418 Movie Trailer: ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌నీల్(Prashanth Neel) సమర్పణలో రూపొందుతున్న హారర్ చిత్రం ‘418’. కీర్తన్ నాదగౌడ(Kirtan Nadagouda)దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మాణంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సూర్యరాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 18వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. హర్రర్ థ్రిల్లర్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇదివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి.
ఈ సినిమా విడుదలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ వీడియో సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తోంది. ఈ ట్రైలర్ ప్రారంభమవుతూనే ఏదైనా ప్రకృతి వల్ల అపాయం కలుగుతుందంటే ముందుగా పక్షులకే తెలుస్తుంది అనే డైలాగుతో ట్రైలర్ ప్రారంభమవుతుంది.ట్రైలర్ ప్రారంభం నుంచే భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. 15 ఏళ్లుగా మూసి ఉన్న ఇల్లు మరియు రూమ్ నెం. 418 చుట్టూ ఉన్న రహస్యం ముదురుతున్న కొద్దీ, వాస్తవికత మరియు భ్రమల మధ్య చిక్కుకున్న 18 ఏళ్ల వివేక్ కథను అనుసరిస్తుంది.గర్భవతి అయిన దేవిక రాక సస్పెన్స్‌ను పెంచుతుంది.
ఇలా ట్రైలర్ మొత్తం విపరీతమైన సస్పెన్షన్ సన్నివేశాలతో రూపొందించారు.’418′ ఒక డార్క్ మరియు అట్మాస్ఫియరిక్ హారర్ థ్రిల్లర్‌గా తనకంటూ ఎంతో ప్రత్యేకతను చాటుకుంది. ఇలా భారీ సస్పెన్స్ లతో హర్రర్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా హర్రర్ ప్రియులకు మంచి పండుగ లాంటి సినిమా అని చెప్పాలి. 18వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రశాంత్ నీల్ శిష్యుడిగా ఉన్నటువంటి కీర్తన్ నాడా గౌడ దర్శకుడిగా ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.
418 సినిమా సెప్టెంబర్ 18వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తుంది. ఇప్పటికే సెన్సార్ బోర్డు కూడా ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేశారు.హారర్ మరియు సైకలాజికల్ అంశాలతో రూపొందడం వల్ల సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి A సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఆయన సినిమా తరహాలోనే 418 సినిమా కూడా డార్క్ థీమ్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ప్రశాంత్ నీల్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Also Read:తెలంగాణ బిడ్డగా పుట్టిన ప్రయోజనాలు సున్నా: ఉదయభాను