Gundeninda GudiGantalu Today episode October 30th : మీనా నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు నైవేద్యాలు చేయాలి ఏ రోజు ఏ అమ్మవారు గురించి ఎలాంటి నైవేద్యాలు చేయాలి అని శ్రుతితో చెప్తుంది. మీనా చాలా గ్రేట్ మీనాకు అన్ని తెలుసు అని వాళ్ళిద్దరు అంటారు. అయితే ఒకరోజు కట్ట పొంగలి చేయాలి అని చెప్పగానే రోహిణి శృతి ఇద్దరు వెళ్లి కట్టెలు తీసుకొని వస్తారు. అది చూసిన మీనా నవ్వుకుంటుంది. మీనా ఏం చెప్పినా కూడా ఇద్దరూ ఏదో ఒకటి చేస్తూ ఉండడంతో మీ ఇద్దరి వల్ల ఏమీ కాదు నేనే చేసుకుంటాను అని అంటుంది మొత్తానికి తొమ్మిది రోజులు అమ్మవార్ల గురించి మీనా చాలా చక్కగా చెప్తుంది. ఈ ఎపిసోడ్ కి ఇదే హైలెట్గా నిలుస్తుంది.
మనోజ్ ని అందరు గుడిలో పడుకోవాలి అని చెప్పిన సరే వినకుండా ఉండడంతో బాలు తిడతాడు. ఇవాళ రాత్రి మనం అందరం గుడిలోని పడుకోవాలి అని ఎంత చెప్తున్నారు సరే మనోజ్ మాత్రం అస్సలు వినడు. ఇక బాలు నువ్వు మంచి బిజినెస్ మాన్ గా ఎదగాలని అనుకున్నాను. కానీ ప్రభావతి రోహిణి పీడ విరగడ అయిపోతుంది ఈరోజు మనం దేవుడి దగ్గరే పడుకోవాలి అని చెప్తుంది. ఇక ప్రభావతి మాట విన్న మనోజ్ దేవుడి దగ్గర పడుకోవడానికి ఒప్పుకుంటాడు. అయితే మొత్తానికి బాలు గుడి దగ్గరికి వెళ్లడానికి చాలా సంతోషంగా అందర్నీ సిద్ధం చేస్తాడు అందరూ కలిసి ఇంకా గుడిలోనే పడుకోవాలి అని అనుకుంటారు.
అందరూ కలిసి గుడికి రాగానే రాజేష్ ఇప్పటి వరకు సైలెంట్ఉంది అని అందరూ అనుకున్నారు.. మీరు వచ్చారు కదా ఇప్పుడు గుడికి కళ వచ్చేసింది గుడి నిండుగా ఉంది అని రాజేష్ అంటాడు. అయితే మనోజ్ ఇప్పుడు వచ్చేసాం కదా ఆ గిఫ్ట్ గురించి ఎలాగైనా తెలుసుకోవాలి అని రాజేష్ వెనకాలే తిరుగుతూ ఉంటాడు. అయితే మీనా అమ్మవారి కోసం ప్రసాదం తీసుకుని వచ్చాము అని చెప్పగానే చాలా మంచి పని చేసావ్ అమ్మ నువ్వు చేసే వంట ఏదైనా బాగుంటుంది అమ్మవారి ప్రసాదం అంటే ఎంత బాగుంటుందో అర్థం చేసుకోవచ్చని రాజేష్ అంటాడు. ఇక అందరూ కలిసి గుడిలోకి అడుగుపెట్టి అమ్మవారిని దర్శించుకుని సంతోషంగా ఉండాలని అనుకుంటారు.
అయితే గుడిలోకి వెళ్ళగానే అందరం పక్కలు వేసుకొని పడుకోవాలి అని అనుకుంటారు. కానీ అప్పుడే పడుకుంటే ఏం మజా వస్తుంది. ఇక్కడికి వచ్చి మనం ఏదో ఒకటి చేసి సరదాగా గడపాలి అని మీనా అంటుంది. అదే విధంగా శృతి కూడా అవును ఎప్పుడు తిని పడుకోవడమేనా ఇలా సరదాగా ఏదో ఒక ఆట ఆడుకోవాలి అని అంటుంది. అయితే అందరూ కలిసి మాట్లాడుకుని ఒక ఆట ఆడుకోవాలని అనుకుంటారు. అందులో చీటీలు తీసి ఎవరికి ఏది వస్తే అది చేయాలి అని శ్రుతి చెప్తుంది. అనుకున్న విధంగానే మొత్తం చీటీలను రాసుకొని వస్తుంది. ఇకపోతే శృతి అందులో ఏమి వస్తే అది కచ్చితంగా చేయాలి అని అంటుంది అయితే.. ముందుగా ఆడవాళ్లు గొప్ప వల్ల మగవాళ్ళు గొప్ప వాళ్ళ అనే ప్రశ్న వాళ్ళకి వస్తుంది. ఇక ఆడవాళ్లు మగవాళ్ళు కొట్టుకునే పని వరకి వెళ్తారు. ఈ గేమ్ ఎపిసోడ్కి కాస్త ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది.
ఆ తర్వాత అత్తలు గ్రేటా కోడలు గ్రేటా అన్న ప్రశ్న రావడంతో ఇక మగవాళ్ళు మీరు కొట్టుకు చావండి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని అంటారు. మొత్తానికి అత్తలు వర్సెస్ కోడలు ప్రశ్న అందరిని మాటలు యుద్ధానికి తీసుకువెళుతుంది. ఒకరినొకరు మాట్లాడుకుంటూనే నువ్వు గ్రేట్ఆ నువ్వు గ్రేట్ఆఅంటు చెప్పుకుంటూ ఉంటారు. చివరికి అత్తలే గ్రేట్ అని మీనా చెప్పడంతో ప్రభావతి కాస్త శాంతిస్తుంది. అయితే బామ్మ గారి గురించి నేను చెప్పాను బామ్మగారు చాలా గ్రేట్ కదా అని అంటుంది దాంతో ఇక ప్రభావతి కూడా తప్పక ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తానికి అత్తలు వర్సెస్ కోడలు ప్రశ్నకి మీనా పుల్ స్టాప్ పెట్టిస్తుంది. ఇక మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను వెళ్లి నీళ్లు తాగేసి వస్తాను మనోజ్ వెళ్తాడు అక్కడ రాజేష్ రాగానే నాకు మరింత గిఫ్ట్ లు కావాలి అని మళ్లీ ఈ డబ్బులు ఇస్తాడు. అటు గుణ మాత్రం బాలు నెలగైనా సరే దెబ్బ కొట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో గుణ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Intinti Ramayanam Today Episode: భరత్ పై భానుమతి సీరియస్..అయ్యో రమ్య.. పల్లవికి వార్నింగ్..