BigTV English

WhatsApp : వాట్సాప్ కాల్ తో లొకేషన్ ట్రేస్.. సేఫ్ గా ఉండాలంటే ఆ సెట్టింగ్ మార్చాల్సిందే

WhatsApp : వాట్సాప్ కాల్ తో లొకేషన్ ట్రేస్.. సేఫ్ గా ఉండాలంటే ఆ సెట్టింగ్ మార్చాల్సిందే

WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ను ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ల వరకు ఉపయోగించే స్మార్ట్ ఫోన్స్ లో తప్పనిసరిగా ఉంటున్న ఈ యాప్ తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం జరిగే ఛాన్స్ సైతం అంతే ఉంది. ఇక వాట్సప్ లో నిత్యం ఉపయోగిస్తున్న యూజర్స్ కు సైతం తెలియని ఎన్నో ట్రిక్స్ ఉన్నాయి. వాట్సాప్ కాల్ తో లొకేషన్ ట్రేస్ చేస్తే ఛాన్స్ ఉంది.. అవును నమ్మలేకపోతున్నారా.. అసలు వాట్సాప్ కాల్ తో లొకేషన్ ఎలా ట్రేస్ అవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మార్చాల్సిన సెట్టింగ్స్ ఏంటో చూద్దాం.


వాట్సాప్ తో ఎన్నో ప్రయోజనాలు. చాటింగ్, కాల్స్, డేటా షేరింగ్, వీడియో కాల్, వాయిస్ కాల్.. ఈ ఫీచర్స్ తో పాటు లేటెస్ట్ అప్డేట్స్ ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అందుబాటులోకి వచ్చేసాయి. అయితే ఇవన్నీ ఒకవైపు.. మరోవైపు కొన్ని ప్రమాదాలు సైతం పొంచి ఉన్నాయి. వాట్సాప్ ను ఆధారంగా చేసుకుని ఎన్నో సైబర్ క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి. వీటితో పాటు వాట్సాప్ లో మెటా తీసుకొచ్చిన కొన్ని ఫీచర్స్ సైతం మిమ్మల్ని కొన్నిసార్లు ప్రమాదంలో పడేసే ఛాన్స్ ఉంది. ఇందులో ఒకటి వాట్సప్ కాలింగ్ లొకేషన్ ట్రేసింగ్. వాట్సాప్ లో కాల్ మాట్లాడుతున్న సమయంలోనే మీకు తెలియకుండా మీ లోకేషన్ ట్రేస్ చేసే ఛాన్స్ ఉంటుంది.

నిజానికి వాట్సాప్ కాల్ తో లొకేషన్ ట్రేస్ చేసే ఛాన్స్ ఉందని చాలా మందికి తెలియదు. కాలింగ్ సమయంలో మీ ఐడి, చిరునామాను ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో మీరు ఎక్కడున్నారు అనే విషయాన్ని ఇట్టే పసిగట్టే అవకాశం ఉంటుంది. ఇక వినియోగదారులు ఫోన్ లోకేషన్ ను ఎవరూ గుర్తించకుండా ఉండేలా కొన్ని ప్రైవసీ సెట్టింగ్స్ ను మార్చాల్సి ఉంటుంది. ఈ సెట్టింగ్ ను మార్చాలంటే ముందుగా వాట్సాప్ సెట్టింగ్స్ కు వెళ్లి ప్రొటెక్ట్ ఐపి అడ్రస్‌ను ఆన్ చేయాలి.


ALSO READ : వావ్.. ఇకపై వాట్సాప్ లోనే ఉబర్ క్యాబ్ బుకింగ్

నిజానికి వాట్సాప్ లో  ఈ ఐపీ అడ్రస్ ను ఆన్ చేయటం చాలా ముఖ్యమైన విషయం. ఇందుకోసం వాట్సాప్ ను ఓపెన్ చేయగానే రైట్ సైడ్ కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. ఆపై సెట్టింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే ప్రైవసీ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ప్రైవసీ ఆప్షన్ లో మీకు కొన్ని లేటెస్ట్ ఆప్డేట్స్ లో ఈ ఫీచర్ కనిపిస్తుంది. ఇందులో అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడే కాల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని ఆన్ చేయాలి. ఈ ఫీచర్ ఆన్ చేసిన తర్వాత అన్ని కాల్స్ వాట్సప్ సర్వర్ ద్వారా మాత్రమే వెళ్తాయి. ఎలాంటి థర్డ్ పార్టీ వెబ్ సైట్ ఎంటర్ అవ్వటానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి మీరు ఎప్పుడు సేఫ్ గా ఉంటారు. మీ వాట్సాప్ కానీ.. లొకేషన్ కానీ ఎవరూ హ్యాక్ చేస్తే ఛాన్స్ ఉండదు.

Related News

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Internet: ఇంటర్నెట్ లేకపోతే మన జీవితం ఎలా ఉండేది? ఒకసారి అలా వెళ్లొద్దాం రండి..

Amazon Freedom Festival Laptops: రూ.1 లక్ష లోపు ధరలో గేమింగ్ ల్యాప్‌టాప్స్.. బెస్ట్ డీల్స్ ఇవే

Big Stories

×