Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ఇప్పుడు ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు డ్యాన్స్ షోలు చూసేవారికి .. సినిమాల గురించి తెల్సినవారికి మాత్రమే జానీ మాస్టర్ గురించి తెలిసేది. కానీ, ఎప్పుడైతే జానీ మాస్టర్ పై కేసు నమోదు అయ్యిందో.. అప్పటినుంచి అందరికీ ఆయన సుపరిచితుడుగా మారిపోయాడు. తన వద్ద పనిచేసిన లేడీ డ్యాన్సర్.. తనను లైంగికంగా వేధించడం, పెళ్లి చేసుకోమని బలవంతపెట్టడం, మతం మార్చుకోమని భయపెట్టడం లాంటివి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. ఈ కేసులో జానీ మాస్టర్ జైలుకు కూడా వెళ్లాడు.
బెయిల్ కోసం అప్లై చేయగా ఒకసారి జానీ మాస్టర్ రిజెక్ట్ చేయగా.. ఇంకోసారి కోర్టు రిజెక్ట్ చేసింది. ఆ తరువాత కొడుకు జైల్లో ఉండడం, బయట కొడుకు చేసిన పనికి జనాలు సూటిపోటి మాటలు అంటే విని తట్టుకోలేక జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు రావడంతో.. మూడోసారి ఆయనకు బెయిల్ వచ్చింది. ఇక జైలు నుంచి బయటకు వచ్చాకా.. జానీ మాస్టర్ తనను సపోర్ట్ చేసిన కుటుంబానికి, అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. అక్కడితో ఆగకుండా కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపాడు.
Keerthy Suresh : రెండుసార్లు పెళ్లి చేసుకోనున్న కీర్తి… మూడు రోజుల వేడుకలు
నిజం ఎప్పటికీ దాగదు. తప్పు చేసినవాడు అయితే బయటకు వచ్చాకా ఎవరి కంటికి కనిపించకుండా ఇంట్లోనే ఉండేవాడు. కానీ, తప్పు చేయలేదు కాబట్టి బెయిల్ నుంచి బయటకు రాగానే జానీ మాస్టర్ తనపని తాను చేసుకుంటూ పోతున్నట్లు కనిపిస్తుంది. నిత్యం సోషల్ మీడియా లో ఏదో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్నాడు.బయట ఈవెంట్స్ కు కూడా వెళ్లి.. మీడియా ముందు మాట్లాడుతున్నాడు. తన సత్తా చూపిస్తాను అని చెప్పుకొస్తున్నాడు.
ఇక ఈ కేసు తరువాత టాలీవుడ్ లో జానీ మాస్టర్ కు ఛాన్స్ లు రావడం తగ్గింది కానీ, బాలీవుడ్ మాత్రం ఇప్పటికీ ఆయనకు రెడ్ కార్పెట్ పరుస్తుంది. తాజాగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన బాలీవుడ్ చిత్రం బేబీ జాన్. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మధ్యనే ఈ చిత్రం నుంచి నైన్ మటాకా అంటూ ఒక సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ లో కీర్తి సురేష్ అందాల ఆరబోత నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
Sobitha Dhulipalla: అక్కినేని కోడలి తెలుగుదనం పెళ్లి వరకేనా.. ?
మునుపెన్నడూ లేని విధంగా కీర్తి అందాల ఆరబోత చేసింది. ఇక ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసింది జానీ మాస్టర్ నే. తాజాగా ఆ సాంగ్ కు తన డ్యాన్స్ స్టూడియోలో మరో లేడీ డ్యాన్సర్ తో కలిసి ఆ స్టెప్స్ వేస్తూ కనిపించాడు. ఆ వీడియోను షేర్ చేస్తూ.. ఎనర్జిటిక్ నైన్ మటాకా స్టెప్స్ వేసి తనను ట్యాగ్ చేయమని కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియోపై అభిమానులు పలురకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది సూపర్.. సత్తా చూపిస్తున్నావ్ అంటుండగా.. ఇంకొందరు మాత్రం.. ఇంకా బుద్ధి రాలేదా.. ? ఇంకో అమ్మాయితో ఈ డ్యాన్స్ లు ఏంటి.. ? అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి జానీ మాస్టర్ ముందు ముందు తనను తాను ఎలా ప్రూవ్ చేసుకుంటాడో చూడాలి.
The prep behind the PATAKA song of the year 💃🕺💥
Groove to the energetic beats of #NainMatakka and tag me 🤩#BabyJohn @MuradKhetani @priyaatlee #JyotiDeshpande @Atlee_dir @Varun_dvn @KeerthyOfficial #WamiqaGabbi @bindasbhidu @rajpalofficial @kalees_dir @diljitdosanjh… pic.twitter.com/JMHrYbuT0T
— Jani Master (@AlwaysJani) December 1, 2024