Jasprit Bumrah: బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా తో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. ఈ చివరి టెస్ట్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. సిడ్నీ టెస్ట్ లో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తూండగా బుమ్రా మైదానం వీడాడు. స్కానింగ్ కోసం బుమ్రాని ఆసుపత్రికి తరలించారు.
Also Read: Mohammed Waleed: పాకిస్థాన్ రూల్స్ అదుర్స్… ఇలా కూడా రనౌట్ కావాల్సిందే ?
ప్రాక్టీస్ జెర్సీ వేసుకున్న బుమ్రా కారులో ఆసుపత్రికి వెళుతున్న ఓ వీడియో బయటకు రావడంతో.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో బుమ్రాకి గాయమైనట్లుగా ఎక్కడ వీడియో కనిపించలేదు. కానీ అతడు మైదానాన్ని వీడడం, ఆసుపత్రికి తీసుకువెళుతున్న వీడియోలు మాత్రమే బయటకు వచ్చాయి.
ఇక బుమ్రా మైదానాన్ని వీడడంతో ప్రస్తుతం కెప్టెన్ గా విరాట్ కోహ్లీ బాధ్యతలు చేపట్టాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే బుమ్రా స్కానింగ్ కి వెళ్లడం పై అభిమానులలో ఆందోళన నెలకొంది. స్కానింగ్ తరువాత బుమ్రా పరిగెత్తుకుంటూ మెట్లు ఎక్కి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లడం చూస్తే పెద్ద గాయం ఏమీ కాలేదని తెలుస్తోంది. అయితే బూమ్రాకు ఏమైంది..? అనే విషయంపై అప్డేట్ ఇచ్చాడు ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ.
బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని.. స్కానింగ్ కోసమే ఆసుపత్రికి వెళ్లాడని తెలిపారు. వైద్య బృందం బుమ్రా పరిస్థితిని పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మరింత స్పష్టత వస్తుందని ప్రసిద్ద్ కృష్ణ పేర్కొన్నారు. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడానికి అతను సిద్ధంగా ఉన్నాడని.. కానీ బౌలింగ్ చేయాలా..? లేదా..? అనేది ఆదివారం బుమ్రా పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నాడు.
తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో బుమ్రా తిరిగి ఆడకపోతే మాత్రం అది భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. రెండో రోజు ఆట ఆరంభంలోనే లబుషేన్ వికెట్ పడగొట్టి బుమ్రా టీమ్ కి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా కేవలం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అందులో రెండు వికెట్లు పడగొట్టాడు. అంతే కాదు ప్రస్తుతం ఉన్న బౌలర్లలో బుమ్రా మాత్రమే కన్సిస్టెంట్ గా వికెట్లు పడగొడుతున్నాడు.
Also Read: Chahal – Dhanushshree: అతనితో రిలేషన్.. భార్య ఫోటోలు డిలీట్ చేసిన చాహల్.. ఇక విడాకులే ?
దీంతో బుమ్రా త్వరగా కోలుకోవాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు భారత జట్టు రెండవ ఇన్నింగ్స్ లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 141 పరుగులు చేసి 6 వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 145 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది. 200 పరుగులకు పైగా లీడ్ సాధిస్తే ఈ టెస్ట్ లో భారత జట్టు విజయం సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం రవీంద్ర జడేజా 8, వాషింగ్టన్ సుందర్ 6 పరుగులతో నాటౌట్ గా క్రీజ్ లో ఉన్నారు.
Jasprit Bumrah has left the SCG: https://t.co/0nmjl6Qp2a pic.twitter.com/oQaygWRMyc
— cricket.com.au (@cricketcomau) January 4, 2025