LG Home Projectors : ప్రముఖ గ్యాడ్జెట్ తయారీ సంస్థ LG.. అదిరిపోయే ఫీచర్స్ తో రెండు హోమ్ ప్రొజెక్టర్స్ ను లాంఛ్ చేసింది. అతి చిన్న 4K UST మోడల్‌తో బెస్ట్ క్వాలిటీని అందిస్తూ ఈ ప్రొజెక్టర్స్ అందుబాటులోకి వచ్చేశాయి.
LG కంపెనీ ఇప్పటికే బిగ్ స్క్రీన్ తో ప్రీ-CES 2025 ప్రొజెక్టర్ ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రొజెక్టర్ బెస్ట్ క్వాలిటీ స్క్రీన్ ను అందిస్తూ టాప్ ట్రెండ్స్ లో ఒకటిగా నిలిచింది. కింగ్ సైజ్ టీవీల కంటే బెస్ట్ విజువల్స్ ను అందిస్తూ ఈ ప్రొజెక్టర్ ఆకట్టుకుంటుంది. కాగా ఇప్పుడు కొత్తగా LG CineBeam-S-యాంబియంట్, LG యాంబియంట్-A ను లాంఛ్ చేసింది. అతి చిన్న అల్ట్రా షార్ట్ త్రో 4K రిజల్యూషన్ తో ఈ ప్రొజెక్టర్స్ వచ్చేశాయి.
LG CineBeam-S-యాంబియంట్ –
CineBeam S ప్రొజెక్టర్ కేవలం 2.5కిలోల బరువుతో డిజైన్ అయ్యింది. 100 అంగుళాల లార్జ్ మూవీస్ ను సైతం ప్రొజెక్ట్ చేయగలదు. ఇందులో RGB లేజర్ ఆధారిత ప్రొజెక్షన్ సిస్టమ్ 3840×2160-రిజల్యూషన్ చిత్రాలను అందిస్తుంది.
మినిమలిస్టిక్ మెటాలిక్ ఫినిషింగ్ తో వచ్చేసిన ఈ ప్రొజెక్టర్ HDR సిగ్నల్‌లకు సపోర్ట్ చేస్తూ SDRతో ఆకట్టుకునే విజువల్స్ ను అందిస్తుంది. ఏ గదిలోనైనా తేలికగా సెటప్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక ఆటో స్క్రీన్ అడ్జస్ట్‌మెంట్, వాల్ కలర్ అడ్జస్ట్‌మెంట్, స్క్రీన్ స్కేలింగ్/షిఫ్టింగ్ ఫీచర్స్ తో వచ్చేసింది. ఇందులో అంతర్నిర్మిత స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ డీకోడింగ్ కూడా ఉన్నాయి.
ఇక ఇందులో ఇన్బిల్ట్ అయ్యి ఉన్న LG WebOS స్మార్ట్ సిస్టమ్ టాప్ వీడియో స్ట్రీమింగ్స్ కు సపోర్ట్ చేస్తుంది. బయట కనెక్షన్స్ కు కనెక్ట్ చెయ్యాల్సిన అవసరంలేకుండానే మూవీస్, టీవీ షోస్ చూసే ఛాన్స్ ఉంటుంది. 4K బ్లూ-రే ప్లేయర్ లేదా గేమ్‌ల కన్సోల్ వంటి బయట కనెక్షన్స్ కు ఈ ప్రొజెక్టర్ ను ఉపయోగించాలనుకుంటే అందుకు అనుగుణంగా ప్రొజెక్టర్ HDMI పోర్ట్‌ను సైతం కలిగి ఉంటుంది. అలాగే Android, iOS డివైజెస్ నుంచి వైర్‌లెస్ ప్లేబ్యాక్‌కు సపోర్ట్ చేస్తుంది.
LG యాంబియంట్-A –
LG తీసుకొచ్చిన ప్రొజెక్టర్స్ లో ఈ ప్రొజెక్టర్ బెస్ట్ ఫీచర్స్ తో వచ్చేసింది. ఇందులో స్టీరియో స్పీకర్ సెటప్.. కాంపాక్ట్ ఫారమ్ ఉన్నప్పటికీ నిష్క్రియ రేడియేటర్‌లతో కనెక్ట్ అయ్యి పనిచేస్తుంది. దీంతో బెస్ట్ సౌండ్ సిస్టమ్ ను ఆస్వాదించే ఛాన్స్ ఉంది. అయితే LED మూడ్ ల్యాంప్ ఫీచర్ రూమ్ వాతావరణాన్ని ఇట్టే మార్చేస్తుంది. తొమ్మిది రంగులు, ఐదు బ్రైట్‌నెస్ లెవెల్స్ తో మరింత బెస్ట్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది. స్టాండ్-పోల్ స్టైల్‌తో ఫ్లోర్ ల్యాంప్ లా ఈ ప్రొజెక్టర్ పనిచేస్తుంది. LED మూడ్ ల్యాంప్, బ్లూటూత్ మ్యూజిక్ స్పీకర్ గా పనిచేస్తుంది.
అయితే ఇప్పటివరకూ LG తన కొత్త హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొజెక్టర్‌ల ధరలను ప్రకటించలేదు. త్వరలోనే మార్కెట్లోకి లాంఛ్ అయ్యే ఛాన్స్ ఉండటంతో ధరలు వెలువడే అవకాశం కనిపిస్తుంది.
ALSO READ : వాట్సాప్ కాల్ తో లొకేషన్ ట్రేస్.. సేఫ్ గా ఉండాలంటే ఆ సెట్టింగ్ మార్చాల్సిందే