E-Paper
Advertisement

వస్తువులు మిస్సైనా చిటికెలో కనిపెట్టేయొచ్చు.. జియో తెచ్చిన బడ్జెట్ ట్రాకర్ల కథ ఇదీ!

వస్తువులు మిస్సైనా చిటికెలో కనిపెట్టేయొచ్చు.. జియో తెచ్చిన బడ్జెట్ ట్రాకర్ల కథ ఇదీ!
Advertisement

JioTag Go vs JioTag Air: భారతదేశపు అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో కేవలం రీఛార్జ్ ప్లాన్లు మాత్రమే కాకుండా.. నిత్యజీవితంలో ఉపయోగపడే గ్యాడ్జెట్లను కూడా అందిస్తోంది. ఇందులో భాగంగానే వస్తువులను ట్రాక్ చేసేందుకు ‘జియోట్యాగ్ గో’, ‘జియోట్యాగ్ ఎయిర్’ అనే రెండు సరికొత్త ట్రాకింగ్ డివైజ్‌లను మార్కెట్లోకి తెచ్చింది. విశేషం ఏంటంటే.. ఈ రెండింటి ధర రూ.1,499 గానే ఉంది. మరి ఒకే ధర ఉన్న ఈ రెండింటిలో ఏది కొనాలో, వీటి మధ్య తేడాలేంటో ఇప్పుడు చూసేద్దామా..

రెండు వేర్వేరు ఉపయోగాలు:

ధర ఒక్కటే అయినప్పటికీ.. ఈ రెండు డివైజ్‌లను వేర్వేరు ఫోన్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని తయారుచేశారు. మీరు యాపిల్ ఫోన్ లేదా ఇతర యాపిల్ ప్రొడక్ట్స్ వాడుతుంటే మీకు ‘జియోట్యాగ్ ఎయిర్’ ఉపయోగపడుతుంది. ఇది యాపిల్ వారి ‘ఫైండ్ మై’ నెట్‌వర్క్‌తో కలిసి పనిచేస్తుంది. అలాగే యాపిల్ ఎయిర్‌ట్యాగ్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ ధరకే లభిస్తుంది.

Advertisement

Also Read: సౌండ్‌బార్లపై ఉండే 2.1, 3.1, 5.1.2 నెంబర్ల అర్థం తెలుసా? ఇది తెలియకుండా కొంటే నష్టమే!

ఆండ్రాయిడ్ యూజర్ల కోసమే:

మరోవైపు, మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్లయితే ‘జియోట్యాగ్ గో’ కరెక్ట్ ఛాయిస్. ఇది గూగుల్ వారి ‘ఫైండ్ మై డివైజ్’ నెట్‌వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా దీన్ని సులభంగా ట్రాక్ చేయవచ్చు. అంటే మీ వద్ద ఉన్న ఫోన్‌ను బట్టి ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

వీటిని ఎలా ఉపయోగించాలి?

Advertisement

ఈ జియోట్యాగ్‌లను వాడటం చాలా సులువు. ముందుగా మీ ఫోన్‌లోని ట్రాకింగ్ యాప్‌తో ఈ డివైజ్‌ను కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత దీనిని మీ బ్యాగ్, పర్స్, కారు కీస్ లేదా లగేజీ లాంటి ఏ వస్తువుకైనా తగిలించుకోవచ్చు. ఆ తర్వాత మీ ఫోన్ యాప్ ఓపెన్ చేసి ఆ వస్తువు ఎక్కడ ఉందో సులభంగా చూసుకోవచ్చు.

అద్భుతమైన ఫీచర్లు:

ఈ రెండు జియోట్యాగ్‌లలో గట్టిగా మోగే అలారం ఉంటుంది. దీనివల్ల వస్తువులు ఎక్కడైనా మిస్సైనా శబ్దం ద్వారా గుర్తుపట్టవచ్చు. ఇవి వేర్వేరు రంగుల్లో లభిస్తాయి. వీటి బ్యాటరీ దాదాపు ఏడాది పాటు వస్తుంది. బ్యాటరీ అయిపోతే కొత్తది మార్చుకునే వీలుంది కాబట్టి.. మళ్లీ కొత్త డివైజ్ కొనాల్సిన పనిలేదు. ఇవి ఆన్‌లైన్‌లో జియోమార్ట్‌లో లేదా దగ్గరలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో దొరుకుతాయి.

Also Read: డీప్ బేస్‌తో దద్దరిల్లిపోవాల్సిందే.. రూ.10 వేల లోపే Blaupunkt కొత్త పార్టీ స్పీకర్ లాంచ్, ఎక్కడ కొనాలంటే?

Related News

సాధారణ ఫ్యాన్ల కంటే BLDC ఫ్యాన్లు ఎందుకు బెస్ట్? కరెంట్ బిల్లు తగ్గించే టాప్ ఆప్షన్స్ ఇవే!

భారత్‌లోకి వచ్చేస్తున్న iQOO Z11.. 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే, కొత్త ప్రాసెసర్‌తో దుమ్ము రేపనుంది!

వావ్.. ఇదే కదా టెక్ లవర్స్ కోరుకున్నది.. ఒకే పవర్ బ్యాంక్‌తో వాచ్, ఫోన్ ఒకేసారి ఛార్జ్!

ఓటీటీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ. 200 కే 20కి పైగా ఓటీటీలు.. వర్త్ వర్మా వర్త్!

200MP కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో OnePlus 16.. భారత్‌లో లాంచింగ్ లేనట్టేనా?

మైక్రోవేవ్ వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం నాశనమే!

ప్రయాణాల్లో ఛార్జింగ్ తిప్పలు ఇక ఉండవు! రూ.వేయ్యిలోపు బ్రాండెడ్ పవర్ బ్యాంక్

20 గంటల ప్లేబ్యాక్, అదిరిపోయే సౌండ్! మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్

Big Stories

Advertisement
×