E-Paper
Advertisement

బెస్ట్ పవర్ బ్యాంక్‌పై భారీ డిస్కౌంట్..వెంటనే కొనేయండి

బెస్ట్ పవర్ బ్యాంక్‌పై భారీ డిస్కౌంట్..వెంటనే కొనేయండి
Advertisement

Pebble 30000 mAh power bank: ప్రయాణాలు చేసేటప్పుడు లేదా ఆఫీసు పనిలో.. బిజీగా ఉన్నప్పుడు స్మార్ట్‌ ఫోన్ బ్యాటరీ అయిపోతే.. కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి.. ప్రముఖ టెక్ బ్రాండ్ ‘పెబుల్’ మార్కెట్లోకి ఒక అద్భుతమైన గాడ్జెట్‌ను తీసుకువచ్చింది. అదే ఈ మోడల్ పవర్ బ్యాంక్ .. కేవలం రూ. 1,899 ధరలో లభిస్తున్న ఈ భారీ బ్యాటరీ పవర్ బ్యాంక్ ప్రత్యేకతలు, పని తీరు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు: 

పాకెట్ సైజులో భారీ పవర్:

సాధారణంగా 30,000 mAh కెపాసిటీ కలిగిన పవర్ బ్యాంకులు సైజులో చాలా పెద్దవిగా, బరువుగా ఉంటాయి. వాటిని జేబులో.. పెట్టుకోవడం లేదా ప్రయాణాల్లో మోసుకెళ్లడం కష్టంగా ఉంటుంది. కానీ, పెబుల్ కంపెనీ ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపింది. ఈ పవర్ బ్యాంక్‌ను అత్యంత కాంపాక్ట్, పాకెట్ సైజులో డిజైన్ చేసింది. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ.. లోపల మాత్రం అత్యంత పవర్ ఫుల్ బ్యాటరీని నిక్షిప్తం చేశారు. దీని ప్రీమియం, స్టైలిష్ లుక్ యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ట్రిప్స్‌కి వెళ్లేవారు దీన్ని ఈజీగా బ్యాగ్‌లో లేదా జేబులో సర్దుకోవచ్చు.

30000 mAh కెపాసిటీ, ఛార్జింగ్ స్పీడ్:

Advertisement

ఈ పవర్ బ్యాంక్ మెయిన్ హైలైట్ దాని బ్యాటరీ సామర్థ్యం. ఇందులో.. ఏకంగా 30,000 mAh పవర్ లభిస్తుంది. సాధారణ స్మార్ట్‌ ఫోన్‌లను ఇది ఈజీగా 5 నుంచి 6 సార్లు పూర్తిగా ఛార్జ్ చేయగలదు. మీరు రోడ్డు ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా కరెంట్ లేని ప్రాంతాలకు వెళ్లినప్పుడు మీ ఫోన్, టాబ్లెట్ లేదా ఇతర గాడ్జెట్‌లు డెడ్ అవుతాయనే టెన్షన్ అసలు ఉండదు.

ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల మీ డివైజ్‌లు చాలా తక్కువ సమయంలోనే.. ఫుల్ ఛార్జ్ అవుతాయి. అలాగే.. మల్టి పుల్ అవుట్‌ పుట్ పోర్ట్‌లు ఉండటం వల్ల ఒకే సమయంలో.. ఒకటి కంటే ఎక్కువ డివైజ్‌లను ఒకే సారి ఛార్జ్ చేసుకోవచ్చు. స్నేహితులతో.. కలిసి ప్రయాణించేటప్పుడు ఇది చాలా ఉపయోగ పడుతుంది.

ఫీచర్లు, మల్టిపుల్ కనెక్టివిటీ:

Advertisement

ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను వాడేటప్పుడు సేఫ్టీ చాలా ముఖ్యం. పెబుల్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ పవర్ బ్యాంక్‌లో లేటెస్ట్ మల్టీ-లేయర్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంది. ఇది ఓవర్ ఛార్జింగ్, ఓవర్ వోల్టేజ్, షార్ట్ సర్క్యూట్,అధిక ఉష్ణోగ్రతల నుంచి మీ స్మార్ట్‌ ఫోన్‌ను , పవర్ బ్యాంక్‌ను పూర్తిగా రక్షిస్తుంది.

Also Read:  తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు..ట్రెండింగ్‌లో టాప్ గాడ్జెట్

దీనిలో టైప్-సి.. యూఎస్‌బీ పోర్ట్‌లతో పాటు తగిన కేబుల్ సపోర్ట్ లభిస్తుంది. పవర్ బ్యాంక్‌లో.. ఎంత బ్యాటరీ మిగిలి ఉందో తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఎల్ఈడీ ఇండికేటర్స్ ఇచ్చారు. దీని వల్ల ఛార్జ్ ఎప్పుడు పెట్టుకోవాలో ముందుగానే అంచనా వేయొచ్చు.

ధర :

ఇండియన్ మార్కెట్లో ఈ మోడల్ అసలు ధర కేవలం రూ. 1,899 మాత్రమే. రూ. 2,000 లోపు బడ్జెట్‌లో ఇంత భారీ బ్యాటరీ కెపాసిటీ, అది కూడా పాకెట్ సైజులో దొరకడం నిజంగా గొప్ప విషయమే. తరచూ ప్రయాణాలు చేసే వారికి, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు, బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా కోరుకునే టెక్ లవర్స్ కు ఇది ఒక బెస్ట్ అండ్ పర్‌ఫెక్ట్ ఛాయిస్!

Related News

కేవలం 3.8 గ్రాముల బరువు, 50 గంటల బ్యాటరీ లైఫ్.. వివో కొత్త బడ్స్ భారత్‌లో లాంచ్!

రూ. 2,000 కే వాషింగ్ మిషన్.. సైకిల్ పెడల్ తొక్కితే బట్టలు క్లీన్.. ఇదేదో భలే ఉందే!

iPhone Duoని పక్కన పెట్టేలా iPhone 18 Proలో ఉన్న 5 కీలక ఫీచర్లు ఇవే!

తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు..ట్రెండింగ్‌లో టాప్ గాడ్జెట్

జియో దుమ్మురేపే ప్లాన్.. రూ.899 కే 90 రోజుల వ్యాలిడిటీ.. 5G డేటా, ఓటీటీ, ఫ్రీ కాల్స్!

Airtel గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. అపరిమిత 5G, 18కి పైగా ఓటీటీలు, ఫ్రీ కాల్స్.. 84 రోజులు పండగే!

50 గంటల బ్యాటరీ, శాటిలైట్ కమ్యూనికేషన్.. రూ.1.09 లక్షల ధరతో Apple Watch Ultra 4 లాంచ్!

Big Stories

Advertisement
×