WaQar Azam On IND VS SL: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ లో (ACC Men’s Asia Cup Rising Stars 2026 ) భాగంగా టీమిండియా వర్సెస్ శ్రీలంక ( Team India vs Sri Lanka) జూనియర్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ నవంబర్ 26వ తేదీన అంటే రేపు మధ్యాహ్నం జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమ్ ఇండియాపై పాకిస్తాన్ అభిమాని వకార్ ఆజమ్ (WaQar Azam On IND VS SL) వివాదాస్పద పోస్ట్ పెట్టాడు. తొలి సెమీ ఫైనల్ లో శ్రీలంక జూనియర్ జట్టు చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోతుందని చాలెంజ్ చేశాడు. టీమిండియా ఒక వేళ గెలిస్తే తాను బట్టలు లేకుండా తిరుగుతానని స్పష్టం చేశాడు. ఈ మేరకు తాను చేసిన ప్రకటనకు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా తీసుకోవాలని వెల్లడించాడు. దీంతో వకార్ చేసిన స్టేట్ మెంట్ వైరల్ గా మారింది.
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ లో (ACC Men’s Asia Cup Rising Stars 2026 ) భాగంగా శ్రీలంక వర్సెస్ టీమిండియా ( Team India vs Sri Lanka) మధ్య జరిగే సెమీ ఫైనల్ పై పాకిస్తాన్ అభిమాని వకార్ ఆజమ్ (WaQar Azam ) కీలక వ్యాఖ్యలు చేశాడు. రెండు జట్లలో టీమిండియా కంటే శ్రీలంక చాలా బలంగా ఉందని అంచనా వేశాడు. గ్రూప్ స్టేజ్ లో శ్రీలంక ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా సెమీ ఫైనల్ వరకు దూసుకు వచ్చిందని పేర్కొన్నాడు. గ్రూప్ స్టేజ్ లో ఆడిన మూడింటిలో గెలిచి టేబుల్ టాపర్ గా శ్రీలంక నిలిచిందని చెప్పుకొచ్చాడు.
కానీ టీమిండియా మాత్రం రెండింటిలో మాత్రమే విక్టరీ కొట్టిందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో టీమిండియాపై శ్రీలంక టీమ్ అవలీలగా గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీ చేసినప్పటికీ… శ్రీలంక లాంటి జట్టుపై అతడు సరైన ప్రదర్శన చేయడం కష్టమేనని పరువు తీశాడు. బలమైన జట్టుపై వైభవ్ పెద్ద ఇన్నింగ్స్ ను ఆడిన దాఖలాలు లేవని హేళన చేశారు. ఒకవేళ శ్రీలంక పై గెలిచి ఫైనల్ దాకా టీమ్ ఇండియా వస్తే… ఫైనల్స్ లో మాత్రం పాకిస్తాన్ చేతిలో కచ్చితంగా ఓడిపోతుందని చురకలు అంటించాడు.