Phone Charging Explode : ఈ మధ్య కాలంలో ఫోన్ కారణంగా జరిగే ప్రమాదాలకు లెక్కలేకుండా పోతుంది. ఛార్జింగ్ పెడుతూ ఫోన్స్ పేలిపోవటంతో పలువురు మృతి చెందిన ఘటనలు ఎప్పటికప్పుడు బయటపడుతున్నాయి. ఇక తాజాగా ఛార్జింగ్ నుంచి ఫోన్ తీస్తుండగా కరెంట్ షాక్ కొట్టటంతో ఓ యవతి మృతి చెందిన ఘటన స్మార్ట్ ఫోన్ వినియోగదారులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది.
ఫోన్ ఛార్జింగ్ తో ఇప్పటికే పలు చోట్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్ సారంగపూర్ గ్రామానికి చెందిన నీతు (22) అనే యువతి మెుబైల్ కు ఛార్జింగ్ పెట్టి కాసేపటి తర్వత తీసే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఆ మహిళకు కరెంట్ షాక్ కొట్టింది. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్లు కాపాడేందుకు ప్రయత్నించారు. కర్ర సహాయంతో యువతిని వైర్ నుంచి దూరం చేసి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఫోన్ భద్రతపై చర్చలు మరోసారి జోరందుకున్నాయి.
ఫోన్ తో ప్రమాదాలు పెరుగుతున్నాయా –
ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ వాడకం పెరుగుతున్నట్లే ప్రమాదాలు సైతం అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఫోన్స్ ఛార్జింగ్ సమయంలో పేలిపోవటం, ఛార్జింగ్ నుంచి తీస్తుండగా షాక్ కొట్టటం, ఫోన్ నుంచి మంటలు రావటం, బ్యాటరీ హీట్ ఎక్కి పేలిపోవటం వంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. అసలు ఈ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? భద్రత అవసరమా?
ఫోన్స్ ఎందుకు పేలుతున్నాయి –
మెుబైల్స్ పేలడానికి ప్రధాన కారణం అందులో ఉండే బ్యాటరీ. ఈ బ్యాటరీని లిథియం అయాన్ తో తయారు చేస్తారు. అయితే ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువగా ఈ రకం బ్యాటరీలనే వినియోగిస్తున్నాయి పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు. నిజానికి వీటి వలనే ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్యాటరీలో లిథియంతో పాటు ధన అయాన్ క్యాథోడ్, రుణ అయాన్ ఆనోడ్ సైతం ఉంటాయి. ఈ రెండింటినీ వేరు చేస్తూ కర్బన ద్రవమైన ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ఇక ధన, రుణ అయాన్లు ఒకదానికొకటి తాకితే రసాయన చర్య జరిగి పేలుడు సంభవిస్తుంది. అందుకే రెండింటినీ ఎలక్ట్రోలైట్లతో వేరు చేస్తారు.
బ్యాటరీని ఛార్జ్ చేసే సమయంలో అయాన్లు ఒకే దిశలో ప్రవహిస్తుంటాయి. ఎప్పుడైతే ఛార్జింగ్ ప్లగ్ తీసేస్తారో అప్పుడు అవి విద్యుత్‌ను రెండు వైపులా ప్రసారం చేయటం మెుదలు పెడతాయి. అయితే.. క్యాథోడ్, ఆనోడ్‌ల మధ్య ఛార్జింగ్ సమయంలో కర్బన ద్రవంలోంచి లిథియం కదులుతూ ఉంటుంది. అయితే క్విక్ ఛార్జింగ్ పద్ధతుల్లో బ్యాటరీని ఛార్జ్ చేసినపుడు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. ఇలాంటి సమయంలో అధిక వేడి ఉత్పత్తి అయ్యి ఆనోడ్‌పై ఉన్న లిథియం పేరుకుపోతుంది. దీని వలనే షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. అందుకే బ్యాటరీలతో ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఫోన్ బ్యాటరీతో తీసుకోవల్సిన జాగ్రత్తలు –
⦿ బ్యాటరీలు ఉబ్బినట్లు కనిపిస్తే వెంటనే చెక్ చేయించాలి
⦿ కంపెనీకి చెందిన ఒరిజనల్ ఛార్జర్లు, బ్యాటరీలను మాత్రమే వినియోగించాలి.
⦿ ఛార్జింగ్‌లో ఉండగా కాల్స్ మాట్లాడటం మాట్లాడకూడదు.
⦿ ఛార్జింగ్ పూర్తయిన వెంటనే ప్లగ్ తొలగించి, స్విచ్ ఆపేయాలి
⦿ నిద్రపోయే సమయంలో ఫోన్ ఛార్జింగ్ తీసేయాలి
⦿ ఫోన్ వేడెక్కినట్లు గుర్తిస్తే ఛార్జింగ్ ను తీసివేయాలి
⦿ ఫోన్ ను తేమ ఉన్న చోట ఉంచి ఛార్జింగ్ పెట్టకూడదు
ALSO READ : బిగ్ షాక్.. ఆ ఐఫోన్స్ లో నిలిచిపోనున్న వాట్సాప్ సేవలు.. మరి మీ ఫోన్ కూడా ఉందా?