BigTV English

Motorola Edge 50 Fusion Launch: 50MP కెమెరాతో మోటో కొత్త ఫోన్ లాంచ్.. ధర, ఆఫర్లు మరియు దుమ్ములేపుతున్న ఫీచర్లు!

Motorola Edge 50 Fusion Launch: 50MP కెమెరాతో మోటో కొత్త ఫోన్ లాంచ్.. ధర, ఆఫర్లు మరియు దుమ్ములేపుతున్న ఫీచర్లు!

Motorola Edge 50 Fusion Launched with 50MP Camera: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా తాజాగా తన తదుపరి మొబైల్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. Motorola Edge 50 Fusion పేరుతో దీన్ని ఇవాళ (మే 16)న భారతదేశంలో రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఎడ్జ్ 50-సిరీస్‌లో ఒక భాగం. Motorola Edge 50 Fusion Sony LYTIA-700C సెన్సార్‌తో కూడిన 50MP కెమెరా, Qualcomm Snapdragon 7s Gen 2 సిస్టమ్-ఆన్-చిప్ (SoC) వంటి టాప్-ఆఫ్-ది-లైన్ ఫీచర్‌లతో వస్తుంది. అలాగే 12GB వరకు RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది.


Motorola Edge 50 Fusion మూడు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో వేగన్ లెదర్ ఫినిషింగ్‌తో మార్ష్‌మల్లో బ్లూ, వేగన్ స్వెడ్ ఫినిషింగ్‌తో హాట్ పింక్, యాక్రిలిక్ గ్లాస్ ఫినిషింగ్‌తో ఫారెస్ట్ బ్లూ కలర్‌లు ఉన్నాయి. ఇది దేశంలో రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. 8GB + 128GB వేరియంట్ ధర రూ.22,999గా ఉంది. అలాగే 12GB + 256GB వేరియంట్ ధర రూ.24,999గా కంపెనీ నిర్ణయించింది.

Motorola Edge 50 Fusion Specifications:


Motorola Edge 50 Fusion 6.67-అంగుళాల పూర్తి HD+ పోల్డ్ ఎండ్‌లెస్ ఎడ్జ్ డిస్‌ప్లేతో 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144Hzను కలిగి ఉంది. 1,600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఆక్వా టచ్ ఫీచర్, 360Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో గేమ్ మోడ్‌ను కలిగి ఉంది. Qualcomm Snapdragon 7s Gen 2 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది.

Also Read: మతిపోగొడుతున్న మోటో కొత్త మడత ఫోన్.. స్క్రీన్ ఎంత స్టైలిష్‌గా ఉందంటే..?

ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌తో నడుస్తుంది. మోటరోలా మూడు సంవత్సరాల OS అప్‌డేట్‌లను, నాలుగు సంవత్సరాల భద్రతా నవీకరణలను వినియోగదారులకు అందిస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే ఫోన్ 68W TurboPower ఫీచర్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విషయానికి వస్తే.. Motorola Edge 50 Fusion ముందు భాగంలో 32MP కెమెరాను కలిగి ఉంది. వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP సోనీ లిటియా 700C సెన్సార్, 13MP అల్ట్రా-వైడ్-యాంగిల్ మాక్రో విజన్ సెన్సార్ ఉన్నాయి.

Motorola Edge 50 Fusion Offers:

Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో మే 22 మధ్యాహ్నం 12 గంటల నుండి Flipkart, Motorola.in, Reliance Digitalతో సహా ప్రముఖ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయబడుతుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా, కంపెనీ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.2000 తక్షణ బ్యాంక్ తగ్గింపును అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.2000 ఎక్స్ఛేంజ్ బోనస్, ICICI బ్యాంక్ కార్డ్‌లపై నెలకు రూ.2,334 నుండి తొమ్మిది నెలల వరకు అదనపు నో-కాస్ట్ EMIని కూడా అందిస్తోంది.

Also Read: Moto X50 Ultra : 125W ఫాస్ట్ ఛార్జింగ్‌, డాల్బీ సౌండ్ సిస్టమ్‌తో మోటో X50 Ultra.. మే 24 న సేల్ స్టార్ట్!

అంతేకాకుండా జియో సబ్‌స్క్రైబర్‌లకు అదనపు ఆఫర్‌లలో భాగంగా.. స్విగ్గిలో ఫుడ్ ఆర్డర్‌లపై రూ.299పై రూ.125 తగ్గింపు, అజియోలో రూ.999 కనీస లావాదేవీపై రూ.200 తగ్గింపు, EaseMyTrip ద్వారా బుకింగ్‌లపై, AbhiBus ద్వారా బస్సు బుకింగ్‌లపై రూ.1,000 వరకు తగ్గింపు పొందవచ్చు.

Tags

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×