Bithiri Sathi Controversy Case Filed: నటుడు, కమెడియన్ బిత్తిరి సత్తిపై కేసు నమోదైంది. భగవద్గీతను కించపర్చేలా వీడియో చేశాడని ఆయనపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. భగవద్గీతపై వ్యంగంగా వీడియో చేశాడని వానసేన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సినిమా విషయానికొస్తే.. బిత్తిరి సత్తి టాలీవుడ్ సినిమాల్లో నటించాడు. బిత్తిరి సత్తి..అలియాస్ ఇస్మార్ట్ సత్తి, తుపాకి రాముడు అంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్నాడు. కింది స్థాయి నుంచి ఎదిగిన చేవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి టీవీలతో పాటు పలు కార్యక్రమాలతో సెటబ్రెటీగా మారాడు. అయితే ఈ ఇమేజ్ ను కాపాడుకోవడంతో విఫలమయ్యాడు. తాజాగా, భగవద్గీతపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
Also Read: వయనాడ్ విలయం.. భారీ విరాళం ప్రకటించిన ప్రభాస్..
అసలు ఈ వీడియోలో ఏం ఉందంటే.. బిత్తిరి సత్తి భగవద్గీతను అనుసరిస్తూ వ్యంగంగా చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. హిందూవుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ హిందూ సంఘం రాష్ట్రీయ వానసేన బిత్తిరి సత్తికి అల్టీమేటం జారీ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో తొలగించి హిందూ సంఘాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.