Rishabh Pant’s peculiar Offer to Neeraj Chopra: ఒలింపిక్స్ 2024లో భారత్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్ చేరాడు. ఈ తరుణంలో నీరజ్ చోప్రా ఫైనల్ మ్యాచ్‌లో స్వర్ణం గెలవాలని 140 కోట్ల భారతీయులు ప్రార్థిస్తున్నారు. తాజాగా, ఈ విషయంపై ఇండియన్ క్రికెటర్ రిషభ్ పంత్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించాడు.
గురువారం రాత్రి 11:55 నిమిషాలకు జరగనున్న ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే ఫ్యాన్స్ లో ఒకరికి రూ.1,00,089 బహుమతిగా ఇస్తానని ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్ ను లైక్ చేయడంతోపాటు అత్యధికంగా కామెంట్ చేసిన వారికి ఈ బహుమతి వరిస్తుందని రాసుకొచ్చాడు. ఈ విధంగా అత్యధికంగా కామెంట్స్ చేసిన వారిలో మొదటి 10 మందిని ఎంపిక చేసి ఫ్లైట్ టికెట్స్ ఇస్తానని వెల్లడించాడు. అయితే భారత్ తోపాటు దేశం బయటినుంచి కూడా నా సోదరుడికి మద్దతు ఇద్దామని పంత్ పిలుపునిచ్చాడు.
If Neeraj chopra win a gold medal tomorrow. I will pay 100089 Rupees to lucky winner who likes the tweet and comment most . And for the rest top 10 people trying to get the atttention will get flight tickets . Let’s get support from india and outside the world for my brother
— Rishabh Pant (@RishabhPant17) August 7, 2024