Hotel Booking Scam : ఆన్లైన్ స్కామ్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయాయన్న సంగతి తెలిసిందే. ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న కొద్దీ, సైబర్ మోసాలూ అంతకంతకూ పెరుగిపోతున్నాయి. అమాయకుల్ని లక్ష్యంగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఖాతాల్లోని డబ్బును ఊహకందని రీతిలో లూటీ చేసేస్తున్నారు. తమ సైబర్ మాయాజాలంతో సామాన్యులనే కాదు, ప్రముఖుల్ని సైతం బురిడీ కొట్టిస్తున్న అనేక ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అయితే తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఓ 63 ఏళ్ల వృద్ధుడు ఆన్లైన్ స్కామ్ బారిన పడి ఏకంగా రూ.13 లక్షలను పోగొట్టుకున్నాడు. అది కూడా హోటల్ బుకింగ్ స్కామ్‌లో ఇరుక్కున్నాడు.
అసలేం జరిగిందంటే? – ఓ 63 ఏళ్ల వృద్ధుడు మిథాఖలీలో ఉంచాడు. అతడు ఆధ్యాత్మిక ప్రాంతమైన అంబాజీకి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు. 2024 మార్చిలో ఈ ట్రిప్ కోసం ప్రణాళిక చేసుకున్నాడు. అప్పుడు అతడు అంబాజీ గుడికి దగ్గర్లోని ఓ హోటల్ కోసం ఆన్లైన్లో వెతికాడు. ఆ సమయంలో అతడికి ఓ హోటల్‌కు సంబంధించిన ఫోన్ నెంబర్ కనిపించింది. దానికి అతడు కాల్ చేసి మాట్లాడగా, హోటల్‌కు సంబంధించిన స్టాఫ్ అంటూ అవతలి వైపు నుంచి ఓ వ్యక్తి మాట్లాడాడు. ఈ కన్వర్జేషనన్ను నమ్మిన వృద్ధుడు రూ.10 వేలు అడ్వాన్స్ అడిగాడు. అందుకు వృద్ధుడు కూడా ఆన్లైన్ యూపీఐ ట్రాన్సెక్షన్ ద్వారా అడిగిన మొత్తాన్ని చెల్లించాడు.
క్యాన్సిలేషన్‌తో మారిన కథ – అయితే ఆ తర్వాత వృద్ధుడు, బుకింగ్ క్యాన్సిల్ చేసుకోవాలని భావించి సదరు వ్యక్తితో మళ్లీ మాట్లాడాడు. కానీ ఈ బుకింగ్‌ను క్యాన్సిల్ చేసుకోవాలంటే మళ్లీ తిరిగి రూ.9,999 క్యాన్సిలేషన్ ఛార్జి కట్టాలని, అప్పుడు పూర్తి సొమ్ము తిరిగొస్తాయని నమ్మబలికాడు అవతలి వ్యక్తి.
ముందుగా రూ.2 పేమెంట్ చేయగా, వృద్ధుడికి తిరిగి రూ.4 రీఫండ్ అయ్యాయి. అలా రీఫండ్ ప్రాసెస్‌ను నమ్మిన వృద్ధుడు పలు దఫాలుగా పేమేంట్స్ చేయడం, తిరిగి రీఫండ్ పొందడం జరిగింది. అయితే చివరికి వృద్ధుడు పేమెంట్స్ ద్వారా రూ.1.79 లక్షలు చెల్లించగా, అవి తిరిగి రాలేదు. దీంతో వృద్ధుడు కంగుతిన్నాడు. ఈ క్రమంలోనే వృద్ధుడి బ్యాంక్ సహా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని కూడా స్కామర్లు దొంగిలించాడు.
చివరికి మోసాన్ని గుర్తించిన వృద్ధుడు పోలీసులను ఆశ్రయించి తాను రూ.12.79 లక్షలు పొగొట్టుకున్నట్లు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ స్కామ్ నుంచి ఎలా తప్పించుకోవాలంటే? –
వెరీఫై ది సోర్స్ – ఏ పేమెంట్స్ అయినా చేసే ముందు హోటల్ లేదా సర్వీస్ ప్రొవైడర్ పక్కా నమ్మదగినదా? కాదా? అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. అఫీషియల్ వెబ్‌సైట్స్ లేదా నమ్మదగిన బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లోనే చెల్లింపులు చేయాలి.
పేమెంట్ రిక్వెస్ట్‌తో జాగ్రత్త – ఎవరైనా అడ్వాన్స్ పేమెంట్స్ లేదా క్యాన్సిలేషన్ ఫీజ్ అడిగినప్పుడు అనుమానించాలి. అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సాధరణంగా ప్రముఖ వ్యాపార సంస్థలు ఎప్పుడు ముందస్తు పేమెంట్స్ అడగవు.
వ్యక్తిగత సమాచారన్ని చెప్పొద్దు – ఎప్పుడైనా, ఎవరితోనైనా బ్యాంక్ డీటెయిల్స్ లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవచ్చు. ముఖ్యంగా ఫోన్లో లేదా ఆన్‌లైన్‌తో అస్సలు షేర్ చేయొద్దు.
అనుమానంగా ఉంటే ఫిర్యాదు – అవతలి వైపు వ్యక్తి అడిగే సమాచారం అనుమానంగా అనిపిస్తే, తక్షణమే పోలీసులకు లేదా పై అధికారులు కంప్లైంట్ చేయాలి. అప్పుడే ఎటువంటి నష్టం జరగకుండా అడ్డుకోవచ్చు.
ALSO READ : ఫ్లిప్‌కార్ట్ దిమ్మతిరిగే సేల్.. గూగుల్ పిక్సెల్ 9 పై భారీ తగ్గింపు