బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

సౌండ్‌బార్లపై ఉండే 2.1, 3.1, 5.1.2 నెంబర్ల అర్థం తెలుసా? ఇది తెలియకుండా కొంటే నష్టమే!

సౌండ్‌బార్లపై ఉండే 2.1, 3.1, 5.1.2 నెంబర్ల అర్థం తెలుసా? ఇది తెలియకుండా కొంటే నష్టమే!

Best Soundbars 2026: బయట వర్షం పడుతుంటే ఇంట్లో సోఫాపై కూర్చుని సినిమానో, వెబ్ సిరీస్‌నో చూడటం అందరికీ ఇష్టమే. అయితే, ఈ మధ్యకాలంలో టీవీలు చాలా సన్నగా (స్లిమ్) వస్తుండటంతో వాటి పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది కానీ, ఆడియో మాత్రం అంతగా బాగోదు. డైలాగ్స్ సరిగ్గా వినపడకపోవడం, యాక్షన్ సీన్స్‌లో బేస్ లేకపోవడం వల్ల సినిమా చూసే మజా పోతుంది. ఈ సమస్యకు చక్కటి పరిష్కారం సౌండ్‌బార్. మరి మంచి బేస్ట్ అందించే బెస్ట్ సౌండ్‌బార్‌ను ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..

అవసరాన్ని బట్టి ఎంపిక:

సౌండ్‌బార్ కొనే ముందు మీకు ఏం కావాలో క్లారిటీ ఉండాలి. కొందరికి కేవలం డైలాగ్స్ స్పష్టంగా వినపడితే చాలు. మరికొందరికి మాత్రం ఇంట్లోనే థియేటర్ లాంటి ఫీలింగ్ రావాలి. కేవలం వార్తలు, సీరియల్స్ చూసేవారికి బేసిక్ మోడల్స్ సరిపోతాయి. అలా కాకుండా ఓటీటీల్లో సినిమాలు, స్పోర్ట్స్ ఎక్కువగా చూసేవారికి డాల్బీ అట్మోస్ ఉన్న సౌండ్‌బార్స్ బాగా సెట్ అవుతాయి.

Also Read: డీప్ బేస్‌తో దద్దరిల్లిపోవాల్సిందే.. రూ.10 వేల లోపే Blaupunkt కొత్త పార్టీ స్పీకర్ లాంచ్, ఎక్కడ కొనాలంటే?

ఆ నెంబర్ల గోల ఏంటి?

సాధారణంగా సౌండ్‌బార్స్ చూసేటప్పుడు 2.1, 3.1, 5.1.2 లాంటి నెంబర్లు కనిపిస్తాయి. ఇవి పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సినవి కావు. ఉదా: 3.1 లోని 3 అనేది స్పీకర్లను, 1 అనేది సబ్‌వూఫర్‌ను సూచిస్తుంది. ఒకవేళ చివర్లో మరో నెంబర్ (ఉదా: 5.1.2 లోని 2) ఉంటే, అవి పైనుంచి సౌండ్ వచ్చేలా చేసే స్పీకర్లన్నమాట. దీనివల్ల వర్షం పడుతున్న సీన్ వస్తే నిజంగానే మన ఇంట్లో వాన పడుతున్నట్లు, విమానం వెళ్తుంటే మన పైనుంచే వెళ్తున్నట్లు రియలిస్టిక్ ఫీలింగ్ వస్తుంది.

సబ్‌వూఫర్, డైలాగ్స్ ముఖ్యం:

సినిమాల్లో బాంబు పేలుళ్లు, ఉరుములు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఎఫెక్టివ్‌గా వినిపించాలంటే సబ్‌వూఫర్ చాలా ముఖ్యం. ఇది సౌండ్‌కు మంచి బేస్ ఇస్తుంది. అలాగే చాలామంది టీవీ చూసేటప్పుడు మాటలు సరిగ్గా వినపడక వాల్యూమ్ పెంచుతుంటారు. సీన్ మారగానే సౌండ్ ఎక్కువై మళ్లీ తగ్గిస్తుంటారు. ఈ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ‘సెంటర్ ఛానల్’ లేదా వాయిస్ క్లారిటీ ఫీచర్ ఉన్న సౌండ్‌బార్‌ను ఎంచుకోవడం మంచిది.

కనెక్టివిటీ, గది పరిమాణం:

సౌండ్‌బార్‌ను టీవీకి కనెక్ట్ చేయడానికి HDMI eARC లేదా HDMI ARC పోర్ట్ ఉందో లేదో చూసుకోవాలి. దీనివల్ల ఎలాంటి క్వాలిటీ తగ్గకుండా డాల్బీ అట్మోస్ సౌండ్ మనకు అందుతుంది. అలాగే మీ హాల్ లేదా రూమ్ సైజును బట్టి స్పీకర్లను సెలెక్ట్ చేసుకోవాలి. చిన్న గది అయితే నార్మల్ సౌండ్‌బార్ సరిపోతుంది. అదే పెద్ద హాల్ అయితే మాత్రం ఎక్కువ పవర్, సబ్‌వూఫర్ ఉన్న మోడల్స్ అవసరమవుతాయి.

బడ్జెట్‌లో బెస్ట్ ఆప్షన్స్:

ప్రస్తుతం మార్కెట్లో అన్ని బడ్జెట్లలోనూ మంచి సౌండ్‌బార్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో రూ.10,000 లోపు టీవీ సౌండ్ పెంచడానికి సోని HT-S20R మంచి ఛాయిస్. రూ.25,000 లోపు జేబీఎల్ సినిమా SB580 మంచి బేస్ ఇస్తుంది. ఇక ప్యూర్ డాల్బీ అట్మోస్ అనుభవం కోసం రూ.40,000 బడ్జెట్లో జేబీఎల్ బార్ 500 లేదా సోనోస్ బీమ్ (జెన్ 2) సూపర్‌గా పనిచేస్తాయి. బడ్జెట్ ఎక్కువ ఉంటే శాంసంగ్ HW-Q990F లాంటి ప్రీమియం మోడల్స్‌ను పరిశీలించవచ్చు.

Also Read: 200MP కెమెరా, కేక పెట్టించే డిజైన్.. శాంసంగ్ సరికొత్త అల్ట్రా ఫోన్ ఫస్ట్ లుక్ చూశారా?

Related News

800W పవర్, డాల్బీ ఆడియో.. తక్కువ ధరలో iBall తెచ్చిన సరికొత్త Cinebar 560!

అద్దె ఇంట్లో ఉండేవారికి గుడ్ న్యూస్.. ఏసీ పెట్టేందుకు నిరాకరిస్తే.. ఓనర్లకు రూ.94,904 జరిమానా!

వస్తువులు మిస్సైనా చిటికెలో కనిపెట్టేయొచ్చు.. జియో తెచ్చిన బడ్జెట్ ట్రాకర్ల కథ ఇదీ!

Smart Glasses: కంటిపై లెన్స్, ముఖానికి అద్దాలు.. తర్వాత జరిగే అద్భుతమే వేరు..!

డీప్ బేస్‌తో దద్దరిల్లిపోవాల్సిందే.. రూ.10 వేల లోపే Blaupunkt కొత్త పార్టీ స్పీకర్ లాంచ్, ఎక్కడ కొనాలంటే?

సోలార్ స్మార్ట్ గొడుగు.. ఎండ నుంచి రక్షణే కాదు.. ఫోన్‌కి ఛార్జింగ్ కూడా..!

రీఛార్జ్ ధరలు పెరగట్లేదా? బయటి ప్రచారం ఉత్తిత్తిదేనా.. ఫుల్లు క్లారిటీ వచ్చిందోచ్!

×