BigTV English

Women Loco Pilots: ఇండియన్ రైల్వేలో భారీగా పెరిగిన లేడీ లోకో పైలెట్లు, తెలంగాణ నుంచి ఎంత మంది ఉన్నారంటే?

Women Loco Pilots: ఇండియన్ రైల్వేలో భారీగా పెరిగిన లేడీ లోకో పైలెట్లు, తెలంగాణ నుంచి ఎంత మంది ఉన్నారంటే?

Indian Railways: రైల్వే సంస్థ అనగానే అదో రిస్క్ తో కూడుకున్న కష్టమైన వ్యవస్థగా భావిస్తారు. సుదీర్ఘ పని గంటలు, సవాలుతో కూడిన భూభాగం, అవసరాన్ని బట్టి పొడగించే డ్యూటీ టైమ్స్ నేపథ్యంలో చాలా మంది రిస్క్ అవసరమా? అని భావిస్తారు. అందుకే రైల్వే రంగం వైపు వచ్చేందుకు ఒకప్పుడు మహిళలు వెనుకాడేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పురుషులతో సమానంగా స్త్రీలు రైల్వే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత పదేళ్లలో భారతీయ రైల్వేలో లేడీ లోకో పైలెట్ల సంఖ్య 5 రెట్లు పెరిగినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. రైల్వే మహిళా శక్తికి నిర్శనంగా మారినట్లు వెల్లడించింది.


371 నుంచి 1,828కి చేరిన లేడీ లోకో పైలెట్లు

2024 చివరి నాటి భారతీయ రైల్వేలో మహిళా లోకో పైలెట్ల సంఖ్య 1,828కి చేరింది. దశాబ్దం క్రితం దేశ వ్యాప్తంగా కేవలం 371 మంది లేడీ లోకో పైలెట్లు మాత్రమే ఉండేవారు. ఇక ఈ మహిళా లోకో పైలెట్లలో ఎక్కువ మంది ఉత్తర ప్రదేశ్ కు చెందిన వాళ్లు ఉన్నారు. 10 ఏండ్ల క్రితం ఈ రాష్ట్రం నుంచి 36 మంది లేడీ లోకో పైలెట్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 222కి పెరిగింది. ఆ తర్వాత సంస్థానంలో తెలంగాణ ఉంది. గతంలో 13 మంది ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 196కి పెరిగింది. మూడో స్థానంలో తమిళ నాడు ఉంది. దశాబ్దం క్రితం ఈ రాష్ట్రం నుంచి 39 మంది లేడీ లోకో పైలెట్లు ఉండగా, ఇప్పుడు 180కి చేరారు. గత పదేళ్లలో మహిళా స్టేషన్ మాస్టర్ల సంఖ్య కూడా ఐదు రెట్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు.


ప్రస్తుతం లోకో పైలట్లుగా మాత్రమే కాదు, టీటీఈలుగా, స్టేషన్ మాస్టర్లు, ట్రాక్‌ ఉమెన్, సిగ్నల్ నిర్వహణ, గార్డులు, గ్యాంగ్‌ మెన్ మొదలైన రంగాలలోకి మహిళలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రైల్వేలలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులలో మహిళలు లక్ష మందికి పైగా ఉండటం విశేషం. ఇది రైల్వే మొత్తం ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 8.2 శాతం కావడం విశేషం.

Read Also: పట్టాలెక్కబోతున్న హైడ్రోజన్ ట్రైన్, ముహూర్తం ఫిక్స్ చేసిన ఇండియన్ రైల్వే!

ఆ రైల్వే స్టేషన్లలో సిబ్బంది అంతా మహిళలే!

ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లలో కేవలం మహిళలే అన్నివిభాగాల్లో పని చేస్తున్నారు. ఏపీలో చంద్రగిరి రైల్వే స్టేషన్, తెలంగాణలో బేగంపేట రైల్వే స్టేషన్లలో సిబ్బంది అంతా మహిళలే ఉన్నారు. స్టేషన్ సూపరిడెంట్ నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు మహిళలే. మహిళలలో ఉన్న అభద్రతాభావాన్ని తొలగించేందుకు మహిళా రైల్వేస్టేషన్లుగా వీటిని ఇండియన్ రైల్వే గుర్తించింది. ఇక్కడ మొత్తం 14 విభాగాలలో మహిళలే అత్యుత్తమ విధులలో ఉంటూ ప్రజాదరణ పొందుతున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేలోని గుండ్ల పోచంపల్లి రైల్వే స్టేషన్, విద్యానగర్ రైల్వే స్టేషన్, విజయవాడ డివిజన్‌లోని రామవరపాడు రైల్వే స్టేషన్, గుంటూరు డివిజన్‌లోని న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ లు కూడా కేవళం మహిళా ఉద్యోగులే పని చేస్తున్నారు.

Read Also: హోలీ కోసం స్పెషల్ వందేభారత్, ఎక్కడి నుంచి ఎక్కడికి నడుస్తుందంటే?

Related News

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Watch Video: ఫోన్ కొట్టేసిన పోలీసు.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది, చివరికి..

Big Stories

×