Whatsapp : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదారణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. మెటా తీసుకొచ్చిన ఈ యాప్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ను సంతరించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వినియోగదారుల భద్రతను మరింత పెంచే దిశగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న ఈ సంస్థ.. యాపిల్ కంపెనీకి చెందిన పాత ఐఫోన్‌లకు మద్దతును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మే 5, 2025 తర్వాత WhatsApp iOS వెర్షన్‌కు మద్దతు ఇవ్వడం ఆపివేస్తుందని తెలుపుతూ మెటా వినియోగదారులకు నోటిఫికేషన్స్ పంపింది. ఈ విషయం ఐఫోన్ వినియోగదారులకు షాకింగ్ గా మారింది.
డేటా షేరింగ్, మెసేజెస్, డేటా ట్రాన్స్ఫర్ వంటి పలు సేవలకు వేదికగా మారిన వాట్సాప్ కు ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా 2.95 బిలియన్లకు పైగా యాజర్స్ ఈ యాప్ ను ఉపయోగిస్తున్నారు. ఇక 140 బిలియన్ సందేశాలను రోజూ ప్రాసెస్ చేస్తుంది వాట్సాప్. ఇంతగా యూజర్స్ షేరింగ్ లో భాగంగా మారిపోయిన వాట్సాప్ తన వినియోగదారుల భద్రతే లక్ష్యంగా పనిచేస్తుంది. అప్డేట్స్ తో పాటు లేటెస్ట్ ఫీచర్స్ ను సైతం అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇక భద్రతలో భాగంగా తాజాగా ఐఫోన్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పేసింది. పాత ఐఫోన్స్ లో వాట్సాప్ పనిచేయదని తెలిపింది. అవును, మీరు విన్నది నిజమే! వచ్చే సంవత్సరం నుంచి పాత ఐఫోన్ మోడల్స్ కు వాట్సాప్ సపోర్ట్ చేయదని వెల్లడించింది. WhatsApp iOS వెర్షన్‌కు మద్దతు ఇవ్వడం ఆపివేస్తుందని తెలుపుతూ మెటా వినియోగదారులకు నోటిఫికేషన్స్ సైతం పంపటంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయంశంగా మారింది.
వాట్సాప్ ఏ ఐఫోన్స్ లో పనిచేయదంటే – ఐఫోన్ ఓల్డ్ మోడల్స్ iPhone 5s, iPhone 6 మరియు iPhone 6 Plusలకు వాట్సాప్ సపోర్ట్ చేయదు. ఈ పాత iPhoneలు iOS 12.5.7కి అప్‌డేట్ చేయలేకపోతే మద్దతు ఇవ్వవని తెలిపింది. ఇతర iPhone మోడల్‌లు ప్రస్తుతం ఉన్న iOS అప్డేట్స్ కు అనుకూలంగా ఉన్నంత కాలం వాట్సాప్ పనిచేస్తుందని తెలిపింది.
ఇక మే 5, 2025 తర్వాత WhatsApp iOS వెర్షన్‌కు మద్దతు ఇవ్వడం ఆపివేస్తుందని తెలుపుతూ మెటా వినియోగదారులకు నోటిఫికేషన్స్ పంపింది. మెుబైల్ 15.1 కంటే ముందు iOS వెర్షన్‌లలో రన్ అవుతున్నట్లయితే.. కచ్చితంగా iPhoneను అప్డేట్ చేయాలని లేదా కొత్త వెర్షన్ ను తీసుకోవాలని తెలిపింది. లేదంటే సేవలు నిలిచిపోతాయని హెచ్చరించింది.
WhatsApp iOS 12 తో పాటు ఆ తదుపరి మోడల్స్ కు సైతం సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. iOS 15.1 లేదా లేటెస్ట్ అప్డేట్స్ కు సపోర్ట్ చేయనుంది. ఇక మెటా పంపిన అప్‌డేట్ నోటీసు వ్యవధి 5 నెలలు కాబట్టి వినియోగదారులు ఈలోగా తమ ఐఫోన్‌లను అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ మార్పు చేయడానికి మెటా ప్రధాన కారణం… కొత్త iOS అప్డేట్స్ ను మరింత సాంకేతికతతో విస్తరించటమేనని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఫోన్‌లోని సెట్టింగ్‌లకు వెళ్లి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ లో తాజా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు.
ALSO READ : స్మార్ట్‌ఫోన్‌లో యాడ్స్ విసిగిస్తున్నాయా? ఇలా చేస్తే ఒక్క యాడ్ కూడా కనిపించదు