Google Pixel 9 Pro : ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడుతున్నారా? కానీ ధర చూసి భయపడుతున్నారా? అందుకే ప్రస్తుతం టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఇండియాలో రూ.1,09,999కే రిటైల్ అవుతుంది. కాగా ఈ మెుబైల్ పై ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ లో అదిరిపోయే ఆఫర్స్ ఉన్నాాయి. రూ. లక్షలోపే ఆఫర్ లో ఈ మెుబైల్ ను కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.
Apple, Samsung వంటి ప్రముఖ టెక్ దిగ్గజాలు AI, కెమెరా ఫీచర్స్ తో హై స్టాండర్డ్ మెుబైల్స్ ను మార్కెట్లోకి లాంఛ్ చేస్తుండగా.. Google సైతం తన స్పీడ్ ను పెంచేసి పిక్సెల్ మెుబైల్స్ ను తీసుకొచ్చేసింది. ఇప్పటికే పిక్సెల్ 10, పిక్సెల్ 11 మెుబైల్స్ ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలో గూగుల్ పిక్సెల్ 9 పై అదిరే ఆఫర్స్ నడుస్తుంది. బెస్ట్ కెమెరా, AI అప్‌గ్రేడ్స్ తో వచ్చేసిన ఈ మెుబైల్ పై ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ అదిరిపోయే ఆఫర్ ను అందిస్తుంది. ప్రస్తుతం Flipkart ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.10,000 తగ్గింపు ఉండగా.. పాత ఫోన్‌ని ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.67,600 వరకు తగ్గింపు లభిస్తుంది.
Google Pixel 9 Pro Flipkart deal – గూగుల్ పిక్సెల్ 9 ప్రో భారత్ లో రూ.1,09,999కి రిటైల్ అవుతుంది. Flipkart ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.10,000 తగ్గింపును అందిస్తూ.. దీని ధరను రూ.99,999కు తగ్గించింది. అలాగే, ఈ డీల్‌ను మరింత ఈజీగా మార్చేందుకు Flipkart పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.67,600 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో కాబట్టి Pixel 9 Proని ఫ్లిప్‌కార్ట్ నుండి రూ. 32,399కే పొందవచ్చు.
Google Pixel 9 Pro specifications – Google Pixel 9 Pro మెుబైల్ 1280 x 2856 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.3 అంగుళాల LTPO OLED డిస్‌ప్లేతో వచ్చేసింది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, HDR – 3000 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ కు మద్దతు ఇస్తుంది. ఇంకా గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 తో ప్రోటెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. Pixel 9 Pro హ్యాండ్‌సెట్ Tensor G4 ప్రాసెసర్ తో పనిచేస్తూ Android 14లో రన్ అవుతుంది. ఈ మెుబైల్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 4700mAh బ్యాటరీను కలిగి ఉంది.
ఈ మొబైల్లో కెమెరా ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం Pixel 9 Pro ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఇందులో OISతో 50MP ప్రధాన కెమెరా, 48MP అల్ట్రావైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో పాటు 48MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఈ హ్యాండ్‌సెట్‌లో 42MP సెల్ఫీ షూటర్ సైతం ఉంది.
ఇక ఇంకెందుకు ఆలస్యం.. మీ పాత మొబైల్ ను అప్ గ్రేడ్ చేస్తూ టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ ను ఆఫర్ లో కొనేయాలనుకుంటే కచ్చితంగా ఈ మొబైల్ ను ట్రై చేసేయండి.
ALSO READ : ఐఫోన్ SE 4 – 5 బిగ్ ఛేంజెస్ ఇవే