Maha Kumbh : ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆధ్యాత్మిక వేడుక.. మహా కుంభమేళా. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ లో ఈ వేడుక ఎంతో ఘనంగా జరుగుతుంది. ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి కోట్లాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఇక ఇంతమందికి సౌకర్యాలు ఉన్నతంగా కల్పించాలంటే మాటలా? ఇంకా ముఖ్య విషయం ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా టెలికాం సేవలు అందించడం. నిజంగా ఈ విషయం టెలికాం సంస్థలకు పెద్ద సవాలనే చెప్పాలి. అయినప్పటికీ కోట్లాది భక్తజనం వస్తున్నప్పటికీ కాల్స్, మెరుగైన ఇంటర్నెట్ సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా టెలికాం సంస్థలు తమ సేవలను అందిస్తున్నాయి. అసలు ఇది ఎలా సాధ్యమైంది.. టెలికాం సంస్థలు ఫాలో అయిన రూల్స్ ఏంటో తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్లో జరిగే మహాకుంభమేళాకు కోట్లాదిమంది భక్తులు వస్తారని ముందే అంచనా వేసిన టెలికాం సంస్థలు.. భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా తమ సేవలను మరింత మెరుగ్గా అందించే ప్రయత్నాలు చేపట్టాయి. దాదాపు అన్ని టెలికాం సంస్థలు తమ సేవల్ని పెంచుకునే దిశగా అడుగులు వేసాయి. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్.. ప్రముఖ టెలికాం సంస్థలు ఈ సేవలను ఎలా నిర్వహించాయో వివరంగా వెల్లడించాయి. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ కలిసికట్టుగా పనిచేసి మూడు విపత్తు ప్రతిస్పందన నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. అత్యవసర సమయాల్లో కమ్యూనికేషన్ కోసం ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సంక్షోభ పరిస్థితుల్లో వెంటనే చర్యలు చేపట్టేందుకు సహాయం చేస్తున్నాయి. వీటితో పాటు 53 టెలికాం ప్రొవైడర్లను సైతం ఏర్పాటు చేశాయి.
ALSO READ : భీభత్సంగా పడిపోయిన వీవో ధరలు.. రూ.20వేలలోపే ప్రీమియం మెుబైల్!
కుంభమేళ నేపథ్యంలో ప్రయాగ్ రాజ్ లో కొత్తగా 328 టవర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 328 బిటిఎస్ లు ఏర్పాటు చేశారు. హై స్పీడ్ నెట్వర్క్ కవరేజ్ అందించేందుకు 92 కిలోమీటర్ల వరకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేసారు. ఇక ఈ ప్రాంతంలో ఎవరైనా పొరపాటున తప్పిపోతే తెలుసుకునేందుకు నెట్వర్క్ అత్యవసరం కాబట్టి ఈ సేవలు మరింత మెరుగుపరుచుకునే దిశగా ఎయిర్టెల్ కొత్తగా 287 సైట్స్, 73 సెల్ఫోన్ వీల్స్ ను ఏర్పాటు చేసి యూజర్స్ కోసం మెరుగైన సేవలను అందించింది.
నిజానికి 12 ఏళ్ల క్రితం జరిగిన మహా కుంభమేళాతో పోలిస్తే ఇప్పుడు జరిగిన కుంభమేళాలో నెట్వర్క్ సదుపాయం మరింత మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. డిజిటల్ పేమెంట్ సదుపాయం ఉండడంతో డబ్బులు పోతాయనే సమస్య లేదని ఎక్కడికి వెళ్లినా తేలికగా పేమెంట్స్ చేయగలిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మహా కుంభమేళాకు 40 కోట్లకు పైగా భక్తులు తరలివస్తారని అంచనా. ఇలా 45 రోజులు పాటు ఎంతో ఘనంగా జరిగే ఈ వేడుకలు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు.
ఇక 29వ తేదీన మౌని అమావాస్య రోజున మరింత మంది భక్తులు కుంభమేళాకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ రోజు గంగా నదిలో జలాలు అమృతంతో సమానంగా మారుతాయని.. ఇందులో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగి పుణ్యం చేకూరుతుందని పురాణాలు చెబుతున్నాయి. దీంతో త్వరలో మరింతమంది భక్తుల తాకిడి పెరిగే అవకాశం కనిపిస్తోంది.