Logic LT-IR75CX 75 Inch Interactive Display: ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యారంగం, కార్పొరేట్ ఆఫీసులలో బోధనా విధానం పూర్తిగా మారిపోయింది. సాధారణ వైట్‌బోర్డ్‌ల స్థానంలో.. స్మార్ట్ టచ్ స్క్రీన్ ప్యానెల్స్ వచ్చి చేరాయి. ఈ కోవకే.. చెందిన ప్రముఖ టెక్ బ్రాండ్ ‘లాజిక్’ మార్కెట్లోకి తెచ్చిన అద్భుతమైన గాడ్జెట్ .లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, అద్భుతమైన 4K డిస్‌ప్లేతో.. వస్తున్న ఈ ఇంటరాక్టివ్ డిస్‌ప్లే ప్రత్యేకతలు , పని తీరు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
లాజిక్ ఎల్టీ-ఐఆర్75 మోడల్ ప్రధానంగా పెద్ద క్లాస్‌రూమ్‌లు, కాలేజీలు , కార్పొరేట్ బోర్డ్‌రూమ్‌ల కోసం డిజైన్ చేసారు. ఇందులో 75 ఇంచుల భారీ 4K Ultra HD డిస్‌ప్లేను అమర్చారు. దీని రిఫ్రెష్ రేట్ 60Hz ఉండగా, సుమారు 450 నిట్స్ బ్రైట్ నెస్ లభిస్తుంది. దీని వల్ల గదిలో ఎక్కడి నుంచి చూసినా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే.. ఇందులో ఉండే 178-గ్రీల వ్యూయింగ్ యాంగిల్ వల్ల పక్కన కూర్చున్న వారికి కూడా ఎలాంటి రంగుల మార్పు లేకుండా ఇమేజెస్ క్లియర్‌గా కనిపిస్తాయి. స్క్రీన్ సేఫ్టీ కోసం క్వాలిటీ టెంపర్డ్ గ్లాస్‌ను ఉపయోగించారు.
ఈ ఇంటరాక్టివ్ డిస్‌ప్లే మెయిన్ హైలైట్ దాని టచ్ రెస్పాన్స్. ఇది ఏకంగా 50 టచ్ పాయింట్లు, 20 ఏకకాల రైటింగ్ పాయింట్లను సపోర్ట్ చేస్తుంది. దీని టచ్ రెస్పాన్స్ టైమ్ కేవలం 2.5 మిలీసెకండ్లు లేదా అంతకంటే.. తక్కువగా ఉండటం విశేషం. టీచర్లు లేదా ప్రెజెంటర్లు బోర్డుపై రాస్తున్నప్పుడు ఎలాంటి లాగ్స్ లేకుండా చాలా స్మూత్‌గా పని చేస్తుంది.
ఈ డిస్‌ప్లే లేటెస్ట్ గూగుల్ ఈడీఎల్‌ఏ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. పని తీరును మరింత వేగంగా చేయడానికి ఇందులో పవర్ ఫుల్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో.. పాటు 16GB వరకు RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ లభిస్తున్నాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి అవసరమైన యాప్స్‌ను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రస్తుత ట్రెండ్‌కు తగినట్టుగా ఇందులో పలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను జోడించారు. ఏఐ స్మార్ట్ మ్యాపింగ్, స్మార్ట్ క్విజ్ బిల్డర్, లైవ్ మల్టీలింగువల్ సబ్ టైటిల్స్ వంటి టూల్స్ ఆఫీసు మీటింగ్‌లలో, క్లాసులలో బాగా ఉపయోగపడతాయి.
వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం.. దీని పైభాగంలో సెంటర్‌లో 50-మెగాపిక్సెల్ ఏఐ కెమెరాను అమర్చారు. ఇది ఆటో ఫ్రేమింగ్, స్పీకర్ ట్రాకింగ్ ఫీచర్లతో పనిచేస్తుంది. అంటే.. మాట్లాడే వ్యక్తి కదులుతున్నప్పుడు కెమెరా ఆటోమేటిక్‌గా వారిని ఫాలో అవుతుంది. అలాగే సౌండ్ విషయానికి వస్తే, ఇందులో 20W స్పీకర్లు , పవర్ ఫుల్ సబ్‌వూఫర్‌తో కూడిన 2.1-ఛానల్ ఆడియో సెటప్ ఉంది. ఇది మొత్తం 60W పవర్ అవుట్ పుట్‌ను అందించి, రూమ్ మొత్తానికి సరి పోయేలా స్పష్టమైన ధ్వనిని ఇస్తుంది. ఇళ్లలో కంటే.. ప్రొఫెషనల్ అవసరాలకే ఇది మరింత కచ్చితంగా సరి పోతుంది.
Also Read: పార్టీలకు ఊపు తెచ్చే.. కొత్త స్పీకర్ లాంచ్! మీరూ ఓ లుక్కేయండి
కనెక్టివిటీ పరంగా ఇందులో.. వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ తో పాటు ఎక్కువ హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, యూఎస్‌బీ టైప్-సి , విజిఏ, ఆర్జే45 లాన్ పోర్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఇండియన్ మార్కెట్లో ఈ మోడల్ ధర సుమారు రూ. 1,00,000 నుంచి రూ. 1,15,000 వరకు ఉంటుంది. కార్పొరేట్ ఆఫీసులు, డిజిటల్ స్కూల్స్, అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్‌ల కోసం ఇది ఒక విలువైన ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పొచ్చు!