Dil Raju: ఇటీవల FDC ఛైర్మెన్ దిల్ రాజు నేతృత్వంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ జరిగిన విషయం తెలిసిందే. భేటీలో ఎలాంటి అంశాలను చర్చించారు అనే విషయాలను దిల్ రాజు చాలా స్పష్టంగా వివరించారు కూడా. అల్లు అర్జున్ కేసు గురించి చర్చించడం కోసమే ఈ భేటీ జరిగిందని బయట టాక్ నడిచింది. రేవతి మృతి తరువాత అలాంటి ఘటనలు జరగకుండా రేవంత్ రెడ్డి బెన్ ఫిట్ షోలను క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాంటి నిర్ణయాన్నీ వెనక్కి తీసుకోవాలని, టికెట్ రేట్లు పెంచమని అడగడానికే ఈ మీటింగ్ జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే ఆ భేటీలో ఇలాంటి విషయాలు ఏమి లేవని దిల్ రాజు స్పష్టం చేశాడు.
తెలుగు సినీ పరిశ్రమ పట్ల తనకు ఉన్న విజన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమతో షేర్ చేసుకున్నారని, తెలుగు సినిమా వాళ్లే కాకుండా హాలీవుడ్ వాళ్లు కూడా హైదరాబాద్‌లో షూటింగ్స్ చేసుకునేలా ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే విషయంపై మాట్లాడమని, ముఖ్యంగా డ్రగ్స్ అవగాహన కార్యక్రమాల్లో సెలబ్రిటీలు పాల్గొనాలనే దానిమీద ఈ మీటింగ్ నడిచిందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ భేటీపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Anil Ravipudi: దేన్నీ వదలడం లేదుగా.. అన్ని వాడేసున్నావ్ గా.. ఏం వాడకం అయ్యా బాబు
“కేవలం ప్రచారం కోసమే రేవంత్ రెడ్డి ఆ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల నుంచి అందరి దృష్టిని మళ్లించడానికి టాలీవుడ్ సినీ ప్రముఖులతో మీటింగ్ పెట్టారు. అటెన్షన్, డైవర్షన్ కోసం సీఎం పాకులాడుతున్నారు. టాలీవుడ్ పెద్దలందరితో సెటిల్ చేసుకొని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు” అంటూ ఆరోపించారు. ఇక ఈ ఆరోపణలపై దిల్ రాజు స్పందించాడు. కేటీఆర్ వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.
“గౌరవ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. గౌరవ సీఎం గారితో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని అందరికీ తెల్సిందే. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉంది.
UnStoppable With NBK Ram Charan Episode : ఇప్పుడు డార్లింగ్ వంతు… షోలో చరణ్‌తో ఆట ఆడుకున్న ప్రభాస్..
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పయనంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి.. రాష్ట్రాభివృద్ధికి, సామజిక సంక్షేమానికి, మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం గారు కాంక్షించారు. హైదరాబాదును గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చదిద్దాలనే సీఎం గారి బలమైన సంకల్పాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతించడం జరిగింది.
కాబట్టి అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మా మనవి. రాజకీయ దాడి, ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరిని కోరుతున్నాం. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాం” అంటూ తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
— Chairman – Film Development Corp (@TGFDC_Chairman) December 31, 2024