Lenovo IdeaPad Slim 3 13th Gen i3: చదువుకోవడానికి, ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి లేదా ఆన్ లైన్ క్లాసులకు అద్భుతంగా పని చేసే కొత్త ల్యాప్ టాప్ కోసం చూస్తున్నారా? అయితే మార్కెట్లో.. ట్రెండ్ అవుతున్న ఒక సూపర్ లాప్ టాప్ పై ఓ లుక్కేయండి. అదే లెనోవో లేటెస్ట్ మోడల్. పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, ట్రెండీ స్లిమ్ డిజైన్‌తో వస్తున్న ఈ లాప్ ట్యాప్ ధర ధర రూ.55,490గా ఉంది. తక్కువ ధరలో లేటెస్ట్ ఫీచర్లు ఉన్న మోడల్ చాలా అద్భుతంగా పని చేస్తుంది. దీని పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం
ప్రస్తుత కాలంలో ల్యాప్ టాప్ కేవలం ఒక ఫీచర్లు మాత్రమే కాదు.. వాటి లుక్ కూడా చాలా ముఖ్యం. లెనోవో సంస్థ ఈ ఐడియాప్యాడ్ స్లిమ్ 3 మోడల్‌ను అత్యంత సన్నగా, తేలికైన డిజైన్‌తో రూపొందించింది. దీనిని ఎక్కడికైనా ఈజీగా మీ బ్యాగ్‌లో వేసుకుని ప్రయాణించవచ్చు. దీని ప్రీమియం గ్రే ఫినిషింగ్ , సన్నని బెజెల్స్ లాప్టాప్‌కు ఒక లగ్జరీ లుక్‌ను ఇస్తాయి. స్టూడెంట్స్ , ప్రొఫెషనల్స్ రోజంతా ఉపయోగించడానికి ఇది పర్ఫెక్ట్‌గా సరి పోతుంది.
ఈ ల్యాప్ టాప్ పర్ఫామెన్స్ పరంగా చాలా వేగవంతమైనది. ఇందులో పవర్ ఫుల్ Intel Core i3 13th Gen (1315U) ప్రాసెసర్‌ను వాడారు. మల్టీటాస్కింగ్ చేసేటప్పుడు.. ఎలాంటి లాగ్ లేకుండా.. సాఫీగా పని చేస్తుంది. ఒకే సమయంలో అనేక బ్రౌజర్ ట్యాబ్‌లు ఓపెన్ చేసి ఉన్నా.. డాక్యుమెంట్లు ఎడిట్ చేస్తున్నా, లేదా ఆన్‌లైన్ మీటింగ్స్‌లో పాల్గొంటున్నా సిస్టమ్ ఎక్కడా నెమ్మదించదు. విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్స్ చేయడానికి, కోడింగ్ నేర్చుకోవడానికి ఈ ప్రాసెసర్ అద్భుతంగా సహకరిస్తుంది.
ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ కోసం ఇందులో 8 GB RAM, వేగవంతమైన 512 GB SSD (సాలిడ్ స్టేట్ డ్రైవ్) స్టోరేజ్‌ను అందించారు. ఎస్ఎస్‌డీ ఉండటం వల్ల లాప్టాప్ ఆన్ అవ్వడానికి కేవలం కొన్ని సెకన్లు మాత్రమే పడుతుంది. అలాగే భారీ ఫైల్స్, సినిమాలు, సాఫ్ట్‌వేర్‌లను దాచుకోవడానికి 512GB స్పేస్ సరి పోతుంది. విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇది రన్ అవుతుంది. కాబట్టి లేటెస్ట్ ఫీచర్లు అన్నీ ఇందులో అందుబాటులో ఉంటాయి.
Also Read: సగం ధరకే బెస్ట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్..అస్సలు మిస్సవ్వొద్దు
అద్భుతమైన డిస్‌ప్లే ,కనెక్టివిటీ:
ఈ ల్యాప్ టాప్ లో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ తరగతులు వినేటప్పుడు, లేదా యూట్యూబ్‌లో సినిమాలు చూసేటప్పుడు.. క్లియర్ విజువల్స్ లభిస్తాయి. యాంటీ-గ్లేర్ స్క్రీన్ ఉండటం వల్ల ఎక్కువ సేపు స్క్రీన్ వైపు చూసినా కళ్ల మీద ఒత్తిడి పడకుండా ఉంటుంది.
కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఇందులో అవసరమైన అన్ని పోర్ట్స్ అంటే USB పోర్ట్స్, HDMI పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్ , వై-ఫై, బ్లూటూత్ సపోర్ట్ లభిస్తాయి. దీని వల్ల పెన్ డ్రైవ్‌లు, మానిటర్లు లేదా ఇతర డివైజ్‌లను ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.
ధర, ఎవరికి బెస్ట్?
ఇండియన్ మార్కెట్లో ఈ మోడల్ లాప్టాప్ ధర సుమారు రూ. 55,490 గా ఉంది. బడ్జెట్ మరియు బ్రాండ్ నమ్మకం పరంగా చూస్తే ఇది ఒక ఎక్సలెంట్ ఛాయిస్. కాలేజీ విద్యార్థులకు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే.. ఉద్యోగులకు, డైలీ అసరాలకు నమ్మకమైన, ఫాస్ట్ గా పనిచేయాలని కోరుకునే ప్రతి ఒక్కరికీ ఇది ఒక అద్భుతమైన పెట్టుబడి అని చెప్పొచ్చు!