Heavy Rains in Hyderabad: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. అరగంట నుంచి నాన్‌స్టాప్‌గా కురుస్తోంది. కూకట్‌పల్లి, అమీర్‌పేట్, బంజారాహిల్స్, మాసాబ్‌ట్యాంక్, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్ తడిసి ముద్దయ్యాయి. సిటీలో జనజీవనం స్తంభించిపోయింది.
నగరంలో కుండపోత వర్షం కురుస్తున్న నేపథ్యంలో మేయర్ జీహెచ్ఎంసీ అధికారులను అలెర్ట్ చేశారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలో డీఆర్ఎఫ్ సిబ్బందిని అలెర్ట్ చేశారు. వర్షపు నీరు రోడ్డు మీదకు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దని నగర ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది.
హైదరాబాద్ నగరంలో అత్యధికంగా ఖైరతాబాద్‌లో 5.13 సెం.మీల వర్షపాతం నమోదైంది. బాలానగర్‌లో 4.25 సెం.మీ, షేక్ పేట్‌లో 4.23 సెం.మీ, శేరిలింగంపల్లిలో 4.08 సెం.మీ, మల్కాజ్ గిరిలో 4.05 సెం.మీల వర్షపాతం నమోదైంది.
Also Read: Weather Update : మరో 5 రోజులు కుండపోతే.. నేడు ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
హైదరాబాద్‌తో పాటు వర్షం పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. సంగారెడ్డి పట్టణంలో భారీ వర్షం కురిసింది. వీధులన్నీ జలమయమయ్యాయి. అరగంట వ్యవధిలోనే సంగారెడ్డి పట్టణం తడిసి ముద్దయింది. రోడ్లపై మోకాలిలోతులో వర్షపునీరు చేరడంతో వాహన దారుల ఇబ్బందులకు గురయ్యారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట తటాకంలో కనిపిస్తోంది. పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షం, గాలి దుమారానికి చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.