Moto S50 Price: టెక్ బ్రాండ్ మోటోరోలా దేశీయ మార్కెట్‌లో దూసుకుపోతుంది. సామాన్యులే లక్ష్యంగా కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అదే సమయంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను సైతం రిలీజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంకా కలర్ వేరియంట్స్, డిజైన్, ఫీచర్స్ ఇలా ప్రతి ఒక్క విభాగంలోనూ అందరిచేత ప్రశంసలు పొందింది. ఇలా ప్రతీ సిగ్మెంట్‌లో కొత్త ఫోన్లను తీసుకొచ్చి మార్కెట్‌లో ఇతర ప్రముఖ బ్రాండెడ్ ఫోన్లకు పోటీగా నిలిచింది. తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. Motorola తన కొత్త స్మార్ట్‌ఫోన్ Moto S50ని చైనా మార్కెట్‌లో విడుదల చేసింది.
ఈ స్మార్ట్‌ఫోన్ 6.36 అంగుళాల డిస్‌ప్లేతో డైమెన్సిటీ 7 సిరీస్ ప్రాసెసర్‌తో అమర్చబడింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 68W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా మరెన్నో ఫీచర్లు ఉందులో ఉన్నాయి. ఇప్పుడు Moto S50 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, దాని ధర గురించి ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం.
Moto S50 Specifications
Also Read: వారెవ్వా.. రియల్‌మి నుంచి మెస్మరైజింగ్ స్మార్ట్‌ఫోన్.. ఇక దూకుడే!
Moto S50 స్మార్ట్‌ఫోన్ 6.36-అంగుళాల LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. డిస్ప్లే 3000 నిట్‌ల స్థానిక గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అలాగే వినియోగదారుల వీక్షణ కోసం గొరిల్లా గ్లాస్ సేఫ్టీ అందుబాటులో ఉంది. ఇంకా అదనపు సేఫ్టీ కోసం ఇది ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో LPDDR4X RAM + UFS 2.2 స్టోరేజ్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4310mAh బ్యాటరీతో వస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.
కేవలం 13 నిమిషాల్లోనే ఫోన్‌ను 0 నుంచి 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో OIS మద్దతుతో 50 మెగాపిక్సెల్ Sony IMX896 ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ GalaxyCore GC13A2 అల్ట్రా-వైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 10 మెగాపిక్సెల్ Samsung S5K3K1 టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారిత హలో UIతో ప్రీలోడ్ చేయబడింది. ఇతర లక్షణాలలో NFC మద్దతు, IP68 రేటింగ్ ఉన్నాయి. ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం అధిక రేటింగ్‌ను కలిగి ఉంది.
Moto S50 Price
Moto S50 ధర విషయానికొస్తే.. Moto S50 స్మార్ట్‌ఫోన్ మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో 12GB + 256GB వేరియంట్ ధర 2,199 యువాన్లు (సుమారు రూ. 26,032)గా ఉంది. అలాగే 12GB + 512GB వేరియంట్ ధర 2,499 యువాన్ (సుమారు రూ. 29,391) గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ Persimmon Orange, Flora Blue, Latte వంటి కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.