BigTV English

Rohit Sharma: 5 రకాల మాంసం తింటున్న రోహిత్ శర్మ.. పంది కూర కూడా వదలడం లేదుగా ?

Rohit Sharma: 5 రకాల మాంసం తింటున్న రోహిత్ శర్మ.. పంది కూర కూడా వదలడం లేదుగా ?

Rohit Sharma: టీమిండియా కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఈ మధ్య జరిగిన ఏ సిరీస్ లో కూడా రోహిత్ తన స్థాయికి తగిన ప్రదర్శనను చూపించలేకపోయాడు. సొంత గడ్డపై న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో దారుణంగా విఫలమయ్యాడు. అతడు ఇలా విఫలం కావడానికి ఫిట్నెస్, మరియు అధిక బరువే కారణమని విమర్శలు వెల్లువెత్తాయి.


Also Read: U-19 T20WC: సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన గొంగడి త్రిష.. టీమిండియా మరో విజయం !

రోహిత్ శర్మ ఈమధ్య బాగా బరువు పెరిగాడని, ఫిట్నెస్ లేని కారణంగానే రాణించలేకపోతున్నాడని, ఇక అతడు రిటైర్మెంట్ తీసుకుంటేనే మంచిదనే విమర్శలు వచ్చాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ముందు రోహిత్ శర్మ ఫిట్నెస్ పై ఫోకస్ చేయడం లేదని, ఇలా అయితే ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం కష్టమేనని మండిపడ్డారు. ఈ క్రమంలో గతంలో ఓ వివాదంలో చిక్కుకున్న రోహిత్ శర్మ విషయాన్ని ఇప్పుడు మళ్ళీ తెరపైకి తీసుకువచ్చారు. 2021 జనవరిలో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత క్రికెట్ జట్టు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది.


ఆ సమయంలో ఏకంగా ఐదుగురు క్రికెటర్లు వివాదాలకు కేంద్రబిందువయ్యారు. ఆస్ట్రేలియాలోని మేల్ బోర్న్ లో ఈ ఐదుగురు క్రికెటర్లు సృష్టిగా భోజనం చేశారు. న్యూ ఇయర్ ని పురస్కరించుకొని రోహిత్ శర్మ నలుగురు క్రికెటర్లతో కలిసి ఓ రెస్టారెంట్ కి భోజనానికి వెళ్లారు. వీరిలో రోహిత్ శర్మతో పాటు గిల్, రిషబ్ పంత్, పృద్వి షా, నవదీప్ షైనీ ఉన్నారు. అయితే ఆ రెస్టారెంట్ లో వీరు తిన్న ఐటమ్స్ పట్ల అప్పట్లో పెద్ద దుమారం రేగింది. వీరు అన్ని నాన్ వెజ్ వంటకాలనే ఆర్డర్ చేశారు.

ఇందులో రొయ్యలు, పంది మాంసం, పుట్టగొడుగులు, చికెన్ మాత్రమే కాకుండా గొడ్డు మాంసం కూడా ఉంది. వీరు నిజంగానే ఈ భోజనం చేశారా..? అన్న దానిపై స్పష్టత లేదు. కానీ నివేదికల ప్రకారం రోహిత్ శర్మ తనని తాను శాకాహారిగా పిలుచుకుంటాడు. ఈ క్రమంలో బీఫ్ ని మెనూలో చేర్చడం పట్ల గతంలో దుమారం రేగింది.

మాంసాహారానికి దూరంగా ఉండే సామాజిక వర్గానికి చెందిన రోహిత్ శర్మ.. ఇలాంటి వాటిని భుజించడం పట్ల అప్పట్లో అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. అయితే ఆ బిల్లుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని కూడా ప్రశ్నించారు. అయితే ఆ రెస్టారెంట్ లో మీరు భోజనం చేసిన తర్వాత ఓ అభిమాని ఆ బిల్లును చెల్లించారట.

Also Read: Kohli – Ranji: ఢిల్లీలో టైట్ సెక్యూరిటీ.. స్టేడియానికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ ?

ఈ బిల్లుని ఆ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెద్ద వివాదం చెలరేగింది. ఈ వివాదాన్ని ఇప్పుడు మరోసారి తిరమీదికి తీసుకురావడంతో ఇంతలా తింటే ఇక క్రికెట్ ఏం ఆడతాడు..? బరువు పెరగడం తప్ప ఫలితం ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. కానీ రోహిత్ శర్మ అభిమానులు మాత్రం ఇందులో వాస్తవం లేదని, ఇలాంటి రూమర్స్ ని వ్యాప్తి చేయవద్దని మండిపడుతున్నారు.

Related News

Sara Tendulkar :  టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న సచిన్ కూతురు సారా ?

Sri Lanka : అప్పుడు తండ్రులు దుమ్ము లేపారు… ఇప్పుడు కొడుకులు రంగంలోకి దిగారు.. శ్రీలంక జట్టుకు ఇక తిరుగులేదు

Smaran Ravichandran : SRH జట్టులో మరో మరో ఆణిముత్యం.. కావ్య పాపకు లక్ కలిసి వచ్చింది.. ఆ ప్లేయర్ ఎవరంటే

Varun-Shruti : టీమిండియా క్రికెటర్ కు దగ్గర అవుతున్న టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్?

Dream11: టీమిండియాకు షాక్..తప్పుకున్న డ్రీమ్ 11.. కొత్త స్పాన్సర్ ఎవరంటే ?

Aus Vs SA : ఆస్ట్రేలియా విధ్వంసం.. 50 ఓవర్లలో 431 పరుగులు.. హెడ్ తో పాటు మొత్తం ముగ్గురు సెంచరీలు

Big Stories

×