BigTV English

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Motorola Edge 50 Neo 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ మోటరోలా.. బడ్డెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ మరో సూపర్ మోడల్ లాంచ్ చేసింది. భారతదేశంలో కూడా ఇది అందుబాటులోకి మరో వారం రోజుల్లో వచేస్తుంది. క్వాలిటీ స్మార్ట్ ఫోన్లు కస్టమర్లకు అందుబాటు ధరలో విక్రయించే మోటరోలా.. ఈ సారి మోటరోలా ఎడ్జ్ 50 నియో 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చింది.


ఇప్పటికే ఉన్న మోటరోలా ఎడ్జ్ 50 సిరీస్ లో అదనంగా ఎడ్జ్ 50 నియో మోడల్స్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లో IP68 వాటర్ రెసిస్టెన్స్, వైర్‌లెస్ ఛార్జింగ్‌ వంటి క్రేజీ ఫీచర్లు ఉండడం స్పెషల్.

Motorola Edge 50 Neo 5G ధర
Motorola Edge 50 Neo 5G 8GB RAM, 256GB స్టోరేజీతో ఒకే వేరియంట్‌లో లాంచ్ అయింది. దీని ధర రూ. 23,999. కస్టమర్లకు Edge 50 Neo 5G నాలుగు రంగుల వేయింట్స్.. నాటికల్ బ్లూ, పోయిన్సియానా, లట్టే, గ్రిసైల్లె కలర్స్ లో లభిస్తుంది.


మోటరోలా, ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్‌సైట్ లో సెప్టెంబరు 24 మధ్యాహ్నం నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయం ప్రారంభమవుతుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా, Motorola Edge 50 Neo 5G కొనుగోలుపై రూ. 1,000ల ఫ్లాట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా ప్రకటించింది.

Also Read: స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ తో రూ.999కే మొబైల్ ఫోన్.. UPI పేమెంట్స్ కూడా చేయొచ్చు

1.5K రిజల్యూషన్‌ డిస్‌ప్లే

Motorola Edge 50 Neo 5G స్మార్ట్ ఫోన్ లో 1.5K pOLED LTPO డిస్‌ప్లే ఉంది. ఇది గరిష్టంగా 3000 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్, HDR10+కి సపోర్ట్ చేస్తుంది. మంచి వ్యూ ఎక్స్ పీరియన్స్ కోసం ఇందులో వైబ్రంట్ కలర్స్, డీప్ కాంట్రాస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కొత్త స్మార్ట్ ఫోన్.. MediaTek Dimensity 7300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8జీబి LPDDR4X ర్యామ్ ని సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అయ్యే ఈ స్మార్ట్ ఫోన్ 256GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. దీన్ని మరింత ఎక్స్ ప్యాండ్ చేయవచ్చు.

అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ కోసం మోటరోలా ఎడ్జ్ 50 నియోలో ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్ లాక్, వంటి సెక్యూర్ యాక్సెస్ ఫీచర్స్ ఉన్నాయి.

ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలతో కూడిన బ్యాటరీ
ఎడ్జ్ 50 నియోలో 4310mAh బ్యాటరీ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 65W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడంతో మీరు వేగంగా పవర్ అప్ చేయడానికి వీలుంటుంది.

IP68 వాటర్ రెసిస్టెన్స్ (వాటర్ ఫ్రూఫ్)
మోటరోలా ఎడ్జ్ 50 నియో IP68 రేటింగ్ లభించడం చాలా స్పెషల్. అంటే ఈ స్మార్ట్‌ఫోన్ నీటిలో మునిగిపోయినా ఎటువంటి నష్టం జరగదు. ఫోన్ జేబులో పెట్టుకొని నీళ్ళోలో దూకినా ఏ సమస్య రాదు. స్మిమ్మింగ్, సర్ఫింగ్, స్నార్కెలింగ్ వంటి వాటర్‌స్పోర్ట్స్ తరుచూ చేసే వాళ్లకు ఈ స్మార్ట్ ఫోన్ ఉపయోగకరంగా ఉంటుంది.

50MP ప్రధాన షూటర్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్
ఫోటోగ్రఫీ హాబీ ఉన్నవారికి స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ చేశారు. 50MP ప్రధాన షూటర్‌తో, నీటిలో కూడా స్పష్టమైన, స్థిరమైన షాట్‌లు తీయడానికి OIS సపోర్ట్ ఉంది. మిగతా రెండు కెమెరాలలో 13MP అల్ట్రా-వైడ్ షూటర్ మరియు 10MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి. ముందు భాగంలో.. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 32MP కెమెరా అమర్చారు.

Related News

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Gaming Phone: 16GB ర్యామ్, 120W ఛార్జింగ్ గల రియల్‌మి గేమింగ్ ఫోన్.. అమెజాన్ ఫెస్టివల్‌లో ₹18,000 ధర తగ్గింపు!

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Big Stories

×