Apple Watch Ultra 4: యాపిల్ నుంచి మరో అదిరిపోయే గ్యాడ్జెట్ అందుబాటులోకి వచ్చేసింది. సరికొత్త ఫీచర్లు, మరింత బలమైన డిజైన్‌తో ‘యాపిల్ వాచ్ అల్ట్రా 4’ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. ముఖ్యంగా సాహస యాత్రలు చేసేవాళ్లకు, రన్నింగ్, జిమ్ ఎక్కువగా చేసే వాళ్లకు ఈ వాచ్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. దీని ప్రారంభ ధర రూ.1,09,900గా ఉంది. ఇప్పటికే ప్రీ-ఆర్డర్స్ కూడా మొదలైపోయాయి. సెప్టెంబర్ 18 నుంచి అధికారికంగా సేల్స్ స్టార్ట్ అవుతాయి.
ఈ Apple Watch Ultra 4 లుక్స్ పరంగానే కాదు.. తయారీలోనూ చాలా గట్టిగా ఉంటుంది. 49 మిమీ ఏరోస్పేస్ గ్రేడ్ టైటానియం కేస్‌తో దీన్ని డిజైన్ చేశారు. ఎంత రఫ్‌గా వాడినా తట్టుకునేలా ఉంటుంది. 3000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వచ్చే రెటినా ఓఎల్‌ఈడీ స్క్రీన్ దీని సొంతం. ఎండలో బయట తిరిగినప్పుడు స్క్రీన్ మీద టైమ్ లేదా మ్యాప్స్ చూస్తే చాలా క్లియర్‌గా కనిపిస్తుంది.
Also Read: రూ.500 లోపు బెస్ట్ టైప్-సి, 3.5ఎంఎం ఇయర్ ఫోన్స్.. వీటికి ఇప్పుడు మార్కెట్లో ఫుల్ డిమాండ్!
ఇందులో ఎస్11 చిప్‌ను వాడారు. వాచ్‌ఓఎస్ 27 మీద ఇది రన్ అవుతుంది. దీంట్లో కొత్తగా రెడీనెస్ యాప్ పెట్టారు. ఇది మనం రోజంతా చేసిన పనికి మన బాడీ ఎంతవరకు రికవర్ అయింది అనే విషయాన్ని క్లియర్‌గా చెప్తుంది. అలాగే మొబైల్ సిగ్నల్ లేని అడవులు లేదా కొండల్లో ఉన్నప్పుడు అత్యవసరాల కోసం శాటిలైట్ కమ్యూనికేషన్ సదుపాయం కూడా ఇచ్చారు. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్ వల్ల రూట్ కరెక్ట్‌గా ట్రాక్ అవుతుంది.
Apple Watch Ultra 4లో అందరినీ ఆకట్టుకునే పెద్ద అప్‌గ్రేడ్ బ్యాటరీ అనే చెప్పాలి. నార్మల్ వాడకంలో ఇది ఏకంగా 50 గంటల వరకు పవర్‌ని ఇస్తుంది. ఒకవేళ Low పవర్ మోడ్ ఆన్ చేస్తే దాదాపు 84 గంటల వరకు ఛార్జింగ్ వస్తుంది. ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ వాచ్ కేవలం 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు.. 18 గంటల పాటు వాడుకునేలా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు.
సాధారణ స్మార్ట్‌వాచ్‌లతో పోలిస్తే.. ఇది కాస్త ధర ఎక్కువే అయినా, అందించే ఫీచర్లు ఆ రేంజ్‌లోనే ఉన్నాయి. ఎక్కువ సమయం బయట గడిపేవాళ్లకు, హెల్త్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవాళ్లకు ఇది చాలా బాగుంటుంది. రోజువారీ నోటిఫికేషన్లతో పాటు, హెల్త్ ట్రాకింగ్ కూడా పక్కాగా పనిచేస్తుంది.
Also Read: ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!