Walking: వ్యాయామంలో నడక ఎంతో ప్రధానమైనది. నిజానికి మిగతా వ్యాయామాలతో పోలిస్తే నడక చాలా సులువైనది కూడా. అందుకే ప్రతిరోజూ గంటసేపు నడవడం ద్వారా ఎంతో ఆరోగ్యాన్ని పొందవచ్చు. ముఖ్యంగా రోజుకు కేవలం 5000 అడుగులు వేయండి చాలు… ఆధునిక ప్రపంచంలో మనిషిని పిప్పి చేస్తున్నా డిప్రెషన్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
డిప్రెషన్ వినడానికి చిన్న సమస్యలా కనిపించవచ్చు. కానీ దీని బారిన పెడితే జీవించాలన్నా ఆశ కూడా చచ్చిపోతుంది. ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకోవడానికి డిప్రెషనే కారణం. అందుకే మీరు డిప్రెషన్ బారిన పడకుండా ఉండాలి. అంటే ప్రతిరోజు వాకింగ్ చేయడం అలవాటుగా మార్చుకోండి.
డిప్రెషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని కుంగదీస్తున్న సమస్య. లక్షల మంది ప్రస్తుతం డిప్రెషన్ తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల మందికి ప్రస్తుతం డిప్రెషన్ ఉన్నట్టు అంచనా. వారు నడక, ఇతర శారీరక శ్రమ చేయడం ద్వారా ఆ డిప్రెషన్ బారి నుండి త్వరగా బయటపడవచ్చు. ముఖ్యంగా రోజుకు 5000 అడుగులు నడిచే వ్యక్తులు తక్కువ డిప్రెషన్ లక్షణాలను కలిగి ఉన్నట్టు కొత్త అధ్యయనం తెలిసింది.
సైన్స్ చెబుతున్న ప్రకారం నడవడం వల్ల శరీరంలో ఎండార్పిన్లు ఉత్పత్తి అవుతాయి. ఎండార్పిన్లు అనేవి సహజంగా మూడ్ బూస్టర్లుగా ఉంటాయి. నడక వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్ అయినా కార్టిసాల్ ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల మానసిక స్థితి ఆరోగ్యంగా ఉంటుంది.
కొంతమంది పదివేల అడుగులు రోజుకు వేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పుకుంటారు. అయితే అందరికీ అలా పదివేలు అడుగులు వేయడం వీలు కాకపోవచ్చు. అలాంటివారు కనిష్టంగా ఐదు వేల అడుగులు వేయడానికి ప్రయత్నించండి. ఇది మీ ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. 30 నుంచి 40 నిమిషాల పాటు వేగంగా నడిస్తే చాలు. మీ ఆరోగ్యంలో ఎన్నో మంచి పరిణామాలు సంభవిస్తాయి.
రోజుకు 1000 అడుగులు నడిచే వారిలో డిప్రెషన్ వచ్చే ప్రమాదం 9% తగ్గుతున్నట్టు అధ్యయనం చెప్పింది. అలాగే ఏడు వేలు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ నడిచే వారికి డిప్రెషన్ వచ్చే ప్రమాదం 31 శాతం తగ్గినట్టు పరిశోధనలు చెబుతున్నాయి. ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కావాలంటే పదివేల అడుగులను వేయాలి. అది మీకు వీలు కాకపోతే 5000 అడుగులతో సరిపెట్టుకోండి.
Also Read: భోజనం తిన్నాక కొందరిలో సిగరెట్ కాల్చాలనే కోరిక ఎందుకు పుడుతుంది?
భోజనం చేశాక పది నిమిషాలు పాటు నడవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వారానికి కనీసం ఐదు రోజులు పాటు వాకింగ్ కు వెళ్లేందుకు ప్రయత్నించండి. స్నేహితులు, సహోద్యోగులు కుటుంబంతో తోడుగా వాకింగ్ చేస్తే అలసట కూడా అనిపించదు.
గమనిక: ఇందులో పేర్కొన్న అంశాలు వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఏ సందేహాలు ఉన్నా.. వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలని మనవి. ఇందులో పేర్కొన్నా అంశాలకు ‘బిగ్ టీవీ లైవ్’ నెట్ వర్క్ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.