BigTV English

Railway Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 1,036 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, సాలరీ ఎంతో తెలుసా?

Railway Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 1,036 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, సాలరీ ఎంతో తెలుసా?

Indian Railways: భారతీయ రైల్వే సంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రైల్వేశాఖలోని వివిధ విభాల్లో ఉన్న ఖాళీలను పూర్తి చేయనుంది. ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) పెద్ద సంఖ్యలో ఖాళీలను గుర్తించి, వాటిని భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మొత్తం 1,036 ఖాళీలను నింపేందుకు RRB నోటిఫికేషన్ విడుదల చేసింది.


పోస్టుల వివరాలు

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ తాజాగా నోటిఫికేషన్ లో పలు పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పలు సబ్జెక్టులు) – 187 పోస్టులు, సైంటిఫిక్ సూపర్‌వైజర్ (ఎర్గోనామిక్స్ & ట్రైనింగ్) – 3 పోస్టులు, శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు (పలు సబ్జెక్టులు) – 338 పోస్టులు,  చీఫ్ లా అసిస్టెంట్ – 54 పోస్టులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ – 20 పోస్టులు, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ (ఇంగ్లీష్ మీడియం) – 18 పోస్టులు, సైంటిఫిక్ అసిస్టెంట్ (ట్రైనింగ్) – 2 పోస్టులు, జూనియర్ ట్రాన్స్‌ లేటర్ (హిందీ) – 130 పోస్టులు,  సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్ – 3 పోస్టులు,  స్టాఫ్ & వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ – 59 పోస్టులు,  లైబ్రేరియన్ – 10 పోస్టులు, మ్యూజిక్ టీచర్ (మహిళ) – 3 పోస్టులు,  ప్రైమరీ రైల్వే టీచర్ (వివిధ సబ్జెక్టులు) – 188 పోస్టులు,  అసిస్టెంట్ టీచర్ (మహిళ) (జూనియర్ స్కూల్స్) – 2 పోస్టులు, లేబొరేటరీ అసిస్టెంట్ (స్కూల్) – 7 పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 (కెమిస్ట్ & మెటలర్జిస్ట్) – 12 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.


విద్యా అర్హత: ఈ ఉద్యోగాలు పొందేందుకు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్. అయితే, ప్రతి పోస్టుకు నిర్దిష్ట క్వాలిషికేషన్స్ ఉండాలి.  టీచర్ పోస్టులకు బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ, B.Ed లేదా D.Ed, TET అర్హత అవసరం. పబ్లిక్ ప్రాసిక్యూటర్, చీఫ్ లా అసిస్టెంట్ కోసం లా గ్రాడ్యుయేట్లు అవసరం. లైబ్రేరియన్, మ్యూజిక్ టీచర్, లేబొరేటరీ ఉద్యోగాలకు సంబంధిత అర్హతలు ఉండాలి.

ఏజ్ లిమిట్: ఈ ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులకు  జనవరి 1, 2015 నాటికి 18 ఏళ్లు పైబడి ఉండాలి. వయో పరిమితి అనేది పోస్ట్ వారీగా మారుతూ ఉంటాయి. తాజాగా ప్రకటించిన పోస్టులకు వయసు 18 నుంచి 48 మధ్యలో ఉండాలి.

ఎలా అప్లై చేసుకోవాలి?: రైల్వే బోర్డు తాజాగా ప్రకటించిన ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ జనవరి 2025లో ప్రారంభమవుతుంది. 07-01-2025 నుంచి 06-02-2025 వరకు దరఖాస్తులు తీసుకుంటారు. అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్: https://rrbapppy.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుము రూ.500 చెల్లించాలి. రిజర్వేషన్ ఉన్న వర్గాలకు రూ. 250 చెల్లిస్తే సరిపోతుంది.

Read Also: ఆరేళ్ల తర్వాత మళ్లీ పట్టాలెక్కిన గోల్డెన్ చారియట్, అదీ కేవలం 38 మందితో..

ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ: RRB తాజాగా ప్రకటించిన ఉద్యోగాలకు ఎంపిక అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), స్కిల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ నిర్వహించిన తర్వాత సెలెక్ట్ చేస్తారు.

జీతం వివరాలు: పోస్ట్‌ ను బట్టి జీతాలు రూ.19,900 నుంచి  రూ.47,600 వరకు ఉంటాయి. ఉదాహరణకు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు రూ. 47,600, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 రూ. 19,900 పొందే అవకాశం ఉంటుంది.

Read Also: రైల్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? అయితే, మీ మొబైల్ పని అయినట్టే!

Related News

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Big Stories

×