Special Trains: వేసవి సెలవుల్లో పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రత్యేక రైళ్లను రెడీ చేసింది భారతీయ రైల్వే. దక్షిణ జ్యోతిర్లింగ యాత్ర, గంగా రామాయణ పుణ్యక్షేత్ర యాత్ర, జ్యోతిర్లింగ యాత్ర పేరుతో మూడు ప్యాకేజీలకు శ్రీకారం చుట్టింది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు రైల్వే అధికారులు.
వేసవి సెలవులను పురస్కరించుకుని వివిధ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది ఇండియన్ రైల్వే. మూడు ప్రత్యేక ప్యాకేజీలతో ఆయా రైళ్లను నడుపుతున్నట్లు ఐఆర్‌సీటీసీ విభాగం వెల్లడించింది. ఈ ప్యాకేజీల ద్వారా ప్రయాణికులు దేశంలోని ప్రసిద్ధ దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పించింది.
రైళ్లు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం దీని ముఖ్య ఉద్దేశం. అలాగే బస, ఇతర సౌకర్యాలను కూడా కల్పిస్తుంది కూడా. దక్షిణ భారత్‌లో ప్రసిద్ధ జ్యోతిర్లింగాలను, ముఖ్యమైన దేవాలయాలను సందర్శించేందుకు మొదటి ప్యాకేజ్. ఈ యాత్రలో అరుణాచలం, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, తిరువనంతపురం, తిరుచ్చి, తంజావూరు ప్రాంతాల్లో ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించవచ్చు. మే 22న ప్రారంభమైన ఈ టూర్.. మే 30 నాటికి ముగుస్తుంది.
మరొకటి జూన్ 14న ప్రారంభం కానుంది. జూన్ 22తో ముగియనుంది. దీనికి గంగా రామాయణ పుణ్యక్షేత్ర యాత్ర పేరు పెట్టారు. ఈ యాత్రలో వారణాసి, అయోధ్య, నైమిశారణ్య, ప్రయాగ్‌రాజ్, శృంగవర్పూర్ వంటి ప్రదేశాలు చూడవచ్చు. అయితే ఈ రైలు సికింద్రాబాద్, విజయవాడ, భువనేశ్వర్ మీదుగా వెళ్లనుంది. రామాయణంతో ముడిపడిన ముఖ్యమైన ప్రదేశాలను, గంగానది తీరంలోని పుణ్యక్షేత్రాలను చూసే అవకాశం కలగనుంది.
ALSO READ: వామ్మో.. స్కూల్‌లో సమాధులు, తవ్వి చూస్తే అన్ని శవాలే
మూడోది జ్యోతిర్లింగ యాత్ర జూలై 5న ప్రారంభం కానుంది. ఈ యాత్రలో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీంశంకర్, ఘృష్ణేశ్వర్, ఎల్లోరా, నాగ్‌పూర్ వంటి ముఖ్యమైన ప్రదేశాలున్నాయి. ఈ రైలు సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, పూర్ణ మీదుగా వెళ్లనుంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగాలు, ఎల్లోరా గుహలను సందర్శించవచ్చు.
వేసవి సెలవుల్లో ఫ్యామిలీతో ప్రయాణం చేయాలనుకునేవారికి సులభంగా ఉంటుంది. ఈ యాత్రం జూలై 13తో ముగియనుంది. ఇక టారిఫ్ ఇతర సమాచారం కోసం ప్రయాణికులు 97013 60701, 92810 30712 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. www.irctctourism.com వెబ్‌సైట్‌ను నేరుగా సంప్రదించవచ్చు.