జెస్ ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు ఆ నెట్వర్క్ నుంచి వేరే నెట్వర్క్ కు మారిపోతూ వస్తున్నారు. ఇప్పటికే ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అయిన కస్టమర్స్ సంఖ్య ఎక్కువగా ఉండగా తాజాగా మరోసారి ట్రాయ్ రిలీజ్ చేసిన డేటాలో జియో, వోడాఫోన్ కు గట్టి షాక్ తగిలింది.
జియో, వొడాఫోన్ ఐడియాకు మరోసారి గట్టి షాక్ తగిలింది. జులైలో పెంచేసిన టారీఫ్ ఛార్జీల కారణంగా వరుసగా సబ్‌స్క్రైబర్లను కోల్పోతున్న ఆ రెండు కంపెనీలు.. అక్టోబర్‌లోనూ మరోసారి పెద్ద సంఖ్యలో యూజర్స్ ను కోల్పోవల్సి వచ్చింది. అయితే ఎయిర్‌టెల్ మాత్రం కొత్త సబ్‌స్క్రైబర్లను పెంచుకుంటూ వస్తుంది. అలాగే, ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా తన సేవలను మరింత పెంచుకుంటూ వస్తున్న ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) మరోసారి స్వల్పంగా సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పెంచుకుంది.
అక్టోబర్ లో ఎయిర్‌టెల్‌కు 19.29 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు రాగా.. సెప్టెంబర్‌లో ఇదే కంపెనీ 14.35 లక్షల మంది యూజర్లను చేర్చుకుంది. ఇక సెప్టెంబర్‌లో దాదాపు 79.7 లక్షల మంది యూజర్లను జియో కోల్పోగా.. అక్టోబర్‌లో మరో 37.60 లక్షల మంది రిలయన్స్ కు షాక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఎన్నో ఆర్ధిక కష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా నుంచి సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 15.5 లక్షలు.. అక్టోబర్ లో మరో 19.77 లక్షల యూజర్స్ వెళ్లిపోయారు.
ఇక బీఎస్‌ఎన్‌ఎల్.. అక్టోబర్ లో కొత్తగా మరో 5 లక్షల మంది యూజర్లను పెంచుకోగా.. సెప్టెంబర్‌లో 8.5 లక్షల మందిని చేర్చుకుంది. అయితే టాప్ టెలికాం సంస్థగా ఉన్న రిలయన్స్ జియో అధిక స్థాయిలో యూజర్స్ ను కోల్పోయినప్పటికీ 39.9% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. ఎయిర్టెల్ 33.50 శాతం, వొడాఫోన్ ఐడియా 18.30 శాతం, బీఎస్‌ఎన్‌ఎల్ 8.50 శాతం వాటాతో తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఇక ఇప్పటివరకూ టాప్ లో ఉన్న ప్రైవేటు టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్ నుంచి యూజర్స్ డ్రాపవ్వడం మొదలైంది. వినియోగదారులు తగ్గిపోవడంతో ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డాయి ఆయా కంపెనీలు. ఇక ఇప్పట్లో టారిఫ్‌లను పెంచబోమని ప్రకటించిన బీఎస్ఎన్ఎల్ పై నమ్మకంతో యూజర్స్ అటు వైపు కాస్త మెుగ్గు చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జియో, వోడాఫోన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.
ఇక ఇప్పుడిప్పుడే బీఎస్ఎన్ఎల్‌కు పెరుగుతున్న యూజర్స్ ను చూస్తుంటే పూర్వ వైభవం రావడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక 5జీ మొబైల్ సిమ్‌లను సైతం జియో తాజాగా ప్రారంభించింది. మొత్తానికి ‘బీఎస్ఎన్ఎల్ అందరికీ కనెక్ట్’ అవుతానుంటున్న మాట నిజమే అనిపిస్తుంది.
ALSO READ : రూ.20వేలలోపే బెస్ట్ మెుబైల్ కొనాలా! టాప్ ఆఫ్షన్స్ ఇవే