E-Paper
Advertisement

జియో దుమ్మురేపే ప్లాన్.. రూ.899 కే 90 రోజుల వ్యాలిడిటీ.. 5G డేటా, ఓటీటీ, ఫ్రీ కాల్స్!

జియో దుమ్మురేపే ప్లాన్.. రూ.899 కే 90 రోజుల వ్యాలిడిటీ.. 5G డేటా, ఓటీటీ, ఫ్రీ కాల్స్!
Advertisement

Jio Recharge: రిలయన్స్ జియో తన యూజర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటివరకూ ఎన్నో రకాల ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఎక్కువ రోజుల వ్యాలిడిటీ, అధిక డేటా, ఉచిత ఓటీటీ, ఫ్రీ కాల్స్ కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా ఓ ప్లాన్ అందుబాటులో ఉంచింది. రూ.899 ధరకు లాంచ్ చేసిన ఈ ప్లాన్ తో యూజర్లను అనేక రకాల బెనిఫిట్స్ లభిస్తాయని జియో వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్ కు సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

రూ. 899 ప్లాన్ పూర్తి వివరాలు

జియో ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. అంటే దాదాపు మూడు నెలల పాటు మరో రీఛార్జ్ అవసరం లేకుండా ప్రశాంతంగా ఈ ప్లాన్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఇక ఈ ప్లాన్ కింద ప్రతిరోజూ 2 GB హై-స్పీడ్ డేటా యూజర్లకు లభించనుంది. దీంతో పాటు అదనంగా 20 GB ఎక్స్‌ట్రా డేటాను ఉచితంగా అందిస్తున్నారు. అంటే మొత్తం వ్యాలిడిటీ కాలంలో యూజర్లకు 200 GB డేటా అందుబాటులో ఉంటుంది. రోజూవారీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత కూడా 64 kbps వేగంతో అపరిమితంగా ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. దీనికి తోడు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా మాట్లాడుకునే ఉచిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSల సౌకర్యం ఈ ప్లాన్ లో ఉంది.

నాన్ స్టాప్ 5G డేటా, ఫ్రీ హాట్ స్టార్

Advertisement

ఈ ప్లాన్ ద్వారా అపరిమిత 5G డేటాను సైతం జియో ఆఫర్ చేస్తోంది. మీ దగ్గర 5G స్మార్ట్‌ఫోన్ ఉండి జియో True 5G నెట్‌వర్క్ పరిధిలో ఉన్నట్లయితే రోజువారీ డేటా పరిమితితో సంబంధం లేకుండా అపరిమితంగా 5G ఇంటర్నెట్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. మరోవైపు జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను సైతం ఈ ప్లాన్ లో అందిస్తున్నారు. అదే విధంగా జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్లను సైతం ఈ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. దీనివల్ల లైవ్ టీవీ, సినిమాలు, షోలు చూడటంతో పాటు మీ ఫోన్ డేటాను క్లౌడ్‌లో సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు.

ఈ ప్లాన్ వల్ల ఎవరికి లాభం?

ఆన్ లైన్ క్లాసులు వినే విద్యార్థులు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులకు ఈ ప్లాన్ ద్వారా వచ్చే అధిక డేటా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అలాగే రీల్స్, వీడియోలు చూస్తూ సోషల్ మీడియా, యూట్యూబ్ లో ఎక్కువగా గడిపేవారికి సైతం ఇది సరిపోతుంది. పదే పదే నెలవారీ రీఛార్జ్‌ చేసే పనిలేకుండా 3 నెలల కాలపరిమితితో పక్కా ఆల్ రౌండర్ ప్లాన్ కోరుకునేవారికి సైతం ఇది లాభదాయకంగా ఉంటుంది.

Advertisement

Also Read: Airtel గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. అపరిమిత 5G, 18కి పైగా ఓటీటీలు, ఫ్రీ కాల్స్.. 84 రోజులు పండగే!

ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?

జియో రూ. 899 ప్లాన్‌ను వివిధ మార్గాల్లో చాలా ఈజీగా రీఛార్జ్ చేసుకోవచ్చు. మొబైల్‌లోని ‘మై జియో యాప్’ ఓపెన్ చేసి ‘రీఛార్జ్’ విభాగంలోకి వెళ్లి రూ. 899 ప్లాన్‌ను ఎంచుకుని పేమెంట్ పూర్తి చేయవచ్చు. లేదంటే జియో అధికారిక వెబ్‌సైట్ (jio.com)కి వెళ్లి మొబైల్ నంబర్ ఎంటర్ చేసి నేరుగా రీఛార్జ్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ యాప్స్ అయిన ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి యాప్స్ ద్వారా కూడా రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంది.

Also Read: జియో బంపరాఫర్.. ఈ ప్లాన్లతో అమెజాన్ ప్రైమ్ ఉచితం.. ఇంకా మరెన్నో బెనిఫిట్స్!

Tags

Related News

రూ. 2,000 కే వాషింగ్ మిషన్.. సైకిల్ పెడల్ తొక్కితే బట్టలు క్లీన్.. ఇదేదో భలే ఉందే!

బెస్ట్ పవర్ బ్యాంక్‌పై భారీ డిస్కౌంట్..వెంటనే కొనేయండి

iPhone Duoని పక్కన పెట్టేలా iPhone 18 Proలో ఉన్న 5 కీలక ఫీచర్లు ఇవే!

తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు..ట్రెండింగ్‌లో టాప్ గాడ్జెట్

Airtel గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. అపరిమిత 5G, 18కి పైగా ఓటీటీలు, ఫ్రీ కాల్స్.. 84 రోజులు పండగే!

50 గంటల బ్యాటరీ, శాటిలైట్ కమ్యూనికేషన్.. రూ.1.09 లక్షల ధరతో Apple Watch Ultra 4 లాంచ్!

పార్టీలకు ఊపు తెచ్చే.. కొత్త స్పీకర్ లాంచ్! మీరూ ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×