Lava Yuva Star Launched: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా తన స్పీడు పెంచింది. రకరకాల మోడళ్లను రిలీజ్ చేస్తూ సత్తా చాటుతోంది. ఇంతక ముందుకంటే ఇప్పుడు కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తూ ఇతర కంపెనీ ఫోన్లకు గట్టి పోటీ ఇస్తుంది. తాజాగా మరొక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. చాలా చాలా తక్కువ ధరకు కొత్త ఫోన్ కొనుక్కోవాలని అనుకునే వారికి ఇదొక మంచి ఎంపిక అని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ ధరకు ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ ఫోన్ మీకు గొప్ప ఎంపికగా ఉంటుంది. కంపెనీ తాజాగా Lava Yuva Star స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో మీరు క్లీన్, యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని పొందుతారు. ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు, కనెక్టివిటీల గురించి తెలుసుకుందాం.
Lava Yuva Star Price And Sale
కంపెనీ Lava Yuva Star స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఒకే వేరియంట్‌లో మాత్రమే ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ.6,499 ధరతో రిలీజ్ అయింది. వైట్, బ్లాక్, లావెండర్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా కంపెనీ హోమ్ ఫెసిలిటీని కూడా అందిస్తోంది.
Lava Yuva Star Specifications
Also Read: ఏందిరా బై ఇది.. 300W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కొత్త ఫోన్.. 5 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్..!
కంపెనీ Lava Yuva Starలో 6.75 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను అందించింది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా వాటర్‌డ్రాప్ నాచ్ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. ప్రాసెసర్ విషయానికొస్తే.. ఈ మొబైల్ UniSoC 9863A ప్రాసెసర్‌లో పని చేస్తుంది. ఇది 4GB RAM + 64GB స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డ్ సహాయంతో ఈ ఫోన్ స్టోరేజ్‌ని పెంచుకోవచ్చు. లావా ఫోన్ Android GO ఎడిషన్‌లో పని చేస్తుంది. ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీని ప్రైమరీ లెన్స్ 13MPగా ఉంది.
Lava Yuva Starలో AI సెకండరీ కెమెరా ఉపయోగించబడింది. దీనితో పాటు ఈ ఫోన్‌లో LED ఫ్లాష్ కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఇది 5MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 10 వాట్ల ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్ USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తుంది. సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇది 4G కనెక్టివిటీ సపోర్ట్‌తో వస్తుంది. అందువల్ల తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఈ ఫోన్ గొప్ప ఎంపిక అని చెప్పొచ్చు.