E-Paper
Advertisement

Moose : పర్యావరణానికి మేలు చేస్తున్న మూస్..

Moose  : పర్యావరణానికి మేలు చేస్తున్న మూస్..
Advertisement
Moose

Moose : పర్యావరణం అనేది కేవలం మనుషులు జీవించడానికే కాదు.. ఇతర జీవరాశులు, చెట్లు కూడా బతకడానికి.. అని పర్యావరణవేత్తలు ఎప్పటికప్పుడు గుర్తుచేస్తుంటారు. మానవాళి వల్లే పర్యావరణం దెబ్బతింటోందని కొందరి వాదన. అయితే మానవాళి వల్ల దెబ్బతిన్న పర్యావరణాన్ని తెలిసో తెలియకో జంతువులు రక్షిస్తున్నాయి. తాజాగా ఓ జంతువు వల్ల అడవులపై పాజిటివ్ ఎఫెక్ట్ పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

మూస్.. ఇది జింకల్లోనే ఒక జాతి. చూడడానికి జింకలాగానే ఉన్నా.. దీని ఆకారం కొంచెం వేరుగా ఉంటుంది. దీన్నే తెలుగులో దుప్పి అని కూడా అంటారు. మూస్ అనేది జింకతో పోలిస్తే మరింత పెద్దగా, బలంగా ఉంటుంది. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో వాతావారణ మార్పులపై మూస్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని తేలింది. కొన్ని అడవుల్లో కార్బన్ శాతం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. ఆ కార్బన్ శాతాన్ని తగ్గించాడనికి మూస్ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Advertisement

మామూలుగా అడవులు జీవించే కొన్ని జంతువులు మొక్కలను ఎక్కువగా తినేస్తూ ఉంటాయి. దీని వల్ల చెట్ల పెంపకంపై ఎఫెక్ట్ పడుతుంది, అంతే కాకుండా ఎక్కువ మొత్తంలో మొక్కలను తిని అక్కడే మలమూత్రాలను చేయడం వల్ల మట్టి క్వాలిటీ కూడా దెబ్బతింటుంది. అది జంతువులు తినే ఆహారంపై ఉంటుంది. కొన్ని జంతువులు బలంగా ఉండడం కోసం ఎక్కువగా తింటాయి. అలాగే ఒక మూస్ రోజుకు 60 పౌండ్ల ఆహారాన్ని తింటుంది. ఇది ఇతర జంతువులతో పోలిస్తే చాలా రెట్లు ఎక్కువ.

మూస్ ఎక్కువగా ఉత్తర దిశగా ఉన్న అడవుల్లోనే జీవిస్తుంటాయి. భూమి మొత్తం మీద ఉన్న అడవుల్లో 30 శాతం అడవులు ఈ ఉత్తర ప్రాంతాలకు చెందినవే. ఇవి మనుషులు జీవించే ప్రాంతాల నుండి కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుని చెట్లలో, మట్టిలో స్టోర్ చేస్తాయి. ఇలా స్టోర్ అయినవాటిపై మూస్ పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నార్వేగియన్ అడవుల్లో జీవిస్తున్న మూస్‌లపై శాస్త్రవేత్తలు గత 11 ఏళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ పరిశోధనల్లో మూస్ వల్ల జరుగుతున్న ఎఫెక్ట్ గురించి బయటపడింది.

Advertisement

మామూలుగా అడవి జంతువులు అడవిలోని మొక్కలను తినేసినప్పుడు వాటిని మళ్లీ నాటే బాధ్యత ప్రభుత్వం స్వీకరిస్తుంది. అవి మళ్లీ పెరిగిన తర్వాత జంతువులు వాటిని మళ్లీ తింటాయి. ఇది ఒక సైకిల్‌లాగా నడుస్తుంది. అయితే జంతువుల కొన్ని మొక్కలను వదిలేస్తూ ఉంటాయి. చిన్న చిన్న కలప మొక్కలను అవి తినవు. ఇది అడవుల్లో వెజిటేషన్ పెంపకంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కార్బన్ సైకిల్‌పై, వాతావరణ మార్పులపై మూస్ ప్రభావం ఇంకెంతగా ఉందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలు చేయనున్నారు.

Tags

Related News

రూ.6 వేలకే ఇలాంటి హోమ్ థియేటరా.. భారత్‌లోకి పోర్ట్రానిక్స్ సరికొత్త సౌండ్ సిస్టమ్!

అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

గూగుల్ కంటే ఏఐ సెర్చ్ వేగంగా పనిచేస్తుందా? ఏ సమయంలో ఏది వాడటం బెటర్?

Airtel యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ప్రచారంలో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన టెలికాం దిగ్గజం

కొత్త Air Purifier కొనేముందు తప్పక చూడాల్సిన 5 ముఖ్యమైన ఫీచర్లు ఇవే!

ఈ స్మార్ట్‌వాచ్ దెబ్బకు మార్కెట్ షేకవ్వాల్సిందే.. భారీ అప్‌గ్రేడ్‌తో Galaxy Watch 9!

ఛార్జర్ లేదా? డోంట్ వర్రీ.. ఫోన్ బ్యాటరీ ఫుల్ చేయడానికి ఈ ఒక్క కేబుల్ చాలు!

అమెజాన్ బంపరాఫర్.. ‘వన్‌ప్లస్ 13’పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!

Big Stories

Advertisement
×