Women’s Day Sale: సాధారణంగా ఎవరైనా కూడా తక్కవ ధరల్లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తారు. అలాంటి వారి కోసం ఉమెన్స్ డే సందర్భంగా పోకో పలు మోడళ్లపై ఆఫర్లను ప్రకటించింది. ప్రత్యేకంగా మహిళల కోసం ఉమెన్స్ డే సెల్‌లో భాగంగా POCO C75 5G ఫోన్ రూ. 7,999కే అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయనే మరిన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
POCO C75 5G స్మార్ట్ ఫోన్‌లో 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పని చేస్తుంది. ఇది సులభమైన విజువల్ అనుభవాన్ని కల్పిస్తుంది. స్క్రోల్ చేయడం, వీడియో చూడడం లేదా గేమ్స్ ఆడడం వంటివి ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఫోన్ పెద్ద డిస్‌ప్లే మీకు ఉత్తమమైన వినోద అనుభవాన్ని అందిస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ఒక 50MP సోనీ కెమెరాతో వస్తుంది. ఇది ఫోటోలు, వీడియోల నాణ్యతను పెంచడానికి సహాయపడుతుంది. సొంత సెల్ఫీలు, వర్షం, దృశ్యాలు లేదా మీ ప్రియమైన క్షణాలను ఈజీగా ఫోటోలు తీసుకోవచ్చు. ప్రత్యేకంగా 50MP కెమెరాతో తీసుకున్న ఫోటోలు ఆకర్షించేలా ఉంటాయి.
Read Also: YouTube Videos Remove: షాకిచ్చిన యూట్యూబ్.. 95 లక్షల వీడియోలు రిమూవ్, కారణమిదే..
POCO C75 5G స్మార్ట్ ఫోన్‌లో 5160mAh బ్యాటరీ అమర్చబడింది. మీరు దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే రోజు మొత్తం సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ ప్రస్తుతం ఎన్చాన్టెడ్ గ్రీన్, ఆక్వా బ్లూ, సిల్వర్ స్టార్‌డస్ట్ రంగుల్లో అందుబాటులో ఉంది.
POCO C75 5G స్మార్ట్‌ఫోన్, అత్యాధునిక 5G టెక్నాలజీతో వస్తుంది. డ్యూయల్ 5G సిమ్ సపోర్ట్‌తో మీకు అత్యుత్తమ 5G నెట్‌వర్క్ అనుభవం లభిస్తుంది.
స్మార్ట్‌ఫోన్ పనితీరులో కీలక పాత్ర పోషించే చిప్‌సెట్ కూడా POCO C75 5Gలో చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇందులో 4nm స్నాప్‌డ్రాగన్ 4S Gen 2 చిప్‌సెట్ కలదు. ఈ చిప్‌సెట్ వేగంగా పనిచేస్తుంది. అనేక యాప్‌లు, గేమ్స్, వీడియోస్, ఇతర పనులలో నిర్వహించుకోవడంలో సహాయపడుతుంది. ఆన్‌లైన్ క్లాసులు, వర్క్, వంటి వాటిని చాలా సులభంగా నిర్వహించుకోవచ్చు.
POCO C75 5G స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 8,999 ఉండగా, ప్రస్తుతం ఉమెన్స్ డే ఆఫర్ ద్వారా రూ. 7,999కి అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ప్రత్యేకంగా మహిళల కోసం ప్రకటించారు. మీరు దీనిని ఫ్లిప్ కార్ట్ లేదా అమెజాన్ వంటి ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ లలో కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు మీ దగ్గరలోని రిటైల్ స్టోర్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఓసారి వెళ్లి ఆఫర్ గురించి తెలుసుకుని కొనుగోలు చేయండి మరి.
Read Also: Gold Duty Free: దుబాయ్ నుంచి గోల్డ్ కొనుగోలు చేస్తే ఎంత సేవ్ చేసుకోవచ్చు.. లిమిట్ ఎంత..